MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nayanthara: సాయి పల్లవికి షాక్, నయనతారను పోల్చుతూ ట్రోలింగ్, సీత పాత్రపై కొత్త రచ్చ

Nayanthara: సాయి పల్లవికి షాక్, నయనతారను పోల్చుతూ ట్రోలింగ్, సీత పాత్రపై కొత్త రచ్చ

Nayanthara: 2026లో రాబోతున్న రామాయణ సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంచుకోవడాన్ని చాలామంది మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ట్రైలర్ వచ్చాక ఆమె లుక్, నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అయినా సరే ప్రస్తుతం నయనతారతో పోల్చుతు కొత్త రచ్చ స్టార్ట్ చేశారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 02 2026, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సోషల్ మీడియాలో కొత్త రచ్చ...
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో కొత్త రచ్చ...

సోషల్ మీడియా అంటే ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అదో పబ్లిక్ డబ్బా లాంటిది. ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది అందులో వేయొచ్చు. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయంపై సోషల్ మీడియాలో చర్చలు, ట్రోల్స్, కామెంట్లు, గొడవలు, కేసులు కూడా కామన్ అయిపోయాయి.

కొన్ని దేశాల్లో సోషల్ మీడియా వాడకంపై కఠినమైన రూల్స్ ఉన్నాయి. కానీ చాలా చోట్ల దీన్ని చెత్తకుండీలా వాడేవాళ్లూ ఉన్నారు. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకంటే, ఇటీవల రిలీజైన రామాయణం ట్రైలర్‌లోని కొన్ని పాత్రలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, అవహేళన, విమర్శల గురించి ఈ చర్చ అంతా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాముడిగా మహేష్ బాబు బెటర్ అంట..
Image Credit : Youtube

రాముడిగా మహేష్ బాబు బెటర్ అంట..

జూలై 30న రామాయణం ట్రైలర్ రిలీజ్ అవ్వగానే, ఇది రామాయణం కాదు 'రావణాయణం' అంటూ చర్చ మొదలైంది. రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్ సరైన ఎంపిక కాదంటున్నారు. ఆయన బదులు మహేష్ బాబును పెట్టి ఉంటే బాగుండేదని, ఏఐ (AI) రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

36
సాయి పల్లవికి షాక్
Image Credit : Chatgpt AI And instagram

సాయి పల్లవికి షాక్

రాముడినే కాదు, నెటిజన్లు సీతను కూడా వదలలేదు. 2026లో రానున్న ఈ రామాయణం సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంచుకోవడాన్ని చాలామంది మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. అయితే, ట్రైలర్ వచ్చాక ఆమె లుక్, నటనకు 99% విమర్శలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు సాయి పల్లవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది.

46
సీన్ లోకి నయనతార ఎందుకొచ్చింది..?
Image Credit : Asianet News

సీన్ లోకి నయనతార ఎందుకొచ్చింది..?

అంతేకాదు, సాయి పల్లవి సీత పాత్రను నయనతార చేసిన సీత పాత్రతో పోలుస్తూ కొత్త ట్రోల్స్ మొదలుపెట్టారు. సాయి పల్లవి కంటే కీర్తి సురేష్, అనుష్క శెట్టి బెటర్ ఆప్షన్ అని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు మొదలైన కొత్త రచ్చ ఏంటంటే.. రామాయణంలో సీత పాత్ర సాయి పల్లవికి బదులు నయనతారకు ఇవ్వాల్సింది అని!

56
నెటిజన్స్ ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే..
Image Credit : X

నెటిజన్స్ ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే..

ఒక నెటిజన్ ఇలా రాశారు: 'నాసిరకం కాస్ట్యూమ్స్ పాత్రకే కళంకం తెస్తాయి. ఆ భారీ, అతి అలంకరణ ఉన్న బట్టలు సీత పాత్రకు, సాయి పల్లవికి అస్సలు సూట్ అవ్వట్లేదు. ఎంత దారుణం! దీనికంటే నయనతార సీత పాత్రను ఎంతో అద్భుతంగా చేసింది.' ఇంకో నెటిజన్ ఇలా అన్నారు: 'చెత్త కాస్ట్యూమ్స్ మొత్తం పాత్రనే పాడుచేశాయి. సీతగా నయనతార నటన, లుక్ దీనికంటే లక్ష రెట్లు బాగుంది.' అంటున్నారు. అయితే, ఈ అభిప్రాయాలకు అదే సోషల్ మీడియాలో కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

66
నటీనటుల ఎంపిక సోషయల్ మీడియాకు వదిలేయాలా?
Image Credit : others

నటీనటుల ఎంపిక సోషయల్ మీడియాకు వదిలేయాలా?

నెటిజన్లు కొన్ని విషయాలు మరిచిపోతున్నారు. ఏ సినిమాకైనా నటీనటులను ఎంచుకునేటప్పుడు దర్శకులు, నిర్మాతలు చాలా విషయాలు లెక్కలేసుకుని, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అందులోనూ రామాయణం లాంటి ఇతిహాసాన్ని తెరపైకి తెచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు. చారిత్రక సినిమాలకు అన్ని రోజులు కాల్‌షీట్లు ఇచ్చే నటీనటులు కూడా కావాలి. ఇవన్నీ చూశాకే షూటింగ్ మొదలవుతుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చాక నెటిజన్లు చర్చిస్తే ఏం లాభం?  ఒక సినిమా కు  నటీనటుల ఎంపిక అనేది ఎన్నికల్లో ఓటింగ్ పద్ధతి కాదు. డబ్బు పెట్టే నిర్మాత, కథను నడిపే దర్శకుడిదే తుది నిర్ణయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Related Stories
Recommended image1
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved