- Home
- Entertainment
- Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు 12వ వారం ఓటింగ్.. టాప్‌లో ఉన్నది వీళ్లే, మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు 12వ వారం ఓటింగ్.. టాప్‌లో ఉన్నది వీళ్లే, మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10.. 12 వారం ఓటింగ్ రిజల్ట్ బయటకు వచ్చింది. ఈ వారంలో ప్రధానంగా ముగ్గురు డేంజర్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే?

బిగ్ బాస్ 10 తెలుగు 12 వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 ముగింపుకి చేరుకుంటోంది. చూస్తుండగానే షో చివరికి వచ్చేసింది. ఇంకా మూడు వారాలే ఉంది. ప్రస్తుతం హౌజ్‌లో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వంశీ, సుధీర్, రామకృష్ణ, రామ్ ప్రసాద్, నరేష్, శివ, వర్షిణి, అమన్ ఉన్నారు. వీరిలో ఈ నాలుగు వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరెవరు టాప్ 5లోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు 12వ వారం ఓటింగ్ రిజల్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించిన పోలింగ్‌లో ఆసక్తికర రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఈ వారం హౌజ్‌ని వీడెది ఎవరనేది చూస్తే.
టాప్‌లో త్రిగుణ్, ముఖేష్.. మరి బాటమ్‌లో ఉన్నదెవరు
12వ వారం నామినేషన్లో త్రిగుణ్, ముఖేష్, రామ్ ప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీ, వంశీ, వర్షిని ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగానే త్రిగుణ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. అత్యధిక ఓటింగ్ శాతంతో నెంబర్ వన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ముఖేష్‌కి భారీగా ఓట్లు పడుతున్నాయి. వీరిద్దరి మధ్య గటి పోటీ ఉంటోంది. రామ్ ప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీకి యావరేజ్‌గా ఓటింగ్ పడుతుంది.
ఇక వంశీ, వర్షిణి బాటమ్‌లో ఉన్నారు. వరుసగా మూడు రోజులుగా వర్షిణినే బాటమ్‌లో ఉంది. దీంతో ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే వర్షిణిపై చాలా విమర్శలు ఉన్నాయి. ఆమెని బిగ్ బాస్ కావాలనే సేవ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె డేంజర్లో ఉండటం గమనార్హం.
వీరిలో ఒకరు ఎలిమినేట్
ఈ వారం ఎలిమినేషన్ వంశీగానీ, వర్షిణిగానీ అయ్యే ఛాన్స్ ఉందని ఓటింగ్ బట్టి తెలుస్తోంది. కానీ రామకృష్ణ కూడా డేంజర్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది ప్రైవేట్ ఓటింగ్. దీన్ని అధికారిక ఓటింగ్‌గా భావించలేం. మరి అధికారిక ఓటింగ్ ప్రకారం ఎవరు టాప్‌లో, ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది చూడాలి. కాకపోతే ఈ వారం మాత్రం వర్షిణి, వంశీ, రామకృష్ణలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
రామకృష్ణని వెంటాడుతున్న ఎలిమినేషన్
రామకృష్ణ వీక్‌గా ఉన్నారని, ఆయన్ని ఎలిమినేట్ చేయాలనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఓటింగ్ ప్రకారం చేస్తారా? కంటెంట్ పరంగా వీక్ గా ఉన్నవాళ్లని ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. బిగ్ బాస్ గత కొన్ని వారాలుగా ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మంచి ఓటింగ్ పడ్డవాళ్లని, స్ట్రాంగ్ కంటెస్టెంట్లని కూడా ఎలిమినేట్ చేస్తున్నారని అంటున్నారు. మొన్న నటరాజ్ మాస్టర్ కూడా అదే ఆరోపణలు చేశారు. ఈ వారం అదే జరుగుతుందా? దాన్ని బ్రేక్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ వారం ఎలిమినేషన్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అదే సమయంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషనేనా అనేది కూడా తెలియాల్సి ఉంది.













