బేబీ బంప్‌తో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోస్.. షాకింగ్ ట్వీస్ట్ ఎంటంటే..?
రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిన తరువాత సమంత పెద్దగా కనిపించడంలేదు. బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. ఇక ఈలోపు సోషల్ మీడియాలో సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..?
దాదాపు ఏడాదిన్నర పైనే అవుతుంది సమంత తెలుగు తెరపై కనిపించి. ఆమధ్య ఖుషీ సినిమా తరువాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తనకు ఉన్న మయోసైటిట్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ.. రకరకాల దేశాలుతిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది సమంత. ఇక రీసెంట్ గా మళ్ళీ యాక్టీవ్ అవుతోంది. అయితే తెలుగులో మాత్రం ఆమె ఏప్రాజెక్ట్ ను చేయడంలేదు అని తెలుస్తోంది.
samanta 1
ఎక్కువగా బాలీవుడ్ పైనే ఆమె దృష్టి పెట్టినట్టు సమాచారం. అంతే కాదు సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది సమంత. ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇకఅసలు విషయానికి వస్తే.. సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ప్రతీ విషయం ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటుంది. అంతే కాదు తన ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోస్ కూడా శేర్ చేసుకుంటుంది.
Samantha Ruth Prabhu
కాని ఈ మధ్య సమంతకు సబంధించిన కొన్ని షాకింగ్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోస్ అంటే సమంత బేబీ బంప్ ఫోటోస్. అవును సమంత బేబీ బంప్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అదేంటి సమంత ఎప్పుడు ప్రెగ్నంట్ అయ్యింది అని అంతా షాక్ అవుతున్నారు. కాని ఇది నిజం కాదు. ఈఫోటోలు ఫేక్ అయినా.. రియల్ ఫోటోస్ లాగా నమ్మదగినట్టుగా ఉన్నాయి.
Samantha Ruth Prabhu
దాంతో ఇందులో నిజం ఎంత.. అబద్దం ఎంతా అని షాక్ అవుతున్నారు. కాని ఈ పోటోలు ఇంత రియాల్టీగా రావడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI). ఈ ఏఐ పుణ్యమా అని మంచి పనులు చేయాల్సిందిపోయి.. కొన్ని కొన్ని వింతలన్నీ చూడాల్సి వస్తోంది. ఈ ఏఐ మంచి పనులకు ఉపయోగించాల్సింది పోయి.. కొందరు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నారు.
ఈక్రమంలోనే సమంత బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు ఏఐలో క్రియేట్ చేసి.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు. తరువాత అసలు విషయం తెలుసుకుని సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన ఈఫోటోస్ చేసిన వారిని చట్టపరంగా పనిష్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నాగచైతన్యతో విడాకులు తరువాత కెరీర్ పై దృష్టి పెట్టింది సమంత. డివోర్స్ బాధనుంచి కోలుకోవడం కోసం ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్ని సమంత.. ఆతరువాత మోడల్ గా కూడా బిజీ అయ్యారు. ఇటు సినిమాలు, అటు మోడలింగ్. మరో వైపు ఫారెన్ టూర్లతో హడావిడి చేస్తుంది బ్యూటీ.
మరోవైపు మాయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. రీసెంట్ గా ఆమె సిటాడెల్: హనీ అండ్ బన్నీ’ వెబ్ సిరీస్‌తో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటీ అన్నదానిపై క్లారిటీ లేదు.