ఇది కదా జోడీ అంటే, నితిన్ తో తొలిసారి సాయి పల్లవి రొమాన్స్.. 'ఎల్లమ్మ'లో పవర్ ఫుల్ రోల్ ?
బలగం తర్వాత వేణు ఎలాంటి చిత్రం చేస్తారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈసారి కూడా వేణు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఎల్లమ్మ అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
యంగ్ హీరో నితిన్ నటించిన రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న తమ్ముడు చిత్రం కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో రెండు చిత్రాలని నితిన్ సైన్ చేశారు. ఇష్క్ చిత్రంతో తన కెరీర్ నిలబెట్టిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ మరో చిత్రం చేయబోతున్నారు. అదే విధంగా బలగం దర్శకుడు వేణు యెల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే క్రేజీ ప్రాజెక్టు ఒకే అయింది.
బలగం తర్వాత వేణు ఎలాంటి చిత్రం చేస్తారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈసారి కూడా వేణు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఎల్లమ్మ అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఉండబోతోంది. నాని చేయాల్సిన చిత్రం నితిన్ చేతుల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.
ఎల్లమ్మ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమెతో చర్చలు ముగిశాయట. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుంది. నితిన్, సాయి పల్లవి జంట చూడ ముచ్చటగా ఉంటుంది అని అప్పుడే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నితిన్ తో సాయి పల్లవి నటించడం ఇదే తొలిసారి. ఆల్రెడీ సాయి పల్లవి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఫిదా చిత్రంలో నటించింది. ఆ మూవీలో తెలంగాణ యాసలో సాయి పల్లవి డైలాగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
Sai Pallavi
బలగం చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూనే ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఎల్లమ్మ షూటింగ్ ఎక్కువగా తెలంగాణ పల్లెటూరి ప్రాంతాల్లో జరుగుతుందని అంటున్నారు.
సాయి పల్లవి వరుసగా క్రేజీ చిత్రాల్లో భాగం అవుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా బాలీవుడ్ లో రామాయణం చిత్రంలో సీత పాత్రలో అద్భుత అవకాశం దక్కించుకుంది. సో 2025 సంవత్సరంలో సాయి పల్లవి ఫుల్ బిజీ మారబోతోంది.