Samantha: నా లాంటి దుర్భర స్థితి నీకు రాకూడదనుకుంటున్నా... ఫస్ట్ టైం సమంత బరస్ట్!
వేదనలో ఉన్న సమంత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన అందంపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Samantha
మయోసైటిస్ బారినపడ్డ సమంత చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్య ప్రకటన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. శాకుంతలం ట్రైలర్ విడుదల నేపథ్యంలో సమంత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంత ఫోటోలు వైరల్ అయ్యాయి.
Samantha
ఓ మీడియా సంస్థ సమంత గ్లామర్ ని ఉద్దేశిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసింది. ''సమంతను చూస్తుంటే బాధేస్తుంది. ఆమెలో మునుపటి అందం, మెరుపు లేవు. విడాకుల డిప్రెషన్ నుండి కోలుకొని సక్సెస్ఫుల్ కెరీర్ సాగిస్తున్న తరుణంలో మయోసైటిస్ ఆమెను దారుణంగా దెబ్బతీసింది. ఆమెను మరలా బలహీనురాలిని చేసింది...'' అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
Samantha
సదరు పోస్ట్ కి సమంతను ట్యాగ్ చేయడంతో ఆమె స్పందించారు. నాకు మాదిరి నెలల తరబడి వైద్యం, మెడిసిన్ తీసుకునే దుర్భర పరిస్థితి నీకు రాకూడదని నేను భావిస్తున్నాను. నువ్వు వెలిగిపోవాలని నా ప్రేమగా కోరుకుంటున్నాను... అంటూ సమంత రిప్లై ఇచ్చారు.
సుదీర్ఘ కాలంగా నేను మందులు తింటూ, భయంకరమైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంత స్ట్రగుల్ అవుతుంటే... మీరు నా అందం గురించి మాట్లాడటం సరికాదన్న అర్థంలో సమంత సదరు కామెంట్ చేశారు. సమంత షాకింగ్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Samantha
కాగా ఇంస్టాగ్రామ్ లో సమంత మరో పోస్ట్ పెట్టారు. లూథర్ మార్టిన్ జూనియర్ చెప్పిన ఒక కోట్ ఆమె షేర్ చేశారు. ''నమ్మకంతో మొదటి మెట్టు ఎక్కండి, నిచ్చెన మొత్తం పరీక్షించాల్సిన అవసరం ఉండదు. ముందు మొదటి అడుగు వేయండి' అన్న కోట్ ఆమె ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
Samantha
అనుకున్న పని విశ్వాసంతో మొదలుపెడితే విజయం తథ్యం. ముందు ప్రారంభించాలి అని ఆమె చెప్పారు. మనమందరం చేయాల్సిన పని అదే అని సమంత వెల్లడించారు. కాగా సమంత ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నారని తెలుస్తుంది.
Samantha
సమంత (Samantha)ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. సందర్భం ఏదైనా సమంత దాన్ని వదలడం లేదు. నేడు శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవల సమంత ముంబై వెళ్లారు. ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కారు. చేతిలో జపమాల ఉంది. ప్రయాణాలలో కూడా సమంత జపమాలను తోడుగా తీసుకెళ్తున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఆమె తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు.
Samantha
ఈ క్రమంలో ఆరోగ్యం కోసం, కెరీర్ కోసం, మానసిక ప్రశాంత కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారుపిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన మాటలు ఆమె అనుసరిస్తున్నారని తెలుస్తుంది. అది మూఢనమ్మకమైనప్పటికీ గట్టిగా నమ్మే వారికి ఉపశమనం కలిగిస్తుంది.