- Home
- Entertainment
- సామ్-చైతూ విడాకులు: పెళ్లి తరువాత కూడా అలా చేస్తే ఎవరు ఊరుకుంటారు.. అందుకే విడాకులు!
సామ్-చైతూ విడాకులు: పెళ్లి తరువాత కూడా అలా చేస్తే ఎవరు ఊరుకుంటారు.. అందుకే విడాకులు!
నెల రోజులుగా మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు నిజమే అంటూ, సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. వారు భార్యా భర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త జనాలకు అంత షాకింగ్ అనిపించలేదు. కారణం వీరిద్దరూ విడిపోతున్నట్లు ముందుగానే జనాలు ఓ అవగాహనకు వచ్చారు.

ఇదిలా ఉంటే అసలు చైతూ సామ్ విడిపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. విడాకులు తీసుకొనేలా ప్రేరేపించిన ఆ గొడవ ఏమిటని, అందరూ ఆలోచనలో పడ్డారు.
కాగా ప్రధానంగా వీరి గొడవకు కారణం సమంత ఇటీవల నటించిన ది ఫ్యామిలీ మాన్ సిరీస్ అని అంటున్నారు. ఆ సిరీస్ ఈ పచ్చని జంట మధ్య చిచ్చు పెట్టిందని అభిప్రాయపడుతున్నారు.
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించారు. పెళ్లి తరువాత కూడా సమంత అలా నటించడాన్ని చైతు తప్పుబట్టాడట. ఇక సమంత ప్రతి విషయంలో ఇండిపెండెట్ లా ఫీల్ అవుతుంది. సమంత ఆ విషయంలో తనను నిలదీయడాన్ని ఆమె ఒప్పుకోలేదట.
వీరిద్దరి గొడవకు బీజం పడింది ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ వలెనే అంటున్నారు. నిజంగా వారి మధ్య ఏమి జరిగింది అనేది ఎవరికీ తెలియదు. అయితే ప్రధానంగా ఈ కారణం వినిపిస్తుంది.
ఇక సమంత చైతు విడాకుల మేటర్ చిత్ర వర్గాలతో పాటు, అక్కినేని, సమంత ఫ్యాన్స్ ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నాళ్లుగా వీరి విడివిడిగా ఉంటున్నారని తెలిసినా, ఏదో విధంగా కలిసిపోతారని అందరూ భావించారు. అలా కాకుండా విడాకులు ప్రకటించడం, మనసుకు బాధ కలిగేలా చేసింది.