కొత్త ప్రియుడుతో శ్రుతి హాసన్.. మ్యూజిక్ వీడియో!
First Published Feb 23, 2021, 10:32 AM IST
శ్రుతి హాసన్ లండన్ ప్రియుడు మైఖేల్ కోర్స్లే తో బ్రేకపై ఏడాదిన్నర కూడా కావడం లేదు. 2019లో శృతి మైకేల్ విడిపోవడం జరిగింది. మైకేల్ కోసం లండన్ వెళ్లిన శృతి హాసన్... సినిమాలు కూడా పక్కన పెట్టేసింది. అయితే మరలా శృతిహాసన్ ప్రేమలో పడ్డారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ముంబైకి చెందిన డూడుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్, కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ముంబైలో తరచుగా కలిసి కనిపిస్తున్న ఈ జంట... పుట్టినరోజు వేడుకలలో కూడా సందడి చేస్తున్నారు.

ఇంకా అధికారికంగా బయటికి ప్రకటించకున్నప్పటికీ శాంతను హజారికతో శృతి ప్రేమాయణం నిజమేనన్న మాట గట్టిగా వినిపిస్తుంది.

కాగా శృతి, శాంతను కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేయనున్నారట. సినిమాలతో పాటు మ్యూజిక్ కంపోసింగ్ పై ద్రుష్టి పెట్టిన శృతి హాసన్ మ్యూజిక్ వీడియో చేయడానికి సర్వంసిద్ధం చేస్తున్నారట.

ఈ ప్రాజెక్ట్ లో శృతి, శాంతను ని పార్టనర్ గా చేసుకోనున్నారట. శాంతను చేత ఆమె ర్యాప్ పాడించాలని అనుకుంటున్నారట.

గతంలో శాంతనుకు ర్యాప్ పాడిన అనుభవం కూడా ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంతో పాటు ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

మల్టీ టాలెంటెడ్ గా పేరున్న శృతికి సింగింగ్, రైటింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. ఇక శృతి హాసన్ కెరీర్ కూడా కొంచెం గాడిన పడింది. ఆమెకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.
