- Home
- Entertainment
- రొమాన్స్ డోస్ ఎక్కువైందా.. విరూపాక్ష చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ ఎందుకు, నవ్వులు పూయిస్తున్న తేజు ఆన్సర్
రొమాన్స్ డోస్ ఎక్కువైందా.. విరూపాక్ష చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ ఎందుకు, నవ్వులు పూయిస్తున్న తేజు ఆన్సర్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన తొలి చిత్రం ఇది.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన తొలి చిత్రం ఇది. 90 దశకంలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ఇది.
కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. విరూపాక్ష చిత్రానికి ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు.
ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సాయిధరమ్ తేజ్ నవ్వులు పూయిస్తూ సమాధానం ఇచ్చారు. విరూపాక్ష చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు.. మీకు సంయుక్త మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయా లేక భయానక సన్నివేశాలు ఉండడం వల్లనా అని ప్రశ్నించారు.
దీనితో సాయిధరమ్ తేజ్ మీడియా ప్రతినిధితో జోకులు వేస్తూ.. ఇది మీరనుకుంటున్నట్లు ఆ తరహా చిత్రం కాదు.. మిమ్మల్ని తప్పకుండా ఎగ్జైట్ చేస్తుంది.. కానీ మీరనుకున్న విధంగా ఎగ్జైట్ చేయదు అని ఫన్నీగా బదులిచ్చారు. తేజు సమాధానంతో పక్కనే ఉన్న సంయుక్త మీనన్ పడిపడి నవ్వుతూ కనిపించింది.
వెంటనే దర్శకుడు కార్తీక్ దండు స్పందిస్తూ.. ఈ చిత్రంలో వణుకు పుట్టించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అలాగే టెన్షన్ పెట్టే సీన్స్ కూడా ఉన్నాయి. అందువల్లే ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ మొత్తం కలసి చూడాల్సిన చిత్రం అని తెలిపారు.
విరూపాక్ష చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అయితే తేజు రీ ఎంట్రీలో హిట్ కొట్టినట్లే అని చెప్పాలి. సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో తొలిసారి థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇక గోల్డెన్ లెగ్ బ్యూటీగా గుర్తింపు పొందిన సంయుక్త టాలీవుడ్ లో మరో హిట్ కొడుతుందేమో చూడాలి.