- Home
- Entertainment
- Samantha:జీవితంలో విడాకులు, చావు భయం చూశా, డబ్బంతా పోయింది.. సమంత గుండెల్లో ఇంత బాధ గూడుకట్టుకుందా!
Samantha:జీవితంలో విడాకులు, చావు భయం చూశా, డబ్బంతా పోయింది.. సమంత గుండెల్లో ఇంత బాధ గూడుకట్టుకుందా!
సమంత... భర్త నాగ చైతన్యతో విడిపోయి నాలుగు నెలలు అవుతుంది. మనస్పర్థలతో చాలా కాలంగా విడిగా ఉంటున్న ఈ జంట 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. చైతూ-సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లకే విభేదాలు తలెత్తడంతో విడిపోయారు.

పండంటి కాపురం కలతల కారణంగా విడాకులకు దారితీయడం సమంత(Samantha)-నాగ చైతన్యలను మానసిక వేదనకు గురి చేసింది. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా ఒకరిపై మరొకరు కోపంగా ఉన్నారు. నాగ చైతన్య ఎటువంటి ఎమోషన్ షేర్ చేయలేదు. సమంత మాత్రం పరోక్షంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అన్యాయం జరిగినట్లు ఆమె ఆవేదన చెందుతున్నారు.
విడాకుల ప్రకటన నాటి నుండి సమంత నాగ చైతన్య(Naga Chaitanya)పై సోషల్ మీడియా దాడి ఆపడం లేదనిపిస్తుంది. నిఘాడమైన ఆమె కోట్స్, కామెంట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మరో వైపు నాగ్ ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్. సమంతను వారు నిందించకపోగా, మంచి అమ్మాయిగా కుటుంబంలో ఆనందం పంచారని నాగార్జున తెలియజేశారు.
తాజాగా సమంత ఓ బలమైన కోట్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ (Will Smith)తన బుక్ లో రాసుకున్న ఒక కొటేషన్ సమంత ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సమంత జీవితానికి ఆ కోట్ దగ్గరగా ఉండటంతో మరోసారి చైతూతో విడాకుల వ్యవహారం హైలెట్ అవుతుంది. సమంత అంతగా బాధపడేలా వైవాహిక జీవితంలో ఏం జరిగింది అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇక సమంత షేర్ చేసిన విల్ స్మిత్ కోట్ సారాంశం చూస్తే.. ''మనలో చాలా మంది లాగే నేను గత ముప్పై ఏళ్ల జీవితంలో ఓటములు, నష్టాలు, వేధింపులు, విడాకులు, చావు వంటి సమస్యలతో పోరాడాను. బెదిరింపులు ఎదుర్కొన్నాను, డబ్బులు, ప్రైవసీ కోల్పోయాను. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. పడిపోయిన ప్రతిసారీ నేను లేచి నిలబడ్డాను. జీవితాన్ని నిర్మించుకున్నాను. మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఏదైనా ఎదిరించి నిలిచే మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని, అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నావా? లేదా? అన్నదే ప్రశ్న''.
జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేను వాటిని ఎదిరించి నిలబడినట్లు విల్ స్మిత్ తన కోట్ లో తెలియజేశాడు. అదే సమయంలో సమస్య ఏదైనా కానీ... ఎదిరించి నిలబడాలి, జీవితంలో ముందుకు వెళ్లాలని ఆయన కోట్ లో షార్ట్ గా చెప్పారు.
ఈ కోట్ ద్వారా పరోక్షంగా సమంత నాగ చైతన్య తో పాటు ఆమెను విమర్శించే వారికి పంచ్ వేసినట్లయింది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని సమంత సందేశం పంపారు. విడాకులు జీవితంలో ఎదురైన ఒక సమస్య, అంత మాత్రాన లైఫ్ ఆగిపోదు. ఛాలెంజ్ గా భావించి ముందుకు వెళ్లాలని ఆమె చెబుతున్నారు.
సమంత అక్షరాల ఈ సూత్రం పాటిస్తున్నారు. విడాకుల డిప్రెషన్ నుండి బయటకు రావడానికి స్నేహితుల సహాయం తీసుకున్న సమంత ఫుల్ ఫోకస్ కెరీర్ పై పెట్టారు. ఆమె వరుసగా కొత్త చిత్రాలు, సిరీస్లకు సైన్ చేస్తున్నారు. సమంత కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.