VarunLav: వరుణ్ తేజ్, లావణ్య పెళ్ళికి హాజరు కానున్న సమంత, నాగ చైతన్య.. ఇంకా ఎవరెవరంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం ఇటలీలో చేరిపోయారు. ఆల్రెడీ గ్రాండ్ పార్టీతో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ సతీసమేతంగా ఇటలీ వెళ్లారు. నేడు వరుణ్, లావణ్యలకు హల్దీ మెహందీ వేడుక జరగనుంది. అయితే ఇటలీలో పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు కొద్దిమంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరవుతారు.
వీరిలో నితిన్, షాలిని దంపతులు ఆల్రెడీ ఇటలీ వెళ్లి వరుణ్ తేజ్ పెళ్లి సంబరాల్లో భాగమయ్యారు. వరుణ్, నితిన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక హీరోయిన్ రీతూ వర్మ కూడా వరుణ్, లావణ్య పెళ్ళి కోసం ఇటలీ వెళ్ళింది. ఇక్కడ మరో క్రేజీ విషయం ఏంటంటే.. మాజీ కపుల్ సమంత, నాగ చైతన్య వరుణ్ తేజ్ పెళ్ళికి ఇటలీ పయనమైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుణ్ కి చైతు కూడా మంచి ఫ్రెండ్. అయితే సమంతని కూడా వరుణ్, లావణ్య ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వరుణ్ పెళ్లిలో సమంత, నాగ చైతన్య ఎదురపడనున్నారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటారా ? కలసి కనిపిస్తారా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.
ఇకపోతే వీరితో పాటు రష్మిక కూడా వరుణ్, లావణ్య వెడ్డింగ్ కి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు రోజుల పాటు గ్రాండ్ గా వరుణ్, లావణ్య వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. నవంబర్ 1న వివాహం పూర్తయ్యాక అంతా ఇండియా తిరిగి వస్తారు.
నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ వేడుకకి టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. మిస్టర్ చిత్రంలో తొలిసారి వరుణ్, లావణ్య జంటగా నటించారు. ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.