MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • సాయిపల్లవితో సినిమా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

సాయిపల్లవితో సినిమా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

సాయిపల్లవి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అయితే ఆమెతో సినిమా చేయాలంటే మేకర్స్ ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి ఆ కథేంటో చూద్దాం.    

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 15 2024, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sai Pallavi

Sai Pallavi

సాయి పల్లవి సహజమైన యాక్టింగ్‌తో మెప్పిస్తుంది. అద్భుతమైన డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఎలాంటి పాత్ర అయిన అవలీలగా చేయగలదు. అందుకే ఆమె తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు వ్యక్తిగతంగానూ ఆమె చాలా గొప్ప మనస్తత్వం కలిగి ఉంది. దీంతో ఫ్యాన్స్ ఆమెని ఎంతగానో ఆరాధిస్తారు. ఆమెని ఫాలో అవుతుంటారు. హీరోయిన్లలో ఆమెకి మించిన క్రేజ్‌ మరెవ్వరికీ లేదని చెప్పొచ్చు. స్టేజ్‌పైకి సాయిపల్లవి వచ్చిందంటే ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిస్తుంటారు. ఇది చూసే దర్శకుడు సుకుమార్‌ లేడీ పవర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఇచ్చేశాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
actress sai pallavi

actress sai pallavi

సాయిపల్లవి ప్రారంభం నుంచి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేసింది. అందుకే ఆమె ఇప్పటి వరకు తెలుగులో ఐదారు మూవీస్‌ మాత్రమే చేయడం విశేషం. `ఫిదా`, `ఎంసీఏ`, `లవ్‌ స్టోరీ`, `విరాటపర్వం`, `పడి పడి లేచే మనసు`, `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె `తండేల్‌` మూవీలో నటిస్తుంది. అయితే సాయిపల్లవితో సినిమాలు చేయాలంటే మేకర్స్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట. మరి సాయిపల్లవి పెట్టే రూల్‌ ఏంటి? ఆమెతో సినిమాలు చేయాలంటే ఏం ఫాలో అవ్వాలనేది చూస్తే..
 

35
sai pallavi

sai pallavi

ఆ కండీషన్స్ అంటే ఆమె మనీ డిమాండ్‌ కాదు, లగ్జరీ డిమాండ్ కాదు. కంటెంట్‌ పరమైన డిమాండ్ కావడం విశేషం. తనతో సినిమా అంటే దర్శకులు కొన్ని ఫాలో కావాల్సిందే అంట. అది దర్శక, నిర్మాతలు చేస్తేనే సాయిపల్లవి సినిమా చేస్తుందని అంటున్నారు. ఆమె మొదట తన పాత్రకి ప్రయారిటీ ఇస్తుంది. సినిమాలో తన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించేలా ఉండాలి. అలా అయితేనే ఆమె సినిమా చేస్తుంది.

దీనికితోడు కంటెంట్‌ బాగుండాలి. తన పాత్ర మాత్రమే కాదు, సినిమా కథకి కూడా ఆమె ప్రయారిటీ ఇస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలే ఒప్పుకుంటుంది. అంతేకాదు సినిమా ప్రారంభానికి ముందే బౌండెడ్‌ స్క్రిప్ట్ ఉండాలి. అప్పుడే సాయిపల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందట. ఇవన్నీ ఆమె ప్రారంభం నుంచి ఫాలో అవుతుంది. 

45
Sai Pallavi

Sai Pallavi

ఇవన్నీ ఓ ఎత్తైతే లేటెస్ట్ గా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాయి పల్లవితో సినిమా అంటే ముందుగానే వర్క్ షాప్‌ కూడా చేయాల్సి ఉంటుందట. వర్క్ షాప్‌లో సీన్లు ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, గెటప్స్, లుక్స్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్ గా ముందుగానే చూసుకోవాలట. అందులో తాను కూడా పాల్గొంటుందట. వర్క్ షాప్‌లో తీయబోయే సీన్లకి సంబంధించి అన్ని రిహార్సల్స్ జరుగుతాయి.

ఇందులో డౌట్స్ కూడా క్లారిటీ వస్తుంది. ఇదంతా సినిమా బాగా రావడం కోసమే. సాయిపల్లవి సినిమా కోసమే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందట. దీనికి ఒప్పుకుంటేనే ఆ సినిమా చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. 
 

55

మొత్తంగా సాయిపల్లవి పెట్టే కండీషన్‌ కూడా ఓ రకంగా అటు హీరోకి, ఇటు నిర్మాతలకు మంచి చేస్తుందని చెప్పొచ్చు. అది బెస్ట్ ఔట్‌ పుట్‌ రావడానికి హెల్ప్ అవుతుంది. అయితే అందరు దీనికి ఒప్పుకోకపోవచ్చు, అలాంటి వారికి నిర్మొహమాటంగా ఈ లేడీ పవర్ స్టార్‌ నో చెబుతుందని టాక్‌.

ఇక ప్రస్తుతం సాయిపల్లవి.. నాగచైతన్యతో `తండేల్‌` సినిమాలో నటిస్తుంది. `లవ్‌ స్టోరీ` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. 

read more: అమల అంటే పెద్ద బోర్‌, ఆ హీరోయిన్‌ని చూసినప్పుడు నా కళ్లు జిగేల్‌మన్నాయి.. నాగార్జున ఫిదా అయిన నటి ఎవరు?

Also read: రాజమౌళికి సినిమాల్లో నచ్చని ఎలిమెంట్‌ అదే, కానీ ప్రభాస్‌ చెడగొట్టాడు.. జక్కన్న తప్పక చేస్తున్న పనేంటో తెలుసా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara : దీనికి 100 కోట్లు అవసరమా? నయనతార సినిమా కొత్త సినిమా టీజర్ పై దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?
Recommended image3
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved