MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైమ్ తన హెల్త్ పై ఓపెనైన సమంత.. ఒక్క అడుగు కూడా వేయలేనేమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ హీరోయిన్‌

ఫస్ట్ టైమ్ తన హెల్త్ పై ఓపెనైన సమంత.. ఒక్క అడుగు కూడా వేయలేనేమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ హీరోయిన్‌

సమంత మయోసైటిస్‌ అనేది అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫస్ట్ టైమ్‌ తన ఆనారోగ్యంపై సమంత ఓపెన్‌ అయ్యింది. సుమతో మాట్లాడుతూ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 08 2022, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇటీవల తాను నటిస్తున్న `యశోద` సినిమాకి డబ్బింగ్‌ చెబుతూ తాను ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత(Samantha) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకండరాలు బలహీనంగా మారిపోతుంటాయి. నొప్పులుగా ఉంటాయి. త్వరగా అలసిపోవడం చేస్తుంటుంది. కండరాల ఇన్‌ఫెక్షన్ గా చెప్పొచ్చు. గత మూడు నాలుగు నెలలుగా సమంత ఈ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా ఫస్ట్ టైమ్‌ సమంత తన అనారోగ్యంపై స్పందించింది. `యశోద` ప్రమోషన్‌ లో భాగంగా యాంకర్‌ సుమతో చిట్‌ చేస్తున్న సమయంలో హెల్త్ మ్యాటర్‌ ప్రస్తావన రాగా, సమంత ఎమోషనల్‌ అయ్యింది. బాధని కంట్రోల్‌ చేసుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నోట మాట రాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఎదురుగా ఉన్న సుమ సైతం సమంత బాధని, కన్నీళ్లని చూసి ఆమె గుండె బరువెక్కింది. 

35

ఇందులో సమంత చెబుతూ, పోస్ట్ లో పేర్కొన్నట్టు, లైఫ్‌లో బ్యాడ్‌ డేస్‌ ఉంటాయి, గుడ్‌ డేస్‌ ఉంటాయి. కొన్ని భరించలేని రోజులుంటాయి. ఒక్కొక్క రోజైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేననిపించింది. ఒక్క అడుగు ముందుకేస్తే చాలనిపించింది. తిరిగి చూస్తుంటే ఇంత దాటి వచ్చానా? అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యింది సమంత. అయితే తాను ఒంటరి కాదని, తన వెంట చాలా మంది ఉన్నారని, అందరి సపోర్ట్ తో ఫైనల్‌గా తాను విజయం సాధించానని తెలిపింది.

45

`యశోద` సినిమాలో తన పాత్ర కూడా తనకు రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని చెప్పింది సమంత. తను ఉన్న ప్రపంచానికి, తను వెళ్లిన ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. కంప్లీట్‌ డిపరెంట్‌గా ఉంటుంది. అదొక బొమ్మరిల్లులా ఉంటుంది. సినిమాలో యశోద(Yashoda) చాలా డిఫికల్ట్స్ ఫేస్‌ చేసింది. దాన్ని ఎదుర్కొని సర్వైవ్‌ అయ్యింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషిన్‌లోనే ఉన్నాను. బాగా సర్వైవ్‌ అవుతానని భావిస్తున్నా. ఈ రకంగా సినిమాకి, నా రియల్‌ లైఫ్‌కి సిమిలారిటీస్‌ ఉన్నాయని వెల్లడించింది సమంత.  
 

55

`యశోద`కి డబ్బింగ్‌ చెప్పడం గురించి చెబుతూ, తమిళంలో కంటే తెలుగు చెప్పడమే కష్టమని చెప్పింది. అయితే కష్టసమయంలో డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చిందని, కానీ తాను మొండిదాన్ని అని, అందుకే కష్టమైనా డబ్బింగ్‌ చెప్పానని పేర్కొంది సమంత. సినిమా గురించి చెబుతూ, తనకు చేసిన జోనర్‌, సేమ్‌రోల్‌ చేయడం ఇష్టం ఉండదని, కానీ `యూటర్న్`, `యశోద` జోనర్‌ దగ్గరగా ఉంటాయని చెప్పింది. అయితే `యశోద` కథ విన్నప్పుడు తాను ఎంత షాక్‌ అయ్యిందో, రేపు థియేటర్లలో ఆడియెన్స్ సినిమా చూసి అంతే షాక్‌ అవుతారని పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved