నయనతార పెళ్ళికి సమంతకు ఆహ్వానం?.. కానీ సామ్ హ్యాండివ్వబోతోందా ?
నయనతార, విగ్నేష్ శివన్ జూన్ 9న వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్ర రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సమంత, నయనతార మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహతులుగా మారారు.
ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు సమంతకి నయనతార డిమాండ్ రింగ్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా నయనతార, విగ్నేష్ శివన్ జూన్ 9న వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
వీరిద్దరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా వైరల్ గా మారింది. మహాబలిపురంలో నయన్, విగ్నేష్ వివాహాం జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నయనతార తన సన్నిహితులకు వెడ్డింగ్ ఇన్వెటేషన్ పంపిందట. వారిలో సమంత కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంతకు నయనతార వెడ్డింగ్ ఇన్విటేషన్ అందినట్లు వార్తలు వస్తున్నాయి.
Samantha
కానీ నయన్ వెడ్డింగ్ కి సమంత హాజరు కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఖుషి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ చాలా బిజీగా సాగుతోంది. షూటింగ్ పక్కన పెట్టి నయన్ వెడ్డింగ్ కి హాజరు కావడం సాధ్యం కాదు అని అంటున్నారు.
మహాబలిపురంలో నయనతార, విగ్నేష్ వివాహం గ్రాండ్ గా, మెమరబుల్ గా జరగబోతున్నట్లు టాక్. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ క్రేజీ కపుల్స్ వివాహానికి అతిథులుగా ఏ సెలెబ్రిటీలు హాజరవుతారో చూడాలి.