- Home
- Entertainment
- Samantha: సమంత ఊరమాస్ డ్యాన్స్.. స్టార్ హీరోతో కలిసి రెచ్చిపోయిన హాట్ బ్యూటీ.. ట్రెండింగ్
Samantha: సమంత ఊరమాస్ డ్యాన్స్.. స్టార్ హీరోతో కలిసి రెచ్చిపోయిన హాట్ బ్యూటీ.. ట్రెండింగ్
సమంత సౌత్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు నార్త్ పై పాగవేయబోతుంది. తాజాగా ఆమె `కాఫీ విత్ కరణ్` షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది.

సమంత (Samantha) ఫస్ట్ టైమ్ `కాఫీ విత్ కరణ్`(Koffee with Karan) షోలో పాల్గొంది. కరణ్ జోహార్ హోస్ట్ గా ఈ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్(Akshay Kumar)తో కలిసి సమంత పాల్గొంది. ఇందులో అనేక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది. సమంతకి సంబంధించిన పలు సీక్రెట్లు కూడా బయటపెట్టినట్టు సమాచారం. పెళ్లిపై సామ్ ఓపెన్ అయ్యిందట.
ఈ నేపథ్యంలో సమంత.. అక్షయ్ కుమార్‌తో కలిసి చేసిన రచ్చే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇద్దరు కలిసి చేసిన మాస్ డాన్సు హీటెక్కిస్తుంది. నెటిజన్లకి, ఆమె అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు `పుష్ప`(Pushpa) ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంది. ఇందులో సమంత అక్షయ్ కుమార్‌తో కలిసి డాన్సు చేసింది.
`పుష్ప`లో సమంత ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ`(Oo Antava OO OO Antava mava) అంటూ సాగే పాటలో సమంత మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి ఉర్రూతలూగించింది. ఈ పాట సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. అంతేకాదు పాట ఖండంతరాలు దాటుకుని పాపులర్ అయ్యింది. ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ పాటని ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు.
ఈ పాట హిందీలోనూ విశేష ఆదరణ పొందింది. తాజాగా `కాఫీ విత్ కరణ్` షోకి వస్తూ వస్తూ సమంత, అక్షయ్ కుమార్ డాన్సు చేయడం విశేషం. బన్నీతో చేసినదాన్ని మించి సమంత.. అక్షయ్‌తో కలిసి ఈ ఊరమాస్ స్టెప్పులేయడం హైలైట్‌గా నిలుస్తుంది. తాజాగా ఈ ప్రోమోని విడుదల చేశారు `కాఫీ విత్ కరణ్` నిర్వహకులు. ప్రస్తుతం ఈ వీడియో ప్రోమో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
అంతేకాదు సమంత, అక్షయ్ కుమార్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నాటు స్టెప్పుకి వీరిద్దరు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హీటు పుట్టిస్తుండటం విశేషం. నెటిజన్లు ఇదే కామెంట్ చేస్తున్నారు. మంటలు పుట్టిస్తున్న సామ్-అక్కీ జంట అని, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మంచి రొమాంటిక్ సినిమా తీయాలని కోరుకుంటున్నారు. నెటిజన్లు నెట్టింట రచ్చ చేస్తున్నారు.
ఇక మంగళవారం విడుదల చేసిన ప్రోమోలో సమంతని అక్షయ్ ఎత్తుకుని తీసుకురావడం, ఇద్దరు కలిసి జిగ్ జాగ్ డాన్సు చేయడం, పెళ్లిపై సమంత స్పందించడం వంటివి ఉన్నాయి. తాజా ప్రోమోలో `ఊ అంటావా` పాటకి డాన్సులు వేయడం విశేషం. వీరిద్దరు పాల్గొన్న ఎపిసోడ్ రేపు(గురువారం) సాయంత్రం ఏడుగంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం చేయబోతున్నారు. ఈ సారి `కాఫీ విత్ కరణ్` ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు సమంత కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఆమె పాన్ ఇండియా చిత్రాలు `యశోద`, `శాకుంతలం`, `ఖుషి`తోపాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా, అలాగే మరో సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా చేయబోతున్నారు.