సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీ కి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. కారణం ఏంటో తెలుసా..?
సల్మాన్ ఖాన్ ఇల్లు చూశారా..? ఆయన గదికి ఉన్న బాల్కానిగమనిస్తే.. బ్లూ కలర్ అద్దంతో కప్పి ఉంచారు. కారణం ఏంటి...? ఈ అద్దం ప్రత్యేకత ఎంటో తెలుసా..?
సల్మాన్ ఖాన్ కు బద్రత పెంచుకున్నారు పోలీసులు, స్టార్ హీరో నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ నివాసంలోని సల్మాన్ బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్గాస్ ను ఏర్పాటు చేయడం ద్వారా సెక్యురిటీని పెంచుకున్నారు. ఇక సల్మాన్ బాల్కనీ బ్లూ షీట్‌తో కప్పబడి కనిపించింది.
Also Read: 40 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన సినిమా, హీరో మరణం తరువాత థియేటర్స్ లోకి మూవీ, ఎవరా హీరో..?
చాలాకాలంగా సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. సల్మాన్ ను చంపేస్తామని ఆయన మీడియా మఖంగానే ప్రకటించాడు. ఇక ఈక్రమంలోనే అన్మోల్ బిష్ణోయ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ తర్వాత, సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు, ఆతరువాత సల్మాన్ టీమ్ ను 5 కోట్లు డిమాండ్ చేస్తూ సందేశం పంపడం లాంటివి జరిగాయి.
Also Read: ఎన్టీఆర్ - బాలకృష్ణ గొడవపై డైరెక్టర్ బాబి క్లారిటీ
ఈ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. దుబాయ్ నుండి దిగుమతి చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ SUVని కొనుగోలు చేయడం, అదనపు సాయుధ అధికారులతో తన భద్రతా బృందాన్ని బలోపేతం చేయడం తో పాటుగా సల్మాన్ ఖాన్ నివాసంలో ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం సికిందర్ కోసం సన్నాహాలు చేస్తున్నారు, ఇది సాజిద్ నడియాద్వాలా మరియు AR మురుగదాస్‌లతో కలిసి చేస్తున్నారు. ఈద్ సందర్భంగా 2025 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈమూవీలో సల్మాణ్ ఖాన్ జంటగా రష్మిక మందన్న నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి , కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.