క్రేజీ రూమర్.. వైష్ణవ్ తేజ్ తో కృతి శెట్టి పెళ్లంటూ... వైరల్ అవుతున్న వార్తలు..
సోషల్ మీడియా రూమర్లకు అడ్డా.. ఆ విషయం తెలిసిందే.. కాని వాటి డోస్ రాను రాను మరింతగా పెరుగుతోంది. ఆడియన్స్ ఊహకు కూడా అందకుండా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ పెళ్ళిపై రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియా రూమర్లకు అడ్డగా మారింది. నెట్టింట్ట రకరకాల వార్తలు షికారు చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ స్టార్లకు ప్రేమలు పెళ్లిల్లు అంటూ.. రకరాల సంబంధాలు అంటగడుతూ....వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మొన్నటి వరకూ మెగా హీరో వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠికి సబంధించిన ప్రేమ విషయాలు వైరల్ అవ్వగా.. ఆ విషయంలో వారు స్పందించలేదు.. కాని చివరకు అనుకున్నదే నిజం అయ్యింది. ఇద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మెగా హీరోలలో సాయి తేజ్ విషయంలో కూడా ఇలాంటి రూమరే షికారు చేస్తుంది. ఇక తాజాగా ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ పెళ్ళి విషయంలో కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి.. సూపర్ హిట్ సినిమాలు చేసిన భామ కృతి శెట్టి తన తొలి సినిమా వైష్ణవ్ జోడీగా ఉప్పెన చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.
మంచి ఫామ్ లో ఉండి.. శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు లాంటి వరుస హిట్లు సాధించిన కృతీ శెట్టి. ఆతరువాత వరుస సినిమాల ప్లాప్ అవ్వడంతో.. ఆఫర్లు తగ్గి ప్రస్తుం ఫామ్ కోల్పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. తాజాగా కృతి శెట్టికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందనేనే ప్రచారం జరుగుతోంది.
అది కూడా మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్ బాగా హైలెట్ అవుతోంది. ఉప్పెన సినిమాతో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలయిందని చెపుతున్నారు. అంతే కాదు త్వరలో వీరు పెళ్ళివార్త సడెన్ గా చెప్పి షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పెళ్లి వార్తలపై కృతి, వైష్ణవ్ ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. అసలు ఇది నిజమో కాదో తెలియదు.. కాని వైరల్ అవుతుంది. ఒక వేళ ఇది నిజం అయితే.. వారు స్పందిస్తారా..? లేక వరుణ్ తేజ్ లాగాసడెన్ సర్ ప్రైజ్ ఇస్తారా అని అంతా చూస్తున్నారు.