MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్

1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్

సమంత మళ్లీ ఫామ్ లోకి రాబోతోంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత మోరవబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ళుగా టాలీవుడ్ వైపు చూడలేదు సమంత. ఖుషి సినిమా తరువాత ఆమె కనిపించలేదు. రీ ఎంట్రీ గట్టిగా ఉంటుంది అన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.  ఏడాది పాటు రెస్ట్ తీసుకున్న ఈ హీరోయన్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేసింది. ఇక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల ద్వారా టాలీవుడ్ లోకి  రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. సమంత.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 13 2025, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆరోగ్యం బాగోలేక దాదాపు  ఏడాది వరకు సినిమాలకు దూరంగా ఉంది సమంత. ఏడాదికి పైగా ఆమె కనిపించకపోవడంతో అందరు ఇక సమంత పని అయిపోయింది అనుకున్నారు. బాలీవుడ్ లో సీటడెల్ వెబ్ సిరీస్ తో సందడి చేయగా.. ఇట టాలీవుడ్ ను మర్చిపోయింది అన్నారు. సమంత స్టార్ డమ్ పోయింది. వయస్సు కూడా పెరుగుతోంది, ఇక వెబ్ సిరీస్ లు క్యారెక్టర్ రోల్ చేసుకోవడమే అన్నారు. కాని తాజా సమాచారం ప్రకారం సమంత చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి వింటే నోటిమీద వేలేసుకోవాల్సిందే. దాదాపు 15 వందల కోట్ల బడ్టెట్ తో తెరకోక్కబోతున్న సినిమాల్లో ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సమంత రీ ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతోందట. రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించి మెప్పించింది సమంత. మరోసారి రామ్ చరణ్ జోడీగా ఆమె నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు తో పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కాగా ఆతరువాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు దాదాపు 700 కోట్లకుపైగా భారీ బడ్జెట్ ను ఖర్చు చేయబోతున్నారట.

ఈసినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలి అని అనుకుంటున్నారట. రంగస్థలం జోడీ రిపిట్ అయితే.. ఆ క్రేజ్ వేరే ఉంటుంది. సో సమంత ఈ సినిమాతో భారీ రీఎంట్రీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

Also Read: చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

34

ఇక  సమంత , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా  ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇక వీరి కాంబో కూడా మరోసారి  కలవబోతున్నట్టు టాక్ . ఆ సినిమా మరేదో కాదు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్.  

ఈ  పాన్ ఇండియా మూవీని  రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రకటించారు.సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సన్ పిక్చర్స్ దాదాపుగా 800 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేయబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుకు ప్రియాంక చోప్రా ను తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈమూవీ చేయలేను అని చెప్పిందట.

ఇక ఆమె తరువాత ఈ కథను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల హీరోయిన్ సమంత అని అనుకున్నారట టీమ్. పైగా డైరెక్టర్ అట్లీ కూడా గతంలో సమంత తో ‘మెర్సల్’, ‘తేరి’ వంటి  సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ కూడా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట. 

lso Read:రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?

44

ఇక సమంత కూడా ఈ కథ విని బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్కచినట్టు తెలుస్తోంది. ఇక సమంత నాగచైతన్యతో విడాకులు తరువాత తన కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటుంది. మధ్యలో మయోసైటిస్ తో ఇబ్బందిపడినా.. ధైర్యంగా ఆ వ్యాధిని ఫేస్ చేసింది. చివరిగా  తెలుగు ఆడియన్స్ కి ‘ఖుషి’  సినిమాలో చివరిగా  కనిపించింది. ప్రస్తుతం సమంత పెళ్ళివార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ  దర్శకుడిని సమంత రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved