#Saipallavi:ఆ వీడియో షేర్ చేస్తూ సాయి పల్లవి పై భారీ ట్రోల్స్
నటి సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. ఆమె నటించిన 'అమరన్' సినిమా విడుదల సందర్భంగా, సైనికులను ఉగ్రవాదులతో పోల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Sivakarthikeyan,sai pallavi, Amaran,kamal hassan
ఎలాంటి గ్లామర్ ప్రదర్శన, ఎక్స్‌పోజింగ్ లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది సాయి పల్లవి. ఆమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు సక్సెస్ అవటంతో కెరీర్ లో ఎదురేలేకుండా పోయింది. వరస పెట్టి తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన సాయి పల్లవి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. అయితే అది కూడా ఓ పాత వీడియో రిఫరెన్స్ తో కావటం చెప్పుకోదగ్గ విషయం.
Sivakarthikeyan,sai pallavi, Amaran,kamal hassan
సాధారణంగా సాయి పల్లవి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవటానికి ఇష్టపడదు. అయితే ఊహించని విధంగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో కొందరు సాయి పల్లవి పాత వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయి పల్లవి నటించిన ‘అమరన్’ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపధ్యంలో ఈ వీడియోని బయిటకు తవ్వి తీసారు.
అమరన్ సినిమాలో అమర సైనికుడు మేజర్ ముకుందన్ భార్య రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. మేజర్ ముకుందన్ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందాడు. మేజర్ ముకుందన్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు.
ఇప్పుడు సాయిపల్లవి సినిమా విడుదలవుతున్నప్పుడు కొందరు సాయిపల్లవి పాత వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.
సాయి పల్లవి ‘విరాట పర్వం’ అనే సినిమా చేసినప్పుడు ఆ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వూలు ఇచ్చింది. ఆ సినిమాలో సాయి పల్లవి ఒక నక్సల్‌తో ప్రేమలో పడి తానే నక్సల్‌గా మారడం చూపించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో సాయి పల్లవిని నక్సల్స్ హింస గురించి అడగటంతో ఆమె సమాధానం ఇచ్చారు. సాయి పల్లవి మాట్లాడుతూ..హింస అంటే అర్థం కావడం లేదు.
పాకిస్థానీలకు, మనం.. అలాగే మన సైనికులను ఉగ్రవాదులని భావిస్తారు. వాళ్లను చూస్తే మనం ఉగ్రవాదులు అనుకుంటాం. అది మనం చూసే కోణాన్ని బట్టి మారుతుంది’అనే ఈ వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొంతమంది సాయి పల్లవి భారత సైనికులను టెర్రరిస్టులని అర్ధం వచ్చేలా మాట్లాడిందని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూయర్ మీరు లెఫ్ట్‌వింగ్ లేదా రైట్‌వింగ్ అని అడిగిన ప్రశ్నకు. సాయి పల్లవి బదులిస్తూ, నేను ఏ వర్గానికి చెందిన దాన్ని కాదు. కానీ హింసకు కారణం అయ్యే మతానికి నేను వ్యతిరేకం. హిందువులపై ముస్లింలు ఎలా అఘాయిత్యాలకు పాల్పడ్డారో ‘కశ్మీర్ ఫైల్స్’ చూపించాయి.
అదేవిధంగా ఇటీవల ఆవును తరలిస్తున్న ఓ ముస్లిం లారీ డ్రైవర్‌ను ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ కొట్టి చంపారు. నాకు, ఈ రెండు సంఘటనలు ఒకటే అని చెప్పింది. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. చివరగా దీనిపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.. ఏ వ్యక్తిని, సంఘటనను, పరిస్థితిని మతం కోణంలో విభజించి చూడడానికి నేను వ్యతిరేకం అని తెలిపింది. ఈ కామెంట్స్ ను ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు.
Mani Ratnam Indian film director praises actor Sai Pallavi
ఇక భారత ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్తకం అధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆయన జీవితంపై చాలాకాలం రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు.
రాష్ట్రీయ రైఫిల్స్ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.
Sai Pallavi
ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అశోక చక్ర లభించింది. ఇప్పుడు అలాంటి స్ఫూర్తిదాయమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నారు. సాయి పల్లవితో పాటుగా భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 సమ్మర్ లో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.