MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తల్లి కష్టం గుర్తు చేసుకుని సమంత ఎమోషనల్‌, `శుభం` సక్సెస్‌ క్రెడిట్‌ వారికే

తల్లి కష్టం గుర్తు చేసుకుని సమంత ఎమోషనల్‌, `శుభం` సక్సెస్‌ క్రెడిట్‌ వారికే

Samantha : సమంత నిర్మించిన `శుభం` మూవీ విజయవంతంగా రన్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా సక్సెస్‌ మీట్‌లో సమంత ఎమోషనల్‌ కామెంట్స్ చేసింది.   

3 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2025, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
samantha

samantha

సమంత ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తుంది. ఓ వైపు డేటింగ్‌ రూమర్లతో, మరోవైపు తన సినిమాతో ఆమె సందడి చేస్తుంది. సమంత.. బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందని, వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరచూ సమంత కూడా ఆయనతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటుంది.

అయితే అందులో నిజం లేదని ఆమె మేనేజర్‌ స్పందించారు. ఇదిలా ఉంటే తన సినిమా `శుభం` విషయంలోనూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది సమంత. ఆమె నిర్మాతగా మారి `శుభం` అనే చిత్రాన్ని నిర్మించింది. ట్రాలాలా మూవీంగ్‌ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ మూవీని నిర్మించడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
samantha

samantha

గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అయ్యింది. మంచి కలెక్షన్లతో సక్సెస్‌ని సాధించింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి డీసెంట్‌ హిట్‌ని అందుకుంది. తాజాగా `శుభం` మూవీ సక్సెస్‌ మీట్‌ లో సమంత పాల్గొంది. తన తల్లిని తలుచుకుని ఆమె ఎమోషనల్‌ అయ్యింది. ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్‌ రేట్‌ కేవలం 10 శాతమే.

అయినా ఆ విషయం తెలిసి తాను ఎలా నిర్మాతగా మారానో అర్థం కావడం లేదు, ఆ ధైర్యం ఏంటో తెలియడం లేదు, టీమ్‌ లోని అందరి ఫేసుల్లో సంతోషం చూస్తే, ఇప్పుడు అర్థం అవుతుంది. నిర్మాతలు మళ్లీ మళ్లీ సినిమాలు ఎందుకు నిర్మిస్తారో. ఈ ఫీలింగ్‌ చాలా గొప్పది, దీన్ని దేనితోనూ కొలవలేం. ఇది నిజమైన విజయం` అని చెప్పింది సమంత.

36
samantha

samantha

ఇంకా మాట్లాడుతూ `ఇది చూస్తుంటే చిన్నప్పుడు నా సమ్మర్‌ హాలీడేస్‌ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు తెలుసుకుంటున్నాను, మా అమ్మ ఎంత కష్టపడిందని. ముగ్గురు పిల్లలు, వారి ఫ్రెండ్స్ ని థియేటర్‌కి తీసుకెళ్లాలి, వారిని డిజప్పాయింట్‌ చేయకూడదని, చాలా కష్టపడింది. ట్యూషన్లు చెప్పింది.

ఆ చీకట్లో సినిమా చూస్తూ, క్లాప్స్ కొడుతూ, మూవీ అయిపోయాక ఆ సినిమా గురించి డిస్కస్‌ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం, మా బ్రదర్స్ తో పాప్‌ కార్స్ కోసం గొడవపడటం వంటివన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇవన్నీ మొన్న, నిన్ననే జరిగినట్టు అనిపిస్తుంది. 
 

46
samantha

samantha

ట్రాలాలా బ్యానర్‌ ద్వారా చిన్నప్పటి మెమొరీస్‌ని ఫ్యామిలీ కోసం రీ క్రియేట్‌ చేయాలని, మంచి క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయాలని, ఇలాంటిది మా బ్యానర్‌ నుంచి ఆశించాలి, అదే మా లక్ష్యం. దానికోసం కష్టపడుతూనే ఉంటాం.

మీ అందరికి చిన్నప్పటి తీపి జ్ఞాపకాలను అందించడమే మా డ్రీమ్‌. ఈ విషయంలో తాను కష్టపడతానని మాటిస్తున్నా` అని పేర్కొంది సమంత. ఈ సందర్భంగా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలిపింది. ఇది 24 క్రాఫ్ట్స్ వల్లే సాధ్యమైందని తెలిపింది. 
 

56
shubham movie

shubham movie

ఇక `శుభం` సినిమాకి దక్కిన రివ్యూల గురించి చెబుతూ, మీడియా మిత్రులతో ఎంతో కాలంగా అనుబంధం ఉందని, తన సినిమాపై ప్రతి ఒక్కరు పాజిటివ్‌గా స్పందించారు.

పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చారని, పాజిటివ్‌ ట్వీట్లు వేశారని, ఒక్కరు కూడా ఇది బాగా లేదనే కామెంట్‌ చేయలేదు, ఇలాంటి సపోర్ట్ మాకు కావాల్సింది. ఇదే మాకు ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుందని, ఇంకా చేయాలనే ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యింది సమంత. 
 

66
samantha

samantha

చాలా మంది టెక్నీషియన్లు సినిమా కోసం నిద్ర లేకుండా పని చేశారని, సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ వారిదే అని చెప్పింది. యాక్టర్స్ లైఫ్‌ చాలా ఈజీ అని, లేట్‌గా సెట్‌కి వచ్చి త్వరగా వెళ్లిపోతామని, అందులో తాను కూడా భాగమే అని, సెట్‌లో తన డైలాగ్స్ మాత్రమే చదువుకుని యాక్ట్ చేసి చెప్పేసి వెళ్లిపోతామని, ఇంకా ఏదీ పట్టించుకోము, చాలా సెల్ఫీష్‌గా ఉంటాము.

కానీ ఈ మూవీ కోసం టీమ్‌ పడ్డ కష్టం చూస్తుంటే, నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, చాలా రియలైజ్‌ అయ్యాను అని తెలిపింది సమంత. ఇక అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారు లేకపోతే తాను లేదనని, తనకు సినిమాలు లేక గ్యాప్‌ వచ్చినా, వారి లవ్‌ చూస్తుంటే ఆ ఫీలింగ్‌ లేదు అని చెప్పింది సమంత.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?
Recommended image2
అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved