MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మొన్న అమీర్ ఖాన్, ప్రకాశ్ రాజ్ నిన్న అక్షయ్ భార్య, నేడు సాయి పల్లవి.. తారలపై దారుణంగా ట్రోలింగ్..

మొన్న అమీర్ ఖాన్, ప్రకాశ్ రాజ్ నిన్న అక్షయ్ భార్య, నేడు సాయి పల్లవి.. తారలపై దారుణంగా ట్రోలింగ్..

కాశ్మీర్ ఫైల్స్ విషయంలో మరోసారి వివాదం రాజుకుంది. ఇంతకు ముందు ఈ సినిమాపై కామెంట్లు చేసి విమర్షలపాలు అయ్యారు బడా స్టార్లు.. ఇక ఇప్పుడు వివాదాల జోలికి వెళ్ళని హీరోయిన్ సాయి పల్లవి.. కశ్మీరీ ఫైల్స్ విషయంలో చేసిన కామెంట్స్.. దుమారాన్ని రేపుతున్నాయి.   

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 16 2022, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎటువంటి వివాదాల జోలికి వెళ్లలేదు హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నటించిన  విరాట పర్వం మరికొన్ని గంటల్లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వ్యక్తం చేసిన అభిప్రాయం భారీ ధుమారాన్ని రేపింది.  సాయిపల్లవి మాటలను విభేదించడంతో  పాటు ఆమెపై భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఇంతకీ ఆమె ఇంటర్వ్యూలో ఏమన్నదంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో If You Taking A Religious Conflict లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అంటూ క్యాజువల్ గా కామెంట్ చేసింది. 

38

అంత కాదు ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు.

48
virata parvam-sai pallavi

virata parvam-sai pallavi

ఎవరో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి, ఒక మొత్తం కమ్యూనిటీపై జరిగిన నర మేధానికి చాలా తేడా ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మా బాధను చిన్నచూపు చూడొద్దంటూ ట్వీట్ చేశాడు. ఒకసారి వచ్చి పగిలిన మా గుండెలను, ధ్వంసమైన మా ఇళ్లను సాయిపల్లవి చూడాలని, ఆ నర మేధానికి మిగిలిన సజీవ సాక్ష్యాలం తామేనని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. 

58

అయితే ఈ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి విమర్శల పాలైన వాళ్లు ఇప్పటికే కొందరు ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్  ప్రమోషనల్ ఈవెంట్‌లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా కాశ్మీర్ ఫైల్స్ అని వ్యాఖ్యానించాడు. అయితే.. కశ్మీరీ పండిట్లపై ఇదే అమీర్ ఖాన్ గతంలో ఇందుకు పూర్తి భిన్నమైన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ వీడియోను వైరల్ చేసి సోషల్ మీడియాలో అమీర్ ఖాన్‌ను కొందరు నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. 

68

ది కశ్మీర్ ఫైల్స్ మూవీ కశ్మీర్ పండిత్ల గాయాలను నయం చేస్తుందా.. ? లేకపోతే మరింత రెచ్చగొడుతుందా.. ? లేదంటే ద్వేషమనే విత్తనాలను నాటుతుందా ? అని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాష్  ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై తన అక్కసును వెళ్లగక్కాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.
 

78

ఇక మరో బాలీవుడ్ స్టార్.. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కామెడీగా మాట్లాడి ట్రోలింగ్ కు గురయ్యింది. తాను ఒక సినిమా తీయాలనుకుంటున్నానని, ఆ సినిమా పేరు నెయిల్ ఫైల్స్ అంటూ  ఆమె వెటకారం చేసింది. ఈ జోక్ కారణంగా ట్వింకిల్ తీవ్ర విమర్శల పాలైంది. ట్విక్కిల్ ను కూడా దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.

88

ఇక సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన షా కూడా  కాశ్మీర్ ఫైల్స్  సినిమాపై కామెంట్ చేసి ట్రోలర్స్‌కు టార్గెట్ అయ్యాడు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా అంతా దాదాపు కల్పితమేనని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పాటు చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న అమానుష పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తే అంతా కల్పితమని ఎలా అంటారని నసీరుద్దీన్ షా పై సోషల్ మీడియాలో మండిపడ్డారు నెటిజన్లు.  ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కాశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో కామెంట్లు చేసి విమర్షలపాలు అవుతునే ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved