- Home
- Entertainment
- Samantha Remuneration: నయనతార తరువాత సమంతనే టాప్... సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా...?
Samantha Remuneration: నయనతార తరువాత సమంతనే టాప్... సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా...?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది సమంత(Samantha). సౌత్ లో నయనతార (Nayantara) తరువాత హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా మారిపోయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Samantha
సౌత్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత(Samantha). సాధారణంగా హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఫెయిడ్ అవుట్ అవుతారు. కాని సమంత తోటి హీరోయిన్స్ తగ్గిపోతున్నా.. సమంత (Samantha) మాత్రం అంతకంతకూ ఇమేజ్ పెంచుకుంటూనే ఉంది. దానితో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటుంది.
గత 12 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న సమంత (Samantha).. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayantara) తరువాత సెకండ్ ప్లేస్ లో ఉంది. దాదాపు రెండేళ్లుగా ఫెయిల్యూర్ అటూ ఎరుగని నటిగా సక్సస్ జర్నీ చేస్తుంది సమంత. రీసెంట్ గా రేటు కూడా పెంచేసిందట.
Samantha
రీసెంట్ గా సమంత(Samantha) పుష్ప పార్ట్ 1 సినిమాలో నటించింది. ఈ సినిమాలో మొట్టమొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది సమంత. ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్ కోసం సామ్ ఏకండా 3 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో తన రేటు అమాంతం పెంచేసిందట సామ్.
Samantha
ఇంతకు ముందు వరకూ సినిమాకు 2 నుంచి 3 కోట్ల వరకూ తీసుకుంటున్న సమంత (Samantha) ఇప్పుడు రేటు 5 కోట్లకు పెంచినట్టు సమాచారం. తరువాత సినిమాలకు ఆమె 5 కోట్లు గట్టిగా డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. యశోద మూవీలో నటిస్తోంది.
ఇక Samantha తమిళంలో నయనతార తో కలిసి కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తోంది. నయన్ తార(Nayantara) ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో వీరితో విజయ్ సేతుపతి కూడా స్క్రీన్ శేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు.
అయితే సౌత్ లో అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న యాక్ట్రస్ నయనతార (Nayantara). ఆమె సినిమాకు 7 కోట్లు వరకూ డిమాండ్ చేస్తుందట. ఆరు కోట్ల వరకూ కొన్ని సినిమాలకు తీసుకుందని టాక్. ఇక నయనతార తరువాత 5 కోట్లు డిమాండ్ చేస్తూ సమంత(Samantha) సెకండ్ ప్లేస్ కు చేరింది.
ఇటు సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తోంది సమంత (Samantha). బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న సామ్... హాలీవుడ్ లో అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలో నటిస్తోంది. ఇటు విజయ్ దేవరకొండతో కూడా సమంత (Samantha) సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.