MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి నా సినిమా రిజెక్ట్ చేయడమే మంచిదైంది.. చిరు కామెంట్స్, అయ్యో సర్ అంటూ హైబ్రీడ్ పిల్ల..

సాయి పల్లవి నా సినిమా రిజెక్ట్ చేయడమే మంచిదైంది.. చిరు కామెంట్స్, అయ్యో సర్ అంటూ హైబ్రీడ్ పిల్ల..

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ లు గా హాజరయ్యారు. 

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 19 2021, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ లు గా హాజరయ్యారు. ఇద్దరు లెజెండ్స్ వేదిక పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సాయి పల్లవిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. సాయి పల్లవిని చిరు ఒక రేంజ్ లో పొగుడుతూనే కొన్ని ఆసక్తిగా కామెంట్స్ చేశారు. సాయి పల్లవి గతంలో వరుణ్ తేజ్ పక్కన నటించింది. అప్పుడు వరుణ్ తేజ్ నేను ఎలా చేశాను డాడీ అని అడిగాడు. సారీ రా నేను సాయి పల్లవిని చూస్తూ ఉండిపోయాను అని చెప్పి చిరు నవ్వులు పూయించారు. 

36

చిరంజీవి సాయి పల్లవి గురించి ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. నేను నటించబోయే తదుపరి చిత్రంలో నటించేందుకు సాయి పల్లవిని చిత్ర యూనిట్ అడిగింది. నా మనసులో ఆమె అంగీకరించకుంటే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది. నేను అనుకున్నట్లుగానే సాయి పల్లవి ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది అని చిరు షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనితో సాయి పల్లవి కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. 

46

సాయి పల్లవి ఆ చిత్రం ఒప్పుకోకూడదు అని నేను మనసులో అనుకోవడానికి కారణం ఉంది. సాయి ఆ చిత్రంలో సాయి పల్లవి నాకు చెల్లిగా నటించాలి. కానీ సాయిపల్లవి అద్భుతమైన డాన్సర్. అంత అద్భుతంగా డాన్స్ చేసే అమ్మాయికి అన్నయ్యగా నటించడం ఏంటి ? నటిస్తే ఆమెతో కలసి డాన్స్ చేయాలి. అప్పుడే కిక్కు అని చిరంజీవి అనడంతో ఆడిటోరియం మోతెక్కిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. 

56

చిరు ఈ విషయం చెప్పడంతో సాయి పల్లవి మధ్యలోనే మైక్ అందుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయ్యో సర్.. మీరంటే నాకు అభిమానం. ఆ సినిమా నేను రిజెక్ట్ చేయడానికి కారణం ఉంది. నాకు సహజంగానే రీమేక్ మూవీస్ అంటే భయం.అందుకే ఒప్పుకోలేదు. అంతే కానీ మీతో నటించే ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటాను. నెక్స్ట్ మూవీలో అవకాశం ఇవ్వండి అని కోరింది. 

66

దీనితో చిరు జస్ట్ కిడ్డింగ్ అని అన్నారు. నీతో కలసి డాన్స్ చేసే సినిమా తప్పకుండా చేస్తానని అన్నారు. ఇదంతా ఒకెత్తయితే.. చిరు, సాయి పల్లవి కామెంట్స్ కు అమీర్ ఖాన్ ఇచ్చిన రియాక్షన్ మరో ఎత్తు. అమీర్ మైక్ అందుకుని.. సర్ మీ తెలుగు స్పీచ్ నేను ఫాలో కాలేదు. కానీ ఈ మాటలు మాత్రం ఫాలో అయ్యాను అని చెప్పడంతో అందరిలో నవ్వులు విరిశాయి. సాయి పల్లవి విషయంలో మీరు చెప్పిందే కరెక్ట్ అని అమీర్ అన్నాడు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Prenuptial Agreement: ముగ్గురు పిల్లలతో హాయిగా జీవితం.. హీరోయిన్ కాపురం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి ?
Recommended image2
Diwakar Arrest: 'వాటర్‌మెలన్ స్టార్' దివాకర్ అరెస్ట్.. యూట్యూబ్ ఛానల్ కెమెరాలు పగిలిపోయాయి, ఏం జరిగిందంటే
Recommended image3
Kalki 2: 'ఓ ధనంజయా, నువ్వు నేను ఇద్దరం కర్ణుడిని ఓడించలేం'.. మంటలు మరింత పెంచిన నాగ్ అశ్విన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved