- Home
- Entertainment
- Samantha Support Kajal: నువ్వెప్పుడూ అందంగానే ఉన్నావ్... కాజల్ కు అండగా నిలిచిన సమంత...
Samantha Support Kajal: నువ్వెప్పుడూ అందంగానే ఉన్నావ్... కాజల్ కు అండగా నిలిచిన సమంత...
టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ (Kajal). ఎప్పటికప్పుడు మంచి ఫామ్ ను మెయింటేన్ చేసి.. కెరీర్ లో ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింద కాజల్. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో తన స్టార్ డమ్ ను కాపాడుకుంటూ వస్తోన్న కాజల్ (Kajal).. మెగాస్టార్ తో ఆచార్య సినిమాలో నటించింది. పెళ్లి చేసుకునిఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాజల్ ..పెళ్లి తరువాత కూడా సినిమాలు చేసుకుంటుంది.
కాజల్ అగర్వాల్ (Kajal)2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్ కాజల్ అప్పటి నుంచి వరుసగా వెకేషన్స్ తో మారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మూవీస్ కు చిన్న కామా పెట్టిన కాజల్ (Kajal).. భర్తతో హ్యాపీగా గడిపస్తుంది. అంతే కాదు ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్.. భర్త గౌతమ్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ (Kajal) గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. దాంతో తాను చేస్తున్న సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ (Kajal) .. తన హెల్త్ పైనే దృష్టి పెట్టింది. జాగ్రత్తగా ఉంటూ.. ప్రెగ్నెన్సీ ఫీలింగ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.
కాజల్ (Kajal) గర్భవతి కావడంతో ఆమె బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాజల్ కూడా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటోంది. హెల్త్ కేర్ తీసుకుంటోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ (Kajal) దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తాను బేబీ బంప్ తో ఉన్న ఫోటోస్ ని ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. అయితే కొంత మంది ఆకతాయి నెటిజన్లు మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్లతో ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
గర్భంతో ఉన్నప్పుడు ఆడవారి శరీరంలో మార్పులు సహజమే. కానీ కాజల్ (Kajal) బేబీ బంప్ తో ఉండడంపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేశారు. దాంతో... కాజల్ కూడా తనదైన శైలిలో ట్రోలర్స్ కు గట్టిగానే సమాధానం చెప్పింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది.
నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులని ఎంజాయ్ చేస్తున్నాను. అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా. గర్భవతి అయ్యాక శరీరంలో హార్మోనుల వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. బాడీ తల్లి అయ్యేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతూ ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడం సహజం అని కాజల్ (Kajal) గట్టిగా కౌంటర్ అటాక్ చేసింది.
ఈ విషయంలో టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ (Kajal) కు అండగా నిలుస్తున్నారు. నెటిజన్లపై మండిపడుతున్నారు. రీసెంట్ గా ఈ విషయంలో స్పందించింది సమంత (Samantha). నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్ అంటూ.. ఒక్క మాటలో కాజల్ మనసు దోచుకుంది సామ్.
అటు మంచు లక్ష్మి కూడా కాజల్ (Kajal) కు సపోర్ట్ గా నిలిచింది. నువ్వు ప్రతి దశలో పర్‌ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. వీరితో పాటు రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. ఇది ఇలా ఉంటే వీరి కామెంట్స్‌పై కాజల్ (Kajal) సోదరి మాజీ హీరోయిన్ నిషా అగర్వాల్ స్పందిస్తూ.. నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం.. నా గార్జియస్ అంటూ రిప్లై ఇచ్చింది.