- Home
- Entertainment
- నయా లుక్ లో సదా స్టన్నింగ్ స్టిల్స్.. లాంగ్ షర్ట్ లో సుకుమారి అందాల విందు అదుర్స్.. పిక్స్ వైరల్
నయా లుక్ లో సదా స్టన్నింగ్ స్టిల్స్.. లాంగ్ షర్ట్ లో సుకుమారి అందాల విందు అదుర్స్.. పిక్స్ వైరల్
హీరోయిన్ సదా (Sadaa) నయా లుక్ తో అభిమానులు, నెటిజన్లను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. వరుస ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తోంది.

తెలుగు సినిమా `జయం`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సదా (Sada) నటన, గ్లామర్ పరంగా వందశాతం మార్కులు దక్కిచుకుంది. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో వరుస సినిమా ఆఫర్లను అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇటు సోషల్ మీడియాలోనూ సదా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ షోతో నెటిజన్లను చూపుతిప్పుకోలేకుండా చేస్తోంది.
తాజాగా సదా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. ఈ పిక్స్ లో సదా నయా లుక్ లో దర్శనమిచ్చింది. బ్లూ లాంగ్ షర్ట్, మ్యాచింగ్ ఈయర్ రింగ్స్, హెడ్ రిబ్బన్ కట్టుకొని అట్రాక్టివ్ లుక్ తో అదుర్స్ అనిపిస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది. సదా పిక్స్ ను చూసిన నెటిజన్లు లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.
తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. విభిన్న పాత్రలు పోషించి ఆడియెన్స్ ను అలరించిన సదా.. 2018 తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ‘హాలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
జీ5 ఓటీటీ ప్లాట్ ఫాంలో ఈ వెబ్ సిరీస్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సదా కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే సదా మళ్లీ ఇండస్ట్రీల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తన స్టార్ డమ్ ను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం టీవీ షోస్, ఆయా ప్రొగ్రామ్స్, వెబ్ సిరీస్ లలోనూ నటించేందుకు ఓకే చెబుతోంది.
చివరిగా తమిళ చిత్రం ‘టార్చ్ లైట్’లో అలరించింది. ఈ మూవీలో వేష్య పాత్రను పోషించిన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. తర్వాత నుంచి ఈ బ్యూటీ సినిమాలేవీ రావడం లేదు. మున్ముందు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఆఖరిగా ‘యమలీలా 2’లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది.