వేదనతోనే కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్
సమంత అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ఎమోషనల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Samantha
స్టార్ లేడీ సమంత(Samantha) అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఆమె ఒక ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ కోట్ షేర్ చేశారు. కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్ళండి. నియంత్రించగల విషయాలు నియంత్రించండి. మనం సులభంగా సాధించగల లక్ష్యాలు నిర్ధేసించుకోండి. దానికి ఇది సరైన సమయం అనుకుంటున్నాను. అందరికీ 2023 న్యూ ఇయర్(New Year 2023) విషెస్... అంటూ సమంత కామెంట్ పోస్ట్ చేశారు.
samanta
సమంత కొత్త సంవత్సర శుభాకాంక్షలు పోస్ట్ వైరల్ అవుతుంది. సమంత పోస్ట్ పై స్పందిస్తున్న అభిమానులు తిరిగి విషెస్ తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఆమె మయోసైటిస్ నుండి బయటపడాలని కోరుకుంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Samantha
ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. యశోద చిత్ర విడుదలకు ముందు తన ఆరోగ్య పరిస్థితి సమంత తెలియజేశారు. సమంత ప్రకటన ఒకింత అందరినీ ఆందోళనకు గురి చేసింది. చిరంజీవితో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సమంత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు.
ఆమె వ్యాధి గురించి అనేక నిరాధార కథనాలు చక్కర్లు కొట్టాయి. యాంకర్ సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన హెల్త్ కండిషన్ పై ఒక స్పష్టత ఇచ్చారు. మీడియాలో వచ్చినట్లు నేనేమీ చనిపోవడం లేదు. బ్రతికే ఉన్నాను. మయోసైటిస్ అంత ప్రాణాంతకం కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను దీంతో పోరాడాల్సి ఉంది. బయటపడతానన్న నమ్మకం ఉంది.... అని సమంత ఎమోషనల్ అయ్యారు.
మెరుగైన వైద్యం కోసం సమంత ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత కొన్నాళ్ల వరకు షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్స్ వదిలేశారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల నుండి సమంత తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Samantha
ప్రస్తుతం సమంత శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. విజయ్ దేవరకొండకు జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ ఆలస్యమయ్యే సూచనలు కలవు.