- Home
- Entertainment
- Salman Khan: రామ్ చరణ్, తారక్ ఎప్పుడు పిలిచినా సినిమా చేసేందుకు రెడీ.. తెలుగులో సల్మాన్ ఫేవరేట్ హీరో ఎవరు?
Salman Khan: రామ్ చరణ్, తారక్ ఎప్పుడు పిలిచినా సినిమా చేసేందుకు రెడీ.. తెలుగులో సల్మాన్ ఫేవరేట్ హీరో ఎవరు?
Salman Khan: సల్మాన్ ఖాన్ తెలుగు హీరోల గురించి స్పందించారు. తెలుగులో చరణ్, చిరు, వెంకీ, తారక్ ఇలా ఎవరు అడిగినా నటించేందుకు రెడీగానే ఉన్నట్టు తెలిపారు.

మాతృభూమితో రాబోతున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆయన ప్రస్తుతం `మాతృభూమి` అనే చిత్రంలో నటించారు. అపూర్వ లిఖియా దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ శుక్రవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. మీడియాతో ముచ్చటించారు. `మాతృభూమి` తనకు కొంత మూవీ అని, ఇప్పటి వరకు పాకిస్థాన్‌తో పోరాడే కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలే చేశామని, ఇప్పుడు చైనాతో పోరాడే సినిమా చేయడం కొత్తగా ఉందని చెప్పారు.
మాతృభూమి కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ కాదు
ఇది లఢఖ్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో పోరాడిన వీరమరణం పొందిన జవాన్ల ఆధారంగా, ఆయా సంఘటనలను బేస్ చేసుకొని రూపొందించారు. అందులో వీరమరణం పొందిన మన తెలంగాణ జవాన్, కల్నన్ సంతోష్ బాబు బయోపిక్ గా తెరకెక్కించారనే వార్తల నేపథ్యంలో దీనిపై సల్మాన్ స్పందించారు. ఇది బయోపిక్ కాదని, ఫిక్షన్ స్టోరీ అని చెప్పారు.
కానీ కొన్ని సంఘటనలను బేస్ చేసుకొని రూపొందించామని, సంఘటనలు ఉంటాయని, ఒకరి బయోపిక్ కాదని చెప్పారు. ఈ సందర్భంగా సంతోష్‌బాబు వీరమరణాన్ని ఆయన అభినందించారు. ఆయన సేవలను కొనియాడారు. ఇందులో నటించడం ఫిజికల్‌గా ఛాలెంజింగ్‌గా ఉందని, గడ్డకట్టే చలిలో నటించాల్సి వచ్చిందని చెప్పారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరు, వెంకీతో సినిమాలు చేసేందుకు రెడీ
తెలుగులో సినిమాలు చేయడంపై ఆయన మాట్లాడుతూ, తాను ఎప్పుడూ సిద్ధమే అన్నారు. చిరంజీవితో `గాడ్ ఫాదర్`లో క్యామియో రోల్ చేసిన నేపథ్యంలో మళ్లీ చిరంజీవి సార్, వెంకటేష్ సార్, రామ్ చరణ్, తారక్, కళ్యాణ్ ఇలా ఎవరు అడిగినా వాళ్ల సినిమాల్లో నటించేందుకు రెడీగానే ఉన్నట్టు తెలిపారు సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరం విషయాన్ని పంచుకున్నారు.
తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా, తానే ఫేవరేట్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన వంశీపైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి గురించి చెబుతూ, మూవీ బాగా వస్తుందని వంశీ, ఫెంటాస్టిక్ పర్సన్ అని, అద్భుతంగా సినిమా చేస్తున్నాడని, తను మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పారు. సినిమా గురించి తాను తర్వాత మాట్లాడుతానని వెల్లడించారు.
ట్రోల్స్ పై స్పందిస్తూ, సెటైర్లు పేల్చారు. ఈ మూవీ క్యాప్షన్ గురించి చెబుతూ, గొడవలు ఉండొద్దని, గొడవల ఇంట్లో ఉంటాయి, ఫ్యామిలీలో ఉంటాయి, అలాంటి గొడవలు లేకుండా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్యాప్షన్ పెట్టినట్టు చెప్పారు. సినిమా అందరికి నచ్చుతుందని తెలిపారు సల్మాన్.














