MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్ అంత మేధావా ?.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. 

రాంచరణ్ ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్ అంత మేధావా ?.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. 

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ రెండురోజుల క్రితం రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 15 2023, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ రెండురోజుల క్రితం రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యాడు. తనకి హీరోయిన్లతో చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అంటూ గతంలో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లావణ్య త్రిపాఠి, రకుల్, కాజల్ ఇలా చాలా మంది హీరోయిన్లని టార్గెట్ చేస్తూ సునిశిత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అతడికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. అయితే రోజు రోజుకి సునిశిత్ హద్దులు దాటేలా కామెంట్స్ చేయడం.. ఏకంగా లావణ్య త్రిపాఠితో తన వివాహం రహస్యంగా జరిగింది అని చెప్పడంతో ఆమె విసిగిపోయింది. 

37

పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనితో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా అతడి మానసిక స్థితి సరిగా లేదని వదిలేశారు. ఇటీవల సునిశిత్ మరోసారి సెలెబ్రిటీలపై కాంట్రవర్సీ వ్యాఖ్యలకు తెరతీశాడు. రాంచరణ్ సతీమణి ఉపాసన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హంగామా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

47

ఓ ఇంటర్వ్యూలో.. తాను ఉపాసన గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్లాం అని.. మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ పేర్కొన్నాడు. ఉపాసనకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా వెళ్లాం. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ వింటే కొడతారు అని కూడా ఇంటర్వ్యూలో యాంకర్ వార్నింగ్ ఇచ్చింది. లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా తనతో ఉపాసనని పడేయ్ అని చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 

57

దీనితో రంగంలోకి దిగిన రాంచరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని చావగొట్టారు. చరణ్ ఫ్యాన్స్ దేహశుద్ది చేయడంతో తప్పైపోయింది క్షమించాలి.. ఇకపై ఉపాసన గారి గురించి కానీ వేరే సెలెబ్రిటీల గురించి కానీ తప్పుగా మాట్లాడను. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత అతి చేస్తున్న సునిశిత్ ఎవరై ఉంటాడు? గాలికి తిరిగే ఆకతాయి అనుకుంటే పొరపాటే.. అతగాడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. 

67

సునిశిత్ మంచి ఉన్నత చదువులు చదివి అనేక డిగ్రీలు అందుకున్న విద్యావేత్త. అంతే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధావి. సునిశిత్ పుట్టి పెరిగింది వరంగల్ లో. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసాడు. వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలెక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ పూర్తి చేశాడు. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ లలో మూడు పేపర్లు ప్రజెంట్ చేశాడు. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన మేధస్సు అతడిది. 

77

అలాంటి పుస్తకాల పురుగు సునిశిత్ ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యాడో అర్థం కావడం లేదు అని సన్నిహితులు అంటున్నారు. బహుశా అతడి మానసిక స్థితి సరిగా లేదని కొందరు చెబుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Recommended image2
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Recommended image3
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved