సమంత ఇక వివాహం చేసుకోరా? దారుణ చర్యకు పాల్పడిందా?... వైరల్ గా సంచలన న్యూస్!
మీడియాలో సమంతపై ఓ సంచనల న్యూస్ చక్కర్లు కొడుతుంది. జీవితంలో ఆమెకు వివాహం చేసుకునే ఆలోచన లేదని, అందుకోసం ఊహించని చర్యకు పాల్పడ్డారని అంటున్నారు.

పరిశ్రమలో సమంత ఓ సంచలనం. ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కి ఇన్స్పిరేషన్. హీరోయిన్ గా రాణించాలంటే, స్టార్ హీరోయిన్ కావాలంటే పాల వన్నె రంగు, ఒద్దు పొడుగు, కట్టిపడేసే అందం ఉండాలనే నమ్మకాలను బ్రేక్ చేసిన వాళ్లలో ఒకరు. కేవలం టాలెంట్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు. కెరీర్ లో హైట్స్ చూశారు.
సమంతకు గొప్ప లక్షణం ముక్కు సూటి తనం. ఎదుగుతున్న రోజుల్లోనే ఆమె హీరోల రెమ్యూనరేషన్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. మూవీ విజయంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంది. కానీ రెమ్యూనరేషన్స్ ఇంత వ్యత్యాసం ఎందుకని ఆమె ప్రశ్నించారు. కెరీర్ పీక్స్ లో ఉండగా ఎవరూ ఇలాంటి వివాదాలలో ఇరుక్కోవాలని అనుకోరు.
ఇక కోరుకున్నవాడు నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె స్వతంత్రంగా వ్యవహరించారు. పాత్రల ఎంపిక నుండి ధరించే బట్టలకు తన ఇష్టం వచ్చినట్లు నడుచుకున్నారు. నాగ చైతన్య కూడా ఎప్పుడూ ఆమెకు అడ్డు చెప్పలేదు. కారణం తెలియదు ఇద్దరూ విడిపోయారు. కుటుంబ సభ్యులు కలపాలని చాలా ట్రై చేశారు. సుమంత ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేది ఉండదు.
విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుత వయసు 35 ఏళ్ళు. అంటే ఆమె వివాహం చేసుకుంటే వెంటనే చేసుకోవాలి. లేదంటే ఏజ్ బార్ అవుతుంది. కాగా సమంతకు ఇకపై వివాహం చేసుకునే ఆలోచన లేదట. ఇంట్లో పెద్దవాళ్ళు వివాహం విషయంలో ఇబ్బంది పెడుతున్నారట. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఎక్కువ కాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారట.
సమంత పెళ్లి నుండి తప్పించుకోవడానికి గర్భాశయం తొలగించుకున్నారని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఆడపిల్లగా ఎవరూ అంత కఠిన నిర్ణయం తీసుకోరు. మాతృత్వం కోరుకుంటారు. గత పెళ్లి అనుభవాల రీత్యా పెళ్లి, పిల్లలు వద్దని, జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఓ సంచలన న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి అదే నిజమైతే ప్రపంచంలో సమంత అంత ధృడమైన మహిళ లేనట్లే.