హీరో సైఫ్ అలీఖాన్‌కి కత్తిపోట్లు, ఇంట్లోకి చొరబడి వ్యక్తి దాడి, అసలేం జరిగింది?
బాలీవుడ్ నటుడు, `దేవర` ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్టు సమాచారం.
`దేవర` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్‌ని కత్తితో దాడి చేశాడట. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ కి బలంగా గాయం కావడంతో ముంబాయిలోని స్థానిక లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట.
saif ali khan
అయితే బుధవారం అర్థరాత్రి ఓ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. తన సెక్యూరిటీ గార్డ్ తో వారిస్తున్నాడట. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఇది గమనించిన సైఫ్ అలీ ఖాన్ మధ్యలోకి వెళ్లాడు. ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశాడట. శాంతింప చేసేందుకు ప్రయత్నించగా, ఈ క్రమంలో అతను తన వద్ద ఉన్న కత్తి తీసుకుని సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేశాడట. దీంతో `దేవర` నటుడికి గాయాలు అయ్యాయని, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు ముంబయి పోలీసులు వెల్లడించారు.
సైఫ్‌కి బలంగానే కత్తిపోట్లు ఉన్నట్టు తెలుస్తుంది. చాలాచోట్ల కత్తితో పోడిచినట్టు సమాచారం. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. మరి ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. దొంగనా? నిజంగానే ఎవరైనా కుట్ర చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెలబ్రిటీ ఇళ్లకి సెక్యూరిటీ బాగానే ఉంటుంది. అయినా వ్యక్తి ఎలా లోపలికి వచ్చారనేది ఆనుమానంగా మారింది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. స్టార్ హీరోగా రాణించారు. కానీ ఇటీవల ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉందే విలన్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `దేవర` చిత్రంలో నటించారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహించారు.
read more: మంచు ఫ్యామిలీ వివాదంః మళ్లీ అగ్గిరాజేసిన మంచు మనోజ్.. అసలు కారణం ఇదేనా?
ఇందులో భైరవ పాత్రలో సైఫ్ కనిపిస్తాడు. ఆయన పాత్ర మొదట దేవరకి స్నేహితుడిగా కనిపిస్తుంది. ఆ తర్వాత నెగటివ్ షేడ్‌లోకి వెళ్లిపోతుంది. ఆయనే మెయిన్ విలన్. దేవరతో ఆయన పోరాటమే ఈ మూవీ కథ. గతేడాది సెప్టెంబర్లో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. సైఫ్‌కి మంచి ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడు `దేవర 2`కి ప్లాన్ జరుగుతుంది.
read more: ఊరమాస్ కాంబోని సెట్ చేసిన బాలకృష్ణ.. ఈసారి బోయపాటి సినిమాని మించి !
also read: పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ టైమ్ చిరంజీవి వార్నింగ్, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు