నయా ఔట్‌ఫిట్‌లో లుక్స్ క్రేజీ.. `సాకి` దుస్తుల్లో మెరిసిపోతూ పిచ్చెక్కిస్తున్న సమంత పోజులు
సమంత ఫారెన్ నుంచి ఇటీవల ముంబయి చేరుకుంది. తరచూ బాండే వీధుల్లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. చాలా రోజుల తర్వాత సామ్‌ని చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు.
photo credit- samantha instagram
సమంత.. సినిమాలతోపాటు సొంత వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంది. అందులో `సాకి` అనే ఫ్యాషన్ వేర్‌ని నిర్వహిస్తుంది. తన మార్క్ స్పెషల్ డిజైనింగ్ వేర్స్, కాజ్వల్స్ ఇందులో లభిస్తాయి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఫ్యాషన్ వరల్డ్ గా దీన్ని చెప్పొచ్చు.
photo credit- samantha instagram
మరొకరి సహకారంతో ఈ `సాకి` వేర్‌ని రన్ చేస్తున్న సమంత.. దాని ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తనే తీసుకుంటుంది. ఆ డిజైనింగ్ వేర్‌లను ధరించి ప్రమోట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె నయా ఔట్ ఫిట్‌లో మెరిసింది.ఇంకా చెప్పాలంటే కట్టిపడేస్తుంది.
photo credit- samantha instagram
స్లీవ్‌లెస్ బ్లూ టాప్, రెడ్ ప్యాంట్‌తో ఓ పోజులతో కట్టిపడేస్తే, డార్క్ గ్రీన్ కలర్ శారీలో మరో పోజులో మెరిసింది. ఇంకోవైపు రెడ్ శారీలో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులనే కాదు, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
photo credit- samantha instagram
ఈ నయా ట్రెండీ వేర్‌లో ఆమె పోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. దీంతో కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. సమంత అందాల విందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సందర్భంగా సామ్ చెబుతూ, ఈ కొత్త కలెక్షన్స్ బాగున్నాయని, తనకు బాగా నచ్చినట్టు చెప్పింది.
photo credit- samantha instagram
సామ్.. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఏడాది పాటు తాను సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాక తాను సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.
దీంతో ఆమె చాలా రోజులుగా విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. కొత్త ప్రదేశాలను వీక్షిస్తూ ఆనందిస్తుంది. అలాగే టెంపుల్స్ సందర్శిస్తుంది. ఆథ్యాత్మిక సేవలో మునిగితేలుతుంది. ధ్యానం చేస్తుంది. మానసికంగా, శరీరకంగా మరింత బలంగా మారుతుంది. అదే సమయంలో ప్రకృతిలో రిలాక్స్ అవుతూ తిరిగి ఎనర్జీని పొందుతుంది.
సమంత చివరగా `ఖుషి` చిత్రంలో నటించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఓటీటీలోనూ మెప్పిస్తుంది. హిందీలో ఆమె `సిటాడెల్` వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది విడుదల కావాల్సి ఉంది.