MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • “దేవర”విలన్ సైఫ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

“దేవర”విలన్ సైఫ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

ఇక  భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. భైరా పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఎప్పుడో రిలీజ్ చేశారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Aug 19 2024, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


హిందీ హీరోలు ఇప్పుడు తెలుగులో విలన్స్ గా చేస్తున్నారు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంజయ్ దత్ విలన్ గా దుమ్ము దులిపారు. ఆయన మూలంగానే సినిమాకు నార్త్ లో ఓ రేంజి బిజినెస్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. సంజయ్ దత్, రామ్ కలిపి వేసిన పోస్టర్స్ , ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉంది అనేది ప్రక్కన పెడితే ఓపినింగ్స్ తెచ్చిపెట్టడానికి, ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఈ కాంబో బాగా కలిసొచ్చింది. అలాగే ఇప్పుడు దేవర చిత్రంతో సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా తెలుగుకు తీసుకొస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


 ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం  దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా యావత్ దేశం ఎదురుచూస్తోందన్న సంగతి తెలిసిందే.   ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో .. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 27, 2024  న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం నిమిత్తం సైఫ్ కు భారీ రెమ్యననరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా డబుల్ ఇస్మార్ట్ నిమిత్తం సంజయ్ దత్ ఇచ్చిన రెమ్యునరేషన్ కు రెట్టింపు అని సమాచారం. 
 

37


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవరలో విలన్ గా చేసేందుకు గానూ సైఫ్ అలీ ఖాన్ కు 20 కోట్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ఆ మేరకు హిందీ థియేటర్ మార్కెట్ అవుతుందని నమ్ముతున్నారు. అలాగే హిందీ యూట్యూబ్ మార్కెట్ కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కువ. ఇప్పుడు సైఫ్ కూడా కలవటంతో అది రెట్టింపు అవుతోందని చెప్తున్నారు. అలా సైఫ్ కు ఇచ్చిన ఎమౌంట్ రికవరీ అవుతుంది. 

47


ఇక డబుల్ ఇస్మార్ట్  సినిమా నిమిత్తం సంజయ్ దత్ కు 10 కోట్లు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. అంటే అంతకు రెట్టింపు ఎమౌంట్ సైఫ్ కు ఇచ్చినట్లు అన్నమాట. అయితే దేవర రెండు పార్ట్ లకు కలిపి ఇరవై కోట్లా లేక కేవలం ఒక  పార్ట్ కు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. ఇక దేవర బిజినెస్ మంచి ఊపు మీద ఉంది. మరో ప్రక్క దేవర ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. 

57


ఇక  భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. భైరా పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఎప్పుడో రిలీజ్ చేశారు.   సైఫ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సైఫ్ అదరగొట్టేశాడు. ఇక ఈ గ్లింప్స్ చూస్తే ఎన్టీఆర్, సైఫ్ ఫేస్ ఆఫ్.. వారి మధ్య వచ్చే ఫైట్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని అర్థం అవుతుంది. 
 

67


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్  పాయింట్.  
 

77
Saif ali khan

Saif ali khan


‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు.  రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image2
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image3
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved