- Home
- Entertainment
- సమంతనా మజాకా.. ఫ్యూజులెగిరిపోయేలా మాస్టర్ ప్లాన్.. నెక్ట్స్ టార్గెట్ కూడా ఫిక్స్?
సమంతనా మజాకా.. ఫ్యూజులెగిరిపోయేలా మాస్టర్ ప్లాన్.. నెక్ట్స్ టార్గెట్ కూడా ఫిక్స్?
సమంత ప్లాన్ ఇప్పుడు అభిమానులనే కాదు, ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేస్తుంది. ఊహకందని ప్లానింగ్‌తో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్కో ఇండస్ట్రీనే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నట్టుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్ కి ఫ్యూజులెగిరిపోయేలా ఉండటం గమనార్హం.

సమంత(Samantha).. ఇప్పుడొక సంచలనంగా మారింది. ఏ హీరోయిన్ సైతం ఈ స్థాయిలో హల్‌చల్ చేయడం, హాట్ టాపిక్ కావడం ఇటీవల చూసి ఉండం. కేవలం తమిళం,తెలుగుకి పరిమితమయిన సమంత ఇప్పుడు వేస్తున్న అడుగులు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఊహకందని విధంగా ఆమె ముందుకు సాగుతుండటం విశేషం.
సమంత `పుష్ప`(Pushpa) చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. కేవలం ఐటెమ్ సాంగ్‌తోనే ఇండియా మొత్తాన్ని ఊపేసింది. దీంతో ఆమెకి పాన్ ఇండియా హీరోయిన్ గుర్తింపు వచ్చింది. గుర్తింపు మాత్రమే కాదు, ఆ రేంజ్‌లో ఆఫర్లు కూడా వస్తున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసి షాక్‌కి గురి చేస్తుందీ హాట్ హీరోయిన్.
తాజాగా మలయాళంలోనే పాగా వేసేందుకు సిద్ధమవుతుందట. సమంతకి లేటెస్ట్ గా మలయాళం నుంచి ఓ ఆఫర్ వచ్చిందట. యంగ్ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ తో కలిసి ఓ సినిమా చేయబోతుందని సమంత. ఆల్‌రెడీ దీనికి సైన్ కూడా చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. Samantha Malayalam Entry.
దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో `కింగ్ ఆఫ్ కోథా` అనే చిత్రం రూపొందుతుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం సమంతని అప్రోచ్ అయ్యారట. ఆమె ఓకే చెప్పిందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మూడు సినిమాలు ఓకే అయ్యాయని టాక్. ఆయుష్మాన్‌ఖురానాతో ఓ చిత్రం, అక్షయ్ కుమార్‌తో మరో సినిమా, రణ్ వీర్ సింగ్‌లో ఇంకో చిత్రం కన్ఫమ్ అయినట్టు టాక్. మరోవైపు తెలుగులో రూపొందుతున్న మూడు పాన్ ఇండియా చిత్రాలున్నాయి. మరోవైపు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా ఖరారైంది. ఇలా ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌ని ఊపేసిన సమంత ఇకపై బాలీవుడ్, మాలీవుడ్‌లను కూడా ఊపేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం సమంతపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలే చేయాలనే ప్రెజర్ లేదు. స్వేచ్ఛా వాతావరణంలో ఉంది. ఎలాంటి సినిమాలు చేయాలనేది ఆమె ఇష్టం. అందుకే నచ్చిన సినిమాలు చేస్తుంది. గ్లామర్ షోకి కూడా రెడీ అవుతుంది. ఎలాంటి హద్దల్లేకుండా నచ్చిన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే సమంత అసలు ఆట ఇప్పుడే ప్రారంభించిందని అంటున్నారు నెటిజన్లు. మరి సమంత ఈ గేమ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. సమంతనా మజాకా.