MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి కి బిగ్ షాక్, మరి ఇంత దారుణంగానా ? రామాయణ పై ప్రభావం పడుతుందా?

సాయి పల్లవి కి బిగ్ షాక్, మరి ఇంత దారుణంగానా ? రామాయణ పై ప్రభావం పడుతుందా?

సాయి పల్లవి కెరీర్ లో బిగ్ షాక్ తగిలింది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ తొలి అడుగుతోనే దారుణమైన డిజాస్టర్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా తేలిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ప్రభావం రామాయణ పై పడుతుందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లో సాయి పల్లవి క్రేజ్..
Image Credit : stockphoto

సౌత్ లో సాయి పల్లవి క్రేజ్..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ వేరు. స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ ఆమెకు ఉంది. సాయి పల్లవి నటిస్తుందంటే.. హీరోలతో సంబంధం లేకుండా.. అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా ఆఫర్ వచ్చిన.. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. కథ నచ్చకనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమానే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ లో సాయిపల్లవి క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఆమే.. కావాలని స్టార్ హీరోలు వెయిట్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.అటువంటి నేచురల్ హీరోయిన్ కు బాలీవుడ్ లో బిగ్ షాక్ తగిలింది.

24
బాలీవుడ్ లో సాయి పల్లవి ఫస్ట్ సినిమా..
Image Credit : instagram

బాలీవుడ్ లో సాయి పల్లవి ఫస్ట్ సినిమా..

స్టార్ హీరోలకు దీటైన క్రేజ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ.. తన మార్క్ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే, కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ సరసన ఆమె ‘ఏక్ దిన్’ అనే హిందీ మూవీలో నటించింది. ఈ చిత్రాన్ని ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించడం వల్ల సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి పల్లవి ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లో కూడా తన సత్తా చాటుతుందని అందరు అనుకున్నారు.

Related Articles

Related image1
Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?
Related image2
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
34
భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా
Image Credit : instagram

భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా

అంతే కాదు సాయి పల్లవి ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో.. అందరి దృష్టి ఏక్ దిన్ సినిమాపైనే ఉంది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పదన రాబట్టలేకపోయింది. . ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే కేవలం రూ.1.37 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. రెండో రోజు ఈ వసూళ్లు మరింతగా తగ్గి సుమారు కోటి రూపాయల వద్దకు చేరినట్లు సమాచారం. మూడో రోజు నుంచి కలెక్షన్లు ఇంకా క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేనట్టే తెలుస్తోంది. ఈ విషయంలో సాయి పల్లవిపై రకరకాల ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

44
రామాయణ పై ప్రభావం ఉంటుందా?
Image Credit : instagram

రామాయణ పై ప్రభావం ఉంటుందా?

సౌత్ లో సాయి పల్లవి పేరు చెప్పగానే థియేటర్లు నిండిపోతాయి. కానీ హిందీ మార్కెట్‌లో ఆమె అడుగు పెట్టగానే బిగ్ షాక్ తగిలింది. సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, ప్రమోషన్ లోపాలు వంటి కారణాలు ఈ రిజల్ట్ కి దారితీసి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏక్ దిన్ నిరాశ కలిగించడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇక ఈ ప్రభావం సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన ‘రామాయణ’పై పడుతుందేమో అన్న భయం అభిమానుల్లో ఉంది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి రామాయణ పైనే ఉంది. ఈసినిమా అయినా ఆమెకు హిందీ మార్కెట్‌లో విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోని చెప్పుతో కొడతానన్న దీప-శ్రీధర్ అనుమానం-కార్తీక్ కొత్త ప్లాన్
Recommended image2
Thalapathy Vijay: గెలుపు తర్వాత విజయ్ ఫస్ట్ రియాక్షన్! మోదీ, రాహుల్ కు దళపతి కౌంటర్ ?
Recommended image3
10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?
Related Stories
Recommended image1
Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?
Recommended image2
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved