MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి, తమిళ స్టార్ హీరో జతగా మలయాళ బ్యూటీ..?

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి, తమిళ స్టార్ హీరో జతగా మలయాళ బ్యూటీ..?

ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేయదు సాయి పల్లవి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఇక ప్రస్తుతం సాయి పల్లవికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 21 2023, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది సాయి పల్లవి. ఇక సినిమాలు మానేస్తుంది అనుకున్నారంతా. రకరకాల గాసిప్స్ కూడా వచ్చాయి. సినిమాలు వదిలేసి డాక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఈక్రమంలో అవన్నీ గాసిప్స్ అని తేలిపోయాయి.  సాయి పల్లవి మంచి సినిమా కోసం ఎదురు చూస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వచ్చిన ప్రతీ సినిమా చేసేయడం సాయి పల్లవికి ఇష్టం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుది. హీరోయిన్ క్యారక్టర్ కు పర్ఫామెన్స్ స్కోప్ ఉంటేనే సినిమాచేస్తుంది సాయిపల్లవి. అంతే కాని హీరో డామినేటెడ్ మూవీను ను అస్సలు ఒప్పుకోదు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి ఓ లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.  

37

సాయి పల్లవి మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా తన సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉండేట్టు చూసుకుంటాడు. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. ఏదో బొమ్మలా అందాలు ఆరయబోయడమే కాకుండా.. నటించడానికి స్కోప్ ఉంటుంది. ఈక్రమంలో అజిత్ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 

47

రీసెంట్ గా అజిత్ నటించిన తునివు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అయిన  ఈ సినిమా  టాలీవుడ్ లో కూడా  బ్రేక్ ఈవెన్ అయింది. అయితే అజిత్ తర్వాత మూవీలో  జోడీగా సాయిపల్లవి కనిపిస్తారని సమాచారం అందుతోంది.  లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ హీరోగాఒక సినిమా తెరకెక్కనుండగా అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

57

ఇప్పటికే ఈ సినిమా కోసం కొంత మంద హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఎవరూ ఈసినిమాకు సెట్ కాకపోవడంతో.. సాయి పల్లవి అయితే ఈ మూవీకి బాగుంటుంది అని అనుకున్నారట మేకర్స్. దాంతో  వేర్వేరు హీరోయిన్ల పేర్లు వినిపించగా.. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యారని సమాచారం అందుతోంది. 

67

అయితే ఇంత వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. అజిత్ సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా అంటే అది క్రేజీ కాంబినేషన్ అవుతుందనే చెప్పాలి. అంతే కాదు  సాయిపల్లవి జాతకం కూడా మారిపోతుందంటున్నారు కొంత మంది అభిమానులు. అటు రోల్ బాగుంటే సాయిపల్లవి కూడా స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి దాదాపు ఓకే చెబుతుందంటున్నారు. అజిత్ సినిమాలో హీరోయిన్లకు కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే సాయి పల్లవి రిజెక్ట్ చేసే అవకాశం లేదనే చెప్పాలి. 
 

77

ఇక సక్సెస్ లతో సంబంధం లేకుండా సాయిపల్లవి సినిమా ఆఫర్లను అందుకుంటూ వారల్లో నిలుస్తున్నారు. ఒక్కో సినిమాకు కోటిన్నర  నుంచి 2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట సాయి పల్లవి. అయితే సాయిపల్లవి తెలుగు సినిమాలు చేస్తే చూడాలని ఇక్కడి అభిమానులు కోరకుంటున్నారు.  చూడాలి మరి అజిత్ మూవీ సాయిపల్లవి కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Udugula: ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగులకు మహాకవి జాషువా పురస్కారం..ఆయన సినిమాలు ఇవే
Recommended image2
Varshini: హౌస్ నుంచి వర్షిణి అవుట్.. బిగ్ బాస్ స్టేజీపై వృషకర్మ ఫుల్ జోష్, చైతూకు రామ్ ప్రసాద్ సర్ప్రైజ్
Recommended image3
AOT: చిరంజీవి, రామ్ చరణ్ లతో 'ఆకాశంలో ఒక తార' టీమ్.. దుల్కర్ కి మెగాస్టార్ ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved