MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Salman Khan: పిల్లల్ని కంటా.. కానీ పెళ్లి చేసుకోను సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!

Salman Khan: పిల్లల్ని కంటా.. కానీ పెళ్లి చేసుకోను సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్!

Salman Khan: కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన పెళ్లి, పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా, భవిష్యత్తులో పిల్లల్ని కనాలని ఉందని మనసులోని మాట బయటపెట్టారు.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 15 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు?
Image Credit : Youtube

సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు?

సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఆయన ఫ్యాన్స్ అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. షారుఖ్, ఆమిర్ ఖాన్ లాంటి తోటి స్టార్స్ అంతా ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు. కానీ సల్మాన్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే మిగిలిపోయారు. అసలు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సల్మాన్ తాజాగా సమాధానం ఇచ్చారు.

సల్మాన్ ఖాన్ తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'కాఫీ విత్ కరణ్' తొమ్మిదో సీజన్ (చివరి సీజన్)లో సందడి చేశారు. సల్మాన్ ఈ షోలో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన పెళ్లి, పిల్లలు, రిలేషన్ షిప్స్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. "నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఇలా సింగిల్ గానే చాలా సంతోషంగా ఉన్నాను" అని కుండబద్దలు కొట్టారు. కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు పిల్లల్ని కనాలని ఉందని తన కోరికను బయటపెట్టారు.

పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ప్రైవేట్ గానే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే షోలో 2014లో తను చేసిన 'నేను వర్జిన్' కామెంట్స్ అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు సల్మాన్ ఫస్ట్ గెస్ట్. ఇప్పుడు ఆ పాత ముచ్చట్లను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సల్మాన్, మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు?
Image Credit : Youtube

సల్మాన్, మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు?

పెళ్లి ప్లాన్స్ గురించి కరణ్ అడిగినప్పుడు.. 60 ఏళ్ల సల్మాన్ ఖాన్ చాలా సింపుల్ గా "నేను ఇలాగే బాగున్నాను" అని ఆన్సర్ ఇచ్చారు. అంటే పెళ్లి చేసుకోకపోవడం తనకు ఎలాంటి లోటుగా అనిపించట్లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత టాపిక్ సల్మాన్ పర్సనల్ లైఫ్ వైపు మళ్లింది. "మీరు ఇంకా వర్జిన్ ఏనా?" అని కరణ్ అడిగారు.

దీనికి సల్మాన్ నవ్వుతూ.. గతంలో తను ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. "కరణ్, నాకు నా పర్సనల్ విషయాలు మాట్లాడటం ఇష్టం ఉండదు. మీరు, ఇంకా కొందరు నా డేటింగ్ గురించి పదే పదే అడుగుతుంటారు. దానికి చెక్ పెట్టడానికే అప్పట్లో అలా చెప్పాను" అని క్లారిటీ ఇచ్చారు.

సల్మాన్ రిలేషన్ షిప్స్ విషయంలో ఫ్యూచర్ ఎంత అన్ ప్రెడిక్టబుల్ గా ఉంటుందో చెప్పుకొచ్చారు. "ఒకరితో జీవితాంతం కలిసి ఉండాలని మనం అనుకుంటాం. కానీ వాళ్లు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. అందుకే నా 15-16 ఏళ్ల వయసు నుంచే ఈ విషయాన్ని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను" అని అన్నారు.

పబ్లిక్, ప్రైవేట్ లైఫ్ మధ్య ఒక గీత గీసుకోవాలని తన తండ్రి, సీనియర్ రైటర్ సలీం ఖాన్ ఇచ్చిన సలహాను సల్మాన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "ఈ దేశం మొత్తం నీ లివింగ్ రూమ్ లాంటిది. లివింగ్ రూమ్ లో మాట్లాడే మాటలు దేశం మొత్తానికి చెప్పొచ్చు. కానీ బెడ్ రూమ్ ముచ్చట్లు ఎప్పుడూ లివింగ్ రూమ్ దాటి బయటకు రాకూడదు" అని తన తండ్రి చెప్పిన మాటలను సల్మాన్ పంచుకున్నారు.

33
ఏదో ఒక రోజు పిల్లల్ని కంటా..
Image Credit : instagram

ఏదో ఒక రోజు పిల్లల్ని కంటా..

సల్మాన్ ఖాన్ తనకు భవిష్యత్తులో పిల్లల్ని కనాలనే ఆశ ఉందని చెప్పారు. "పెళ్లి చేసుకోలేదు కదా, ఫ్యూచర్ లో ఒంటరితనం ఫీల్ అవుతారేమో?" అని కరణ్ అడిగిన ప్రశ్నకు.. "కచ్చితంగా, ఏదో ఒక రోజు నాకు పిల్లలు పుడతారు" అని సల్మాన్ ధీమా వ్యక్తం చేశారు.

యష్, రూహి అనే కవల పిల్లలకు తండ్రి అయిన కరణ్.. పేరెంట్ గా ఉండటం తన జీవితంలో దొరికిన అతిపెద్ద వరం అని చెప్పారు. దీనికి సల్మాన్ ఆయన్ను అభినందించారు. "నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే దానికి ఎవరినీ బ్లేమ్ చేయలేను, అది నా పర్సనల్ డెసిషన్. ఆ నిర్ణయంతో నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు పిల్లల్ని మాత్రం కంటాను" అని సల్మాన్ క్లారిటీ ఇచ్చారు.

సల్మాన్ తన తోటి హీరోల గురించి కూడా గొప్పగా మాట్లాడారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి తన జనరేషన్ హీరోలు ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగడంపై ఆయన చర్చించారు. ఇన్నేళ్లుగా వాళ్లు తమ కెరీర్ కోసం పెడుతున్న ఎఫర్ట్స్, టైమ్ వల్లే ఇప్పటికీ స్టార్స్ గా నిలబడ్డారని సల్మాన్ ప్రశంసించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Release: జపాన్ నుంచి దుబాయ్ దాకా జైలర్ 2 ఫీవర్.. పూనకాలతో ఊగిపోతున్న రజనీకాంత్ ఫ్యాన్స్
Recommended image2
Jailer 2 Movie Review: జైలర్‌ 2 మూవీ రివ్యూ.. రజనీకాంత్‌ విశ్వరూపం.. బాక్సాఫీసు షేక్‌ అవ్వాల్సిందే
Recommended image3
12 సినిమాలు చేస్తే అందులో 10 అట్టర్ ప్లాప్, అయినా ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు
Related Stories
Recommended image1
ఋతురాగాలు రాజా ఎలా చనిపోయాడో తెలుసా? అసలేం జరిగిందో చెప్పేసిన నటి రూపాదేవి
Recommended image2
DMart: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు మాత్రం ఎందుకు అమ్మరు? అసలు నిజం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved