చైతూతో విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన సమంత.. అవన్నీ రూమర్స్ అంటూ.. హైదరాబాద్ తన హోమ్ అని స్పష్టం
సమంత(samantha), నాగచైతన్య(naga chaitanya) త్వరలో విడిపోతున్నారని, వీరిద్దరు విడాకులు(divorce) తీసుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఫస్ట్ టైమ్ సమంత స్పందించింది. రూమర్స్ పై స్పందించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత గతేడాది లాక్‌డౌన్ సమయంలో `సాకి` పేరుతో ఆన్ లైన్ ఉమెన్స్ క్లాత్ వేర్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. దీనికి తనే ప్రమోటర్‌గా వ్యవహరిస్తుంది. తాజాగా ఇది విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఆయా ఫోటోలను పంచుకుంది. సాకి టీమ్‌తో కేక్ కట్ చేసుకుంది సమంత. అంతేకాదు అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
సమంత, నాగచైతన్యల మధ్య మనస్పర్థాలు వచ్చాయని, దీంతో ఇద్దరు విడిపోతున్నారని, దీనిపై ఇటీవలే సమంత కూడా కోర్ట్ కి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో `సాకి` ఏడాది పూర్తయిన సందర్భంగా సమంత సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది. నన్ను ఏం అడగాలనుకుంటున్నారో రెడీ అవ్వండి అని తెలిపింది.
అయితే చైతూతో తను విడిపోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఓ నెటిజన్, మీరు ముంబయికి షిఫ్ట్ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనిపై సమంత స్పందించింది. `ఈ రూమర్స్ ఎలా పుట్టాయో అర్థం కావడం లేదు. వందల కొద్ది వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. కానీ అందులో నిజం లేదు` అనితెలిపింది.
హైదరాబాద్ తన హోమ్ అని, ఎప్పటికీ అదే తన ఇళ్లు అని పేర్కొంది. హైదరాబాద్ తనకు అన్ని అందించిందని, దాన్ని విడిచి వెల్లడం లేదని, ఇక్కడే ఉంటానని తెలిపింది సమంత. అయితే విడాకులకు సంబంధించి ఆమెని అనేక ప్రశ్నలు అభిమానులు ప్రశ్నించగా, వాటిని స్కిప్ చేయడం ఇంకా సస్పెన్స్ ని అలానే మెయింటేన్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల జ్యోతిష్యులు కూడా త్వరలో సమంత, నాగచైతన్య విడిపోతారని పేర్కొన్నారు. నాగచైతన్యకి స్టార్ డమ్ వస్తుందని, సమంత ఇమేజ్ పడిపోతుందని చెప్పారు. అంతేకాదు సమంత ముంబయికి వెళ్లిపోతుందన్నారని చెప్పిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇటీవల నాగచైతన్య కూడా విడాకుల రూమర్స్ పై స్పందిస్తూ, మొదట లైట్ తీసుకున్నానని, కానీ చాలా బాధగా అనిపిస్తున్నాయని చెప్పారు. వార్తని మరో వార్తే నోరు మూయిస్తుందన్నారు. విడాకుల అంశంపై ఆయన కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి పూర్తి స్థాయి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.