- Home
- Entertainment
- Samantha in Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఈ సందర్భంగా ఏమంటుందంటే..
Samantha in Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఈ సందర్భంగా ఏమంటుందంటే..
తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. చిత్ర పరిశ్రమకు సమంత (Samantha) ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా 12 ఏండ్లు పూర్తయ్యింది. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో సాగిన తన జర్నీ గురించి తెలిపింది. ఇందుకు రాశీ ఖన్నా.. అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ భవిష్యత్ లోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 ఏండ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా సమంత చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన తన సినీ ప్రయాణ అనుభూతిని అభిమానులకు తెలియజేసింది. ఈ మేరకు హృదయపూర్వకంగా ఇన్ స్టా, ట్వీట్టర్ లో నవ్వుతూ ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ నోట్ రాసింది.
సమంత 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ లో ఎంటీ ఇచ్చారు. ఈ మూవీతో తెరంగేట్రం చేసిన సమంత సినీ పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 26 ఫిబ్రవరి 2010న, సమంతా తన మాజీ భర్త నాగ చైతన్య సరసన తొలిసారిగా నటించింది. ఈ ప్రత్యేక రోజును గుర్తు చేసుకుంది.
డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేసావే’ చిత్రం ఫిబ్రవరి 26నే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంతోనే సమంత కేరీర్ లో దూసుకుపోవడానికి బలాన్నిచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత రొమాన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఆ మధ్య ట్రెండ్ ను క్రియేట్ చేసింది.
ఆ సినిమా తర్వాత.. సమంత వెనక్కి తిరిగి చూడలేదు. వెనువెంటనే అలు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. 2010లోనే సమంతత నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసున్నాయి. నాగ చైతన్యతో నటించిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)తో కలిసి ‘బృందావనం’ మూవీలో నటించిన మరింత పాపులర్ అయ్యింది.
ఆ వెంటనే సూపర్ మహేశ్ బాబు (Superstar Mahesh Babu) నటించిన చిత్రం ‘దూకుడు’ మూవీలో నటించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో సమంత పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అది మొదలు వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అలరిస్తూనే ఉంది.
ఇప్పటికీ కూడా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా గడిపుతోంది. 2017లో నాగచైతన్యతో మ్యారేజ్ అయ్యింది. వివాహం చేసుకున్నా.. సినిమాలకు మాత్రం నో చెప్పలేదు. వరుస సినిమాలు చేస్తూ.. తన మార్క్ చూపిస్తూనే వస్తోంది. గతేడాది వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ముగించిన విషయం తెలిసిందే.
‘ఈ ఉదయంతో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. లైటింగ్, కెమెరా, యాక్షన్, సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు.. ఈ ఆశీర్వాద ప్రయాణానికి. ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమాతో నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు. నా బలం సినిమాతోనే ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ తెలిపింది.
ఇందుకు టాలీవుడ్ నటీమణులు రాశీఖన్నా (Raashi Khanna) స్పందిస్తూ ‘మరింత ముందుకు సాగాలి’అని ఆకాంక్షించింది. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameshwaran) స్పందిస్తూ..‘ఇది చిన్న విషయం కాదు.. నీలో చాలా శక్తి ఉంది’అని పేర్కొంది. మరోవైపు ఫ్యాన్ కూడా సమంతకు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’లో నటిస్తోంది. అలాగే నయనతార మరియు విఘ్నేష్ శివన్‌లతో ఆమె నటించిన మల్టీస్టారర్ చిత్రం కాతు వాకులా రెండు కాదల్ కూడా ఏప్రిల్ 28న విడుదల కానుంది.