శ్రీముఖికి పెళ్లి సంబంధం తీసుకు వచ్చిన అనంత్ శ్రీరామ్, జోడీ ఎలా ఉందో మీరే చూడండి
ప్రస్తుతం బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తోన్న స్టార్ యాంకర్స్ లో చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు. అందులో ప్రదీప్ తో పాటు శ్రీముఖీ కూడా ఉంది. ఇక ఈ స్టార్ యాంకర్ కోసం స్టార్ రైటర్ అనంత శ్రీరామ్ ఓపెళ్ళి సంబంధం తీసుకు వచ్చాడు. మరి అబ్బాయి ఎ వరంటే..

బుల్లి తెరపై తన యాంకరింగ్ మెరుపులతో.. తళతళమనే శ్రీముఖి ఇప్పటికీ బ్యాచ్ లర్ గానే ఉంది. అటు మరో స్టార్ యాంకర్ ప్రదీప్, సుధీర్ తో పాటు శ్రీముఖి మాత్రంమే బ్యాచిలర్ గా ఉంటూ.. యాంకర్ గా కొనసాగుతోంది. అయితే వీరి పెళ్లిళ్ల పై ఇప్పటి వరకూ ఎటువంటి క్లారటీ లేదు.
ఇక రీసెంట్ గా స్టార్ రైటర్ అనంత్ శ్రీరామ్ శ్రీముఖి కోసం ఓ పెళ్లి సంబంధం పట్టుకొచ్చాడు. ఓ టీవీ షోలో ప్రపోజల్ పెట్టాడు కూడా. అబ్బాయిని ఎదురుగా ఉంచి.. శ్రీముఖిని పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగాడు.
రీసెంట్ గా సరిగమప సూపర్ సంగర్స్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోపోలో ఓ కంటెస్టెంట్ రంగస్థం టైటిల్ సాంగ్ ను అద్భుతంగా పాడి వినిపించాడు. దాంతో మెస్మరైజ్ అయిన శ్రీరామ్.. ఓరెయ్ చిట్టిబాబు మన శ్రీముఖిని పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగేశాడు.
ఈ మాటతో ఖంగుతిన్న శ్రీముఖి... శ్రీరామ్ కు చేతులెత్తి నమస్కరిస్తూ.. వెనకున్న స్క్రీన్ మీద చేపల్లి చూపిస్తూ.. సార్ ఇన్ని చేపల్ని నేను ఇప్పటి వరకూ చూడలేదు సార్.. అంటూ ... టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అంతే కాదు వద్దు సార్ అంటూ.. నమస్కరించింది.
అంతే కాదు సూపర సింగర్స్ ప్రమోలో ఆ కంటెస్టెంట్ పాటతో పాటు.. అతని మాటలు, సెంటిమెంట్. తన అన్న గురించి అతను చెప్పిన ఎమోషనల్ అయిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
ఇక ఎప్పటి లాగానే ప్రదీప్ శ్రీముఖిపై పంచుల వర్షం కురిపిస్తూ.. ఓఆట ఆడుకున్నారు. అంతే కాదు.. మెంటర్స్ గా ఉన్న సింగర్స్ ను కూడా ప్రదీప్, శ్రీముఖిలు సరదాగా ఆటపట్టిస్తూ.. ఫన్ ను క్రియేట్ చేశారు.