MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాజమౌళికి సినిమాల్లో నచ్చని ఎలిమెంట్‌ అదే, కానీ ప్రభాస్‌ చెడగొట్టాడు.. జక్కన్న తప్పక చేస్తున్న పనేంటో తెలుసా?

రాజమౌళికి సినిమాల్లో నచ్చని ఎలిమెంట్‌ అదే, కానీ ప్రభాస్‌ చెడగొట్టాడు.. జక్కన్న తప్పక చేస్తున్న పనేంటో తెలుసా?

రాజమౌళికి సినిమాల్లో ఓ ఎలిమెంట్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదట. ఎంతో పద్ధతిగా వెళ్తున్న తనని ప్రభాస్‌ చెడగొట్టాడట. ఈ విషయాన్ని జక్కన్నే వెల్లడించడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 15 2024, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rajamouli

rajamouli

దర్శకధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ఇండియన్‌ ఆడియెన్స్ మాత్రమే కాదు, ప్రపంచ ప్రేక్షకులు కూడా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. `బాహుబలి`తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది మరి. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మరింతగా వరల్డ్ ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యారు రాజమౌళి. అందుకే ఆయన సినిమాలంటే ఇతర దేశాల ఆడియెన్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇదిలా ఉంటే సినిమాల్లో రాజమౌళికి నచ్చని ఒక ఎలిమెంట్‌ ఉంది. దాని జోలికి కూడా వెళ్లేందుకు ప్రయత్నించరు. కానీ ఇప్పుడు అది లేకుండా సినిమా చేయడం లేదు. దానికి కారణం డార్లింగ్‌ ప్రభాస్‌ కావడం విశేషం. ప్రభాస్‌ వల్లే జక్కన్న తనకి నచ్చని ఎలిమెంట్‌ని కూడా బలవంతంగా పెట్టాల్సి వస్తుందట. ఇప్పుడు దాన్నే ఫాలో అవ్వాల్సి వస్తుందట. అలా తనని చడగొట్టావ్‌ కదా అని ఓపెన్‌గానే చెప్పాడు రాజమౌళి. మరి ప్రభాస్‌ ఏ విషయంలో రాజమౌళిని చెగొట్టాడనేది చూస్తే, 
 

35

జక్కన్నకి యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. అలాంటి సినిమాలు చేసేందుకే ప్రయారిటీ ఇస్తారు. ఆయనకు అదే ఇష్టం. అదే సమయంలో లవ్‌ స్టోరీ అంటే నచ్చదట. ప్రేమ సన్నివేశాలు తీయడానికి కూడా ఆసక్తి చూపించరట. కానీ ప్రభాస్‌ వల్లే అవి పెట్టాల్సి వచ్చిందట. రాజమౌళి మొదట `స్టూడెంట్‌ నెం 1` సినిమా తీశాడు. ఇందులో హీరో ఎన్టీఆర్‌ సిన్సియర్‌ స్టూడెంట్‌. ప్రేమ దోమకి దూరం. ఆ తర్వాత సింహాద్రి సినిమా చేశాడు.

అది కూడా యాక్షన్‌ మూవీ. కానీ ప్రేమకి పెద్దగా ప్రయారిటీ ఉండదు. కానీ `ఛత్రపతి`లో మాత్రం లవ్‌ ఎపిసోడ్‌ బాగానే ఉంటుంది. అలా పెట్టాలనేది ప్రభాస్‌ ఒత్తిడే అని ఆయన తెలిపారు. `ఛత్రపతి`లో శ్రియాతో కాసేపు లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. ప్రభాస్‌ కారణంగానే ఇందులో ఆ లవ్‌ ట్రాక్‌కి ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చిందట. 

45

ఆ తర్వాత `విక్రమార్కుడు`లోనూ బాగానే లవ్‌ ట్రాక్‌ ఉంది. అది ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ లవ్‌ ట్రాకే సినిమాకి హైలైట్‌. మరోవైపు `మగధీర`లోనూ ఫస్టాఫ్‌ అంతా లవ్‌ ట్రాకే ఉంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లోనూ లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. `ఈగ` సినిమా మొత్తం లవ్‌ ట్రాక్‌ మీదనే నడుస్తుంది.

ఇలా వరుసగా లవ్‌ స్టోరీలకు ప్రయారిటీ ఇస్తూ, తాను తీసేది యాక్షన్‌ మూవీ అయినా అందులో ఈ ఎలిమెంట్‌ ఉండేలా చూసుకుంటున్నారు రాజమౌళి. `బాహుబలి`లోనూ ప్రభాస్‌, అనుష్క ల మధ్య లవ్‌ ట్రాక్‌ని పెట్టాడు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌`లోనూ ఎన్టీఆర్‌, బ్రిటీష్‌ నటి మధ్య లవ్‌ ఎపిసోడ్‌ పెట్టిన విషయం తెలిసిందే. 

55

ఇలా ప్రతి సినిమాలోనూ దాన్ని ఫాలో అవుతున్నాడు. అయితే ప్రభాస్‌, రాజమౌళి ల మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాజమౌళి ఉండి, నువ్వే చెడగొట్టావ్‌గా అని ప్రభాస్‌ని అనడం విశేషం. మొత్తంగా ప్రభాస్‌ కారణంగా తనకు ఇష్టం లేని ఎలిమెంట్‌ని కూడా పెడుతూ హిట్లు కొడుతున్నారు రాజమౌళి.

ఆయన సినిమాల్లో లవ్‌ ట్రాక్‌లో ఉంటాయి, అలాగని మరీ అదే మెయిన్‌ కంటెంట్‌గా ఉండదు. ఓ బలమైన పాయింట్‌ బేస్డ్ గా సినిమాలు సాగుతుంటాయి. అందులో లవ్‌ స్టోరీ ఓ పార్ట్ గా ఉంటుంది. అయితే యూత్‌ని ఆకట్టుకునే అంశాల్లో లవ్‌ ట్రాక్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబుతో యాక్షన్‌ అడ్వెంచర్‌ తీస్తున్నారు. ఇందులో లవ్‌ ట్రాక్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం.

ఇక ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగబోతుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని ప్రారంభించబోతున్నట్టు ఇటీవల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తెలిపిన విషయం తెలిసిందే. కేఎల్‌ నారాయణ ఈ మూవీని సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved