MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఇలా చేస్తే చాలు! ‘సలార్‌’ బైక్ మీ సొంతం

ఇలా చేస్తే చాలు! ‘సలార్‌’ బైక్ మీ సొంతం

 ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ప్రభాస్ బైక్ నడుపుతున్న పోస్టర్‌ను షేర్ చేసి, క్యాప్షన్‌లో గివ్‌ అవే డీటైల్స్‌ పేర్కొంది.

4 Min read
Author : Surya Prakash
Published : Apr 19 2024, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


  హైఓల్టేజ్‌ ‘సలార్‌’మూవీలో ప్రభాస్‌ చాలా సీన్స్‌లో బైక్‌ నడుపుతూ కనిపిస్తారు. ఈ బైక్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌, బైక్‌ లవర్స్‌కు తెగ నచ్చేసింది. ఇప్పుడు ఆ బైక్ ని సొంతం చేసుకునే అవకాసం కల్పిస్తోంది సలార్ టీమ్ .మీకూ ఆ బైక్‌ అంటే ఇష్టమా? అయితే ఏం చేయాలో క్రింద వివరించటం జరిగింది చూడండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213


‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్లారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని మాగ్జిమం కలెక్షన్స్ రాబట్టింది.

313


ఇప్పుడు ఫ్యాన్స్‌ కోసం మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో గివ్‌ అవే క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రభాస్ ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను ఒక లక్కీ విన్నర్‌కు అందజేయనున్నారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ప్రభాస్ బైక్ నడుపుతున్న పోస్టర్‌ను షేర్ చేసి, క్యాప్షన్‌లో గివ్‌ అవే డీటైల్స్‌ పేర్కొంది.
 

413


హోంబలే ఫిల్మ్స్ ఇన్‌స్టా పోస్టులో "SalaarCeaseFireలో రెబెల్ స్టార్ #ప్రభాస్ నడిపిన అదే ఐకానిక్ బైక్‌ను గెలుచుకోవడానికి మీకో ఎక్స్‌క్లూజివ్‌ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందల్లా, ఏప్రిల్‌ 21న 5:30 PM నుంచి 8 PM వరకు స్టార్‌ మా ఛానెల్‌లో సలార్‌ మూవీ ప్రసారమవుతుంది. మూవీటైమ్‌లో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్‌ ఎన్నిసార్లు కనిపించిందో లెక్కించాలి. SMS లైన్స్‌ ఓపెన్‌ అయినప్పుడు, SALAAR <space> <స్క్రీన్‌పై బైక్‌ కనిపించిన సంఖ్య> టైప్‌ చేసి 9222211199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్ష్‌ ఓపెన్‌ అవుతాయి. T&C వర్తిస్తాయి" అని వివరించింది.

513


  ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ వీకెండ్ అవ్వగానే కొన్నిచోట్ల కలెక్షన్స్ డ్రాప్ స్టార్టైంది. అయితే సెకండ్ వీకెండ్ లో జనాలకు డెవిల్, బబుల్ గమ్ సినిమాలు తప్పించి ఆప్షన్ లేకపోవటంతో మళ్లీ సలార్ కు కలెక్షన్స్ పోటెత్తాయి. చాలా చోట్ల సలార్ హౌస్ ఫుల్స్ పడ్డాయి. సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా ఈ ప్రవాహం నడిచింది.
 

613


న్యూ ఇయిర్ ని సలార్ తో సెలబ్రేట్ చేసుకుంన్నారు ఫ్యాన్స్ . మళ్లీ మళ్లీ చూసేవాళ్లు కొందరైతే ... న్యూ ఇయిర్ కొత్త సినిమా చూద్దామని ఫిక్సై డెవిల్ కు పెద్ద టాక్ లేకపోవటంతో సలార్ వైపు మ్రొగ్గు చూపేవారు మరికొందరు.  దాంతో 2023 హైయిస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా సలార్ తన స్దానం సంపాదించుకుంది. యుఎస్ భాక్సాపీస్ దగ్గర $9 మార్క్ ని రీచ్ అయ్యింది. 

713
Prabhas Prithviraj Salaar 2 begins from march update out

Prabhas Prithviraj Salaar 2 begins from march update out

 కేజీఎఫ్, కేజీఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో మంచి హిట్ ఇచ్చింది.  శృతిహాస‌న్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2023లోనే మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజైన స‌లార్ (Salaar)  ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.  స‌లార్ ప‌క్కా ప్ర‌శాంత్ నీల్ మార్కు మూవీ. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 స్టైల్‌లోనే క‌థ‌, క‌థ‌నాల కంటే హీరోయిజం, ఎలివేష‌న్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప్ర‌శాంత్ నీల్ స‌లార్ మూవీని తెర‌కెక్కించాడు. 

813

ప్ర‌తి సీన్‌లో ప్ర‌భాస్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ హీరోగా ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అభిమానులు చూసి చాలా కాల‌మైంది. ఆ లోటును స‌లార్‌తో(Salaar Review) భ‌ర్తీ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌. దేవాగా ప్ర‌భాస్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌, హీరోయిజం ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంది.

913

స‌లార్ క‌థ చాలా వ‌ర‌కు ప్ర‌శాంత్ నీల్ మొద‌టి సినిమా ఉగ్రమ్‌ ఛాయ‌ల‌తోనే సాగుతుంది. శృతిహాస‌న్ ఎపిసోడ్ మొత్తం ఉగ్రమ్‌ సినిమా నుంచే స్ఫూర్తి పొంది రాసుకున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. ఖాన్సార్ బ్యాక్‌డ్రాప్‌ను మాత్రం కొత్త‌గా రాసుకున్నాడు. ఖాన్సార్ పీఠం కోసం రాజ‌మ‌న్నార్ ఫ్యామిలీలో అంత‌ర్గ‌త పోరు...స‌లార్(Salaar ) బ్యాక్‌డ్రాప్‌, యాక్ష‌న్ సీన్స్‌, ఎలివేష‌న్స్, ఖాన్స‌ర్ సెట‌ప్‌...అన్ని కేజీఎఫ్‌, కేజీఎఫ్ -2ను పోలి ఉంటాయి. హీరో ల‌క్ష్యం, వారి నేప‌థ్యాలు వేరైనా...క‌థ విష‌యంలో మాత్రం కేజీఎఫ్‌, స‌లార్ ఒకేలా అనిపిస్తాయి. అయితే కేజీఎఫ్ స్థాయిలో ఎమోష‌న్స్ పండ‌లేదు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌ను రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో చూపించాడు ప్ర‌శాంత్ నీల్‌.

1013
Salaar

Salaar

ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షోగా స‌లార్ నిలుస్తుంది. ప్ర‌భాస్ క‌నిపించే ప్ర‌తి సీన్ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా కిక్ ఇచ్చేలా ప్ర‌శాంత్ నీల్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో అయితే ప్ర‌భాస్ చెల‌రేగిపోయాడు. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా అనిపిస్తుంది.

వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ పాత్ర‌కు పృథ్వీరాజ్ ప్రాణం పోశాడు. ఈ క్యారెక్ట‌ర్‌కు తాను త‌ప్ప మ‌రొక‌రు యాప్ట్ కాద‌ని అనిపించేలా న‌టించాడు. 

1113

స‌లార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గ‌లాంటి మూవీ. త‌న లుక్‌, యాక్టింగ్‌, యాక్ష‌న్‌తో అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్‌తో పోలిక లేకుండా చూస్తే సలార్ మెప్పిస్తుంది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా ఫ‌స్ట్ డే సలార్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌ిన  ఈ చిత్రం టీవీల్లోనూ రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయ‌మే...

1213

సలార్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ వివరాలను ప్రముఖ టీవీ ఛానెల్ ‘స్టార్ మా’ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సలార్ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా ప్రకటించింది. ఇందుకు సంబంధించి నేడు ఓ ప్రోమో విడుదల చేసింది. సలార్ టీవీ ప్రీమియర్ తేదీ, టైమ్ అనౌన్స్‌మెంట్ కోసం నేడు ఓ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. ప్లీజ్.. కైండ్లీ.. రిక్వెస్ట్ అంటూ ప్రభాస్ డైలాగ్‍తో ఈ ప్రోమోను తీసుకొచ్చింది. 

1313
Prabhas starrer Salaar

Prabhas starrer Salaar

ఎపిక్ యాక్షన్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్‌ సలార్ సిద్ధమవ్వాలని, ఈ ఆదివారం (ఏప్రిల్ 21) సాయంత్రం 5:30 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ట్వీట్ చేసింది. సలార్ చిత్రం టీవీలోనూ మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఎంత టీఆర్పీ రేటింగ్ సాధిస్తుందో చూడాలి.  సలార్ చిత్రానికి ఓటీటీల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు సలార్ సినిమా సిద్ధమైంది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రశాంత్ నీల్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved