గ్యాప్ రాలేదు.. తీసుకున్నాను అంతే.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సాయి పల్లవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..? అవును ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఇంప్రెస్ అవుతారు ఆమె గురించి తెలిస్తే. ఎందుకో ఈమధ్య చాలా గ్యాప్ వచ్చింది సాయి సినిమాలకు. మరి ఆ విషయంలో ఆమె ఏమంటుందంటే..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Sai Pallavi
సాయి పల్లవి రూటే సెపరేట్.. ఆమెకు వచ్చిన ఆఫర్లు.. కమర్షియల్ గా ఆలోచించి తీసుకుని ఉంటే.. ఇప్పటికి ఆమె రేంజ్ వేరే లెవల్లో ఉండేది. కాని అలా తీసుకోకపోయినా సరే.. సాయి పల్లవి ఇమేజ్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఎంత పెద్ద స్టార్అయినా.. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. అది కూడా హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది.
భానుమతి..సింగిల్‌పీస్..హైబ్రీడ్ పిల్ల అంటూ తెలుగు సినిమాలో డైలాగ్ తో అదరగొట్టిన ఈ బ్యూటీ.. యూత్ హృదయాల్ని గెలుచుకుంది .సాయిపల్లవి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించింది. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపికచేసుకుంటూ తనదైన అద్భుతాభినయం, అసాధారణ నృత్యప్రతిభతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది.
ఈ తమిళ సోయగం ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది బ్యూటీ. ఈసినిమాతో ఆమెకు సౌత్ ల మంచి పేరు వచ్చింది. అందులో మలర్‌గా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా విడుదలై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.అంటే సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి కూడా ఏనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.
Sai Pallavi
సాయి పల్లవి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామందికి ఆమె ఆదర్శం కూడా. డాక్టర్ చదువుకుంటూనే సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బ్యూటీ. ఈమధ్య సినిమాలు తగ్గించింది చిన్నది. సినిమాలకు గుడ్ బై చెపుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని ఆమె మాత్రం ఈవిషయంలో ఏమాత్రం స్పందించలేదు.
తన కెరీర్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రస్తుతం ప్రేమమ్ హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎనిమిదేళ్లు పూర్తి కావడం.. సాయి పల్లవి సినిమా కెరీర్ కు కూడా ఎనిమిదేండ్లు కంప్లీట్ అవ్వడంతో.. ఆమె కెరీర్‌లో పోషించిన పాత్రలు, సాధించిన విజయాల గురించి చర్చించుకుంటున్నారు.
అయితే ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటోనన సాయి పల్లవి.. టాలీవుడ్ లో అయితే అసలు సినిమాలే చేయడం మానేసింది. ఇతర భాషల్లో అయినా.. అడపా దడపా సినిమాలున్నాయి కాని.. తెలుగులో మాత్రం సాయి సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ విషయంలో ఆమెను ప్రశ్నించగా.. తెలుగులో తనకు గ్యాప్ రాలేదని, తానే తీసుకున్నానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వెల్లడించింది .
అయితే దానికి పెద్ద కారణాలేమి లేవంటోంది బ్యూటీ. తనకు నచ్చిన, నప్పిన కథ దొరకితే టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తానెప్పుడు రెడీ అంటోంది బ్యూటీ. ప్రస్తుతానికి మాత్రం .. ఆమె శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళనాట నేచురల్ స్టార్ గా పేరు ఉన్న శివకార్తికేయన్ తో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.