'సాహో' భారీ బిజినెస్.. మరి ఆ రేంజ్ లో రాబడుతుందా..?

First Published 29, Aug 2019, 12:50 PM IST

బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మరో భారీ బడ్జెట్ సినిమాతో అలరించబోతుండడంతో సహజంగానే హైప్ తారా స్థాయిలో ఉంది.

సాహో- బాహుబలి తరువాత చాలా గ్యాప్ అనంతరం మనముందుకొస్తున్న ప్రభాస్ సినిమా. బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మరో భారీ బడ్జెట్ సినిమాతో అలరించబోతుండడంతో సహజంగానే హైప్ తారా స్థాయిలో ఉంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండడం, రోమాంచిత యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమా తెరకెక్కడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఎంతలా అంటే ఏ సోషల్ మీడియాలో చూసినా  ట్రెండ్ అవుతున్న టాపిక్ సాహో.

ఇంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా రేపు మనముందుకు రానుంది. 300 కోట్లతో సినిమాను  తెరకెక్కియడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. ఇంత  హెవీ యాక్షన్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తాన్నే వెచ్చించి కొన్నారు. ప్రాంతాల వారిగా గనుక చూసుకుంటే నైజాంలో 40 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో ప్రభాస్ కి సహజంగానే క్రేజ్ ఉండడంతో పాటు హైదరాబాద్ నగరం, కర్ణాటకలోని రాయచూరు, కొప్పల్, గంగావతి ప్రాంతాలు కూడా ఉండడంతో ఇక్కడ బిజినెస్ కి వచ్చిన ఢోకా ఏమిలేదు. కరీంనగర్, నిజామాబాద్ వంటి బి,సి సెంటర్లలో సైతం ప్రభాస్ ఫాలోయింగ్ వల్ల కొద్దిగా హిట్ టాక్ వచ్చినా సినిమాకు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం పెద్ద కష్టం కాదు.

సీడెడ్ గనుక చూసుకుంటే,  23-25 కోట్లు వెచ్చించి ఇక్కడ రైట్స్ కొన్నారు. సీడెడ్ లో సినిమాలు ఆడాలంటే ఉండాల్సినవి అచ్చంగా మాస్ ఎలిమెంట్స్. ఫైట్స్ నుంచి మొదలుకొని ఐటెం సాంగ్స్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే ఆస్కారం ఉంటుంది. ఈ సినిమా చుస్తేనేమో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ అవి చాలా క్లాసీగా ఉన్నాయి తప్ప మాస్ అప్పీల్ వాటిలో కనపడడం లేదు. ఈ ప్రాంత బి,సి, సెంటర్లలో మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు, హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ఆడుతాయి. వినయ విధేయ రామ సినిమా తీసుకుంటే, అది డిజాస్టర్ అయినప్పటికీ ఇక్కడ చాలా సెంటర్లలో బ్రేక్ ఈవెన్ సాధించింది. సహజంగానే ప్రభాస్ కి ఈ ప్రాంతంలో క్రేజ్ తక్కువ. ఇలాంటి చోట ఇంత భారీ స్థాయి వసూళ్లను సినిమా రాబట్టాలంటే అది బ్లాక్ బస్టర్ టాక్ తెచుకోవడంతోపాటు లాంగ్ రన్ లో సినిమా ఆడాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

గోదావరి జిల్లాల విషయానికి వస్తే అక్కడ దాదాపుగా 19 కోట్ల బిజినెస్ జరిగింది. అక్కడ విపరీతంగా ఉన్న ప్రభాస్ క్రేజ్ వల్ల టిక్కెట్లను హాల్లలోనే 1000 రూపాయలకు అమ్ముతున్నారు. క్యాస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రభాస్ కి కలిసొచ్చే మరో అంశం. సహజంగానే సినిమా చూసే వారి శాతం అధికం. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన బిజినెస్ దృష్ట్యా ఇక్కడ సినిమా డీసెంట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది. ఉత్తరాంధ్రను గనుక చూస్తే 15 నుంచి 16 కోట్ల వ్యాపారం జరిగింది. వైజాగ్ సిటీ కూడా ఈ పరిధిలోకే రావడం, ప్రభాస్ కి ఫాలోయింగ్ కూడా అక్కడ బాగానే ఉండడంతో పెద్ద ప్రాబ్లమ్ ఏం ఉండకపోవచ్చు.

గుంటూరు, నెల్లూరు కలిసి దాదాపు 17 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఒక్క నెల్లూరు సిటీలోనే 5 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ నెల్లూరులో ఉన్న ఒక ప్రధాన మల్టీప్లెక్స్ రెంట్ అధికంగా ఉండడంతో ఇక్కడ సదరు డిస్ట్రిబ్యూటర్ కు ప్రతి రూపాయలోను మిగిలేది 40 పైసలు మాత్రమే. ఇలాంటి కండిషన్ లో బ్రేక్ ఈవెన్ ని చేరుకోవాలంటే సినిమా చాలా కాలం ఆడాలి. ఇలా లాంగ్ రన్ లో ఆడినప్పుడు మాత్రమే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. కృష్ణాలో కూడా ఇదే పరిస్థితి. లాంగ్ రన్ లో మాత్రమే ప్రాఫిట్స్ వస్తాయి. సినిమా హిట్ టాక్ వస్తేనే ఈ లాంగ్ రన్ సాధ్యమవుతుంది. ఒకవేళ ఎమన్నా తేడా టాక్ వచ్చినా, మిశ్రమ స్పందన వచ్చినా  సినిమా లాంగ్ రన్ కష్టమవుతుంది.

సినిమా కన్నడలో నిర్మించకపోయినప్పటికి కర్ణాటకలో 28 కోట్లకు హక్కులను కొన్నారు. ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టాలంటే కేవలం బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఆడితే సరిపోదు. కర్నాటకా అంతా సినిమా ఆడాలి. రూరల్ కర్ణాటకలో తమిళ, తెలుగు భాషల్లో సినిమాను ఎంతమంది చూస్తారో చూడాలి. అంతేకాకుండా, ఇరు తెలుగు రాష్ట్రాలకు దెగ్గరగా ఉండే ప్రాంతాలు సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా తెలుగు రాష్ట్రాల కిందికి వస్తాయి. ఉదాహరణకు బళ్లారి సీడెడ్ కిందకు వస్తే, రాయచూరు నైజాం డిస్ట్రిబ్యూషన్ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

తమిళనాట 20 కోట్ల బిజినెస్ జరిగింది. తమిళ భాషలోనూ ఈ సినిమాను నిర్మించి ఉండడంతో ఇక్కడ ఒకింత నయం. సినిమా బాగుందని టాక్ వస్తే పుంజుకుంటుంది. దానికి తోడు కొద్ది రోజుల వరకు తమిళంలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో హిట్ టాక్ వస్తే సినిమా లాభాల బాట పట్టగలదు. కేరళను చూసుకుంటే అక్కడ 6 కోట్ల బిజినెస్ జరిగింది. నిన్నటి వరకు కూడా అక్కడ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు. చూడాలి కేరళలో సినిమా ఎలా ఆడుతుందో. ఉత్తరాది అంత కలుపుకొని 70 కోట్లమేర వ్యాపారం జరిగినట్టు చెబుతున్నారు. ఉత్తరాదిలో మనలాగా సినిమా ఎలా ఉన్నా మొదటి ఆటకే సినిమా చూడాలనే క్రేజ్ తక్కువ. ముంబయి లాంటి నగరాల్లో సినిమా టాక్ వస్తే ఆటోమేటిక్ గా ఆడుతుంది. అక్కడ మౌత్ పబ్లిసిటీ వల్ల ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. ఓవరాల్ గా మార్కెట్ పెద్దదవడం, దేగ్గర్లో ఏ ఖాన్ సినిమా కూడా లేకపోవడంతో, హిట్ టాక్ వస్తే సినిమా బాగానే ఆడే అవకాశం ఉంది.

ఇక ప్రొడ్యూసర్లు భారీ ఆశలు పెట్టుకునే ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వద్దాము. విదేశీ మార్కెట్లో ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుంది. విదేశీ మార్కెట్ల విషయంలో మాత్రం ఈ సదరు సంస్థ హిందీ వెర్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా తెలుగు సినిమాలు విదేశాల్లో ( తెలుగు ప్రజలు ఒకే దెగ్గర అధికంగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉండరు కాబట్టి) లాంగ్ రన్ ఆడవు. ఇందుకోసమని ప్రీమియర్ షోలపైన్నే ఎక్కువగా ఆధారపడతారు ప్రొడ్యూసర్లు. దాదాపుగా 60 శాతం డబ్బులను ఈ ప్రీమియర్ షోల రూపంలోనే వెనకేసుకుంటారు. ఇందుకు భిన్నముగా యాష్ రాజ్ ఫిలిమ్స్ తెలుగుకన్నా హిందీ భాషలో అధిక ప్రీమియర్ షోలను వేస్తుందని ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారు.

అమెరికా పరిస్థితిని గనుక పరిశీలిస్తే అక్కడ ముఖ్యమైన, తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా హిందీ వెర్షన్ షోలకు చెందిన టిక్కెట్లనే అమ్ముతున్నారని వారి ఆరోపిస్తున్నారు. సహజంగానే అమెరికాలో ఆఫీసులనుంచి నేరుగా థియేటర్లకు వెళుతుంటారు. ఇలాంటి ఈవెనింగ్  ప్రైమ్ టైములో తెలుగు వెర్షన్ కు కాకుండా హిందీ వెర్షన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనపడుతుంది.

హిందీ ప్రేక్షకులు ప్రభాస్ సినిమాకు టాక్ ఎలా ఉందో తెలుసుకోకుండా థియేటర్ కు వచ్చే ఛాన్స్ తక్కువ. ప్రభాస్ ని వారు కేవలం బాహుబలిలో మాత్రమే చూసారు. ప్రభాస్ ఏమీ  బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడు కాదు. కాబట్టి అంత లాయల్ ఫ్యాన్ బేస్ ని ఆశించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియర్ షోల రూపంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ తక్కువగా కనపడుతుంది. అజ్ఞ్యాతవాసి సినిమా ప్రీమియర్ షోల రూపంలో 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సాహో చాలా ఈజీగా ఈ మార్కును దాటుతుందని ఊహించారందరూ. ఇన్ని ఈక్వషన్ల నడుమ అది కష్టంగానే  కనపడుతుంది.

పైనపేర్కొన్న ఇన్ని విషయాలను పరిశీలించి చూసిన తరువాత ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే బ్రేక్ ఈవెన్ చేరుకోగలుగుతుంది. ఇంకొన్ని గంటల్లో గల్ఫ్ లో తొలి షో ప్రదర్శన ప్రారంభమవుతుంది. రాత్రి 11 కల్లా సినిమా టాక్ తెలిసిపోతుంది కూడా. కాబట్టి ఇంకొద్దిసేపు సస్పెన్స్ ని భరించాల్సిందే.

loader