- Home
- Entertainment
- Guppedantha Manasu: వెడ్డింగ్ కార్డు చూసి షాకైన రిషీ.. వసునే తన భార్యగా ఫిక్స్ అయిన ఇగో మాస్టర్!
Guppedantha Manasu: వెడ్డింగ్ కార్డు చూసి షాకైన రిషీ.. వసునే తన భార్యగా ఫిక్స్ అయిన ఇగో మాస్టర్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) నీకు జీవితంలో ఊహించని గిఫ్ట్ ఈరోజు నేను ఇస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక వసు (Vasu) ఎగ్జామ్ కి వెళ్తున్న క్రమంలో రిషి చేతులు గట్టిగా పట్టుకొని చాలా థ్యాంక్స్ అని చెబుతుంది. మరోవైపు సాక్షి నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో నేను చూస్తాను అని అనుకుంటుంది.
ఆ తరువాత రిషి (Rishi) సాక్షి వెడ్స్ రిషి వెడ్డింగ్ కార్డు చూసి ఒకసారి గా స్టన్ అవుతాడు. ఇక రిషి దేవయాని (Devayani) కి కాల్ చేసి వెడ్డింగ్ కార్డు గురించి విరుచుకు పడతాడు. ఏంటి ఈ పని అని రిషి మహేంద్ర పైన కూడా విరుచుకు పడతాడు. ఇక వసు ఎగ్జామ్ హాల్ లో రిషి ఇచ్చిన పెన్ చూసుకుంటూ మురిసిపోతోంది.
మరోవైపు మహేంద్ర (Mahendra) రిషి కి మనం మరింత ఒత్తిడి పెంచితేనే వసు (Vasu) కు దగ్గరవుతాడు అని జగతి కి చెబుతాడు. ఇక వసు మనసులో ఖచ్చితంగా రిషి ఉంటాడు అని నేను నమ్ముతున్నాను అని మహేంద్ర అంటాడు. మరోవైపు దేవయాని నువ్వు అనుకునేది వేరు జరిగేది వేరు మహేంద్ర అని అనుకుంటుంది.
ఇక రిషి (Rishi), సాక్షి (Sakhi) వెడ్డింగ్ కార్డులో నా పక్కన ఉండటం ఏమిటి? అని కోపం పడుతూ ఉంటాడు. అదే క్రమంలో నేను ఎవరిని నా మనసులో ఆహ్వానిస్తున్నాను అని అనుకొని వసు తో తనకు జరిగిన తీపి జ్ఞాపకాలను ఊహించుకుంటాడు. అంతేకాకుండా వసు దూరంగా వెళితే తను ఉండలేను అని గ్రహించి.. ఇదేనా ప్రేమంటే అని అనుకుంటాడు.
అంతేకాకుండా నాకు తెలియకుండానే నా మనసు వసు (Vasu) వైపు మొగ్గుతుందా అని రిషి (Rishi) అనుకుంటాడు. ప్రతి ఆలోచనలో వసు నాకు తోడుగా ఉంటుంది. తన ప్రతి మాట నాకు అందమైన జ్ఞాపకం, తను నా పక్కనుంటే ప్రతిరోజు ఆనందాల పండుగే అని అనుకుంటాడు. ఇక తను నాకు కావాలి అని వసు గట్టిగా అనుకుంటాడు.
ఇక రిషి (Rishi).. మిస్టర్ రిషేంద్ర భూషణ్ నీకు వసు (Vasu) కావాలి అని గట్టిగా అనుకుంటాడు. ఇక తనే నీ జీవితం.. తనే నీ చివరిదాకా ప్రయాణించే తోడు అని అనుకుంటూ ఎంతో ఆనందంగా మురిసిపోతుంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.