Rules Ranjann Movie Review: `రూల్స్ రంజన్` మూవీ రివ్యూ, రేటింగ్..
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం `రూల్స్ రంజన్`. ఏఎం రత్నం తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదుగుతున్న హీరో. `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` చిత్రంతో హిట్ అందుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. `వినరో భాగ్యము విష్ణుకథ` మెప్పించింది. కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యింది. కానీ `మీటర్` దెబ్బకొట్టింది. ఈ సారి పంథా మార్చి.. పూర్తి ఫన్ చిత్రంతో వచ్చాడు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వంలో `రూల్స్ రంజన్` చిత్రం చేశాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. కిరణ్ అబ్బవరం యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్, థ్రిల్లర్ ట్రై చేశాడు. కానీ ఇటీవల వర్కౌట్ కాలేదు. సందేశాలకు దూరంగా కేవలం ఫన్‌ని నమ్ముకుని `రూల్స్ రంజన్` చిత్రాన్ని చేశాడు. రత్నం(జ్యోతి)కృష్ణ సైతం యాక్షన్ ని పక్కని పెట్టి కేవలం కామెడీ సినిమా చేయాలని, ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు శుక్రవారం(అక్టోబర్ 6న) ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో (Rules Ranjann Movie Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథః
మనో రంజన్(కిరణ్ అబ్బవరం) ఐటీ జాబ్ కోసం ముంబాయికి వెళ్తాడు. కానీ హిందీ రాదు, దీంతో ఆఫీసులో అందరు అతన్ని ఆటపట్టిస్తూ ఆడుకుంటారు. ఇలా కాదని అలెక్సా ఆడియో రికార్డింగ్, ట్రాన్స్ లేట్ మిషన్ ద్వారా అందరి ఆటకట్టిస్తూ, తనే తోపు అని నిరూపించుకుంటాడు. దీంతో ఆఫీస్‌లో రూల్స్ తీసుకొచ్చి రూల్స్ రంజన్‌గా మారిపోతాడు. తాను రెంట్‌కి ఉండే ఫ్లాట్‌లో ఆపోజిట్ రూమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్( వెన్నెల కిషోర్) రోజుకో అమ్మాయిని తీసుకొస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. రంజన్ కంటపడతాడు. దీంతో హోనర్‌కి చెప్పి అతన్ని రూమ్ ఖాళీ చేయిస్తాడు. అయితే అనుకోకుండా ఓ రోజు సనా(నేహా శెట్టి) జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబయి వస్తుంది. ఆమెని చూడంతో తన కాలేజ్ రోజులు గుర్తొస్తాయి. ఒకప్పుడు ఆమెని ఎంతగానో ప్రేమించాడు రంజన్. కానీ ఆ విషయం చెప్పలేకపోతాడు. సడెన్‌గా తారస పడటంతో ఆమెని కలిసి తన ఇంటర్వ్యూకి తీసుకెళ్తాడు. ఆమె తనకి జాబ్‌కి వచ్చిందని అబద్దం చెప్పడంతో ఆమెకి తనే పార్టీ ఇస్తాడు. ఆమె కోరిక మేరకు ముంబయి మొత్తం తిప్పిస్తాడు. పబ్‌లో బాగా తాగి స్పృహ లేని స్థితిలో వచ్చి రంజన్ రూమ్‌లో, ఒకే బెడ్ పై పడుకుంటారు. ఆ నెక్ట్స్ డే మార్నింగ్ సనా తిరుపతి వెళ్లిపోతుంది. కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. దీంతో ఆమెని ఎలాగైనా కలవాలనుకుంటాడు. వెన్నెల కిషోర్ ఇచ్చిన సలహాతో తిరుపతి వస్తాడు. తన ఫ్రెండ్స్ హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్షలను కలుస్తాడు. కానీ వారు రంజన్‌ని దెబ్బకొడతారు. సనాని కలవకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు? మరి ఇలాంటి (Rules Ranjann Movie Review) పరిస్థితులో రంజన్ ఏం చేశాడు? సనాని కలిశాడా? తన ప్రేమని వ్యక్తం చేశాడా? ఊర్లో తాను ఆడిన డ్రామా ఏంటి? చివరికి ఏం జరిగిందినేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇటీవల యాక్షన్ సినిమాల జోరు సాగుతుంది. ఆ తర్వాత కామెడీ, ఫన్ మూవీస్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ రెండు జోనర్లదే హవా. అడపాదడపా స్వచ్ఛమైన, కొత్త లవ్ స్టోరీస్, బోల్డ్ లవ్ స్టోరీస్ ఆడుతున్నాయి. కానీ కిరణ్ అబ్బవరం, రత్నం కృష్ణ.. కేవలం కామెడీని నమ్ముకుని `రూల్స్ రంజన్` చిత్రాన్ని చేశారు. ఓ రకంగా వీరు సేఫ్ గేమ్ ఆడారని చెప్పొచ్చు. అయితే ప్రారంభం మాత్రం కిరణ్ అబ్బవరం స్టయిల్‌తోనే సినిమా సాగుతుంది. ఆయన తనలో మాట్లాడుకోవడం, తన కథని తానే చెప్పుకోవడం వంటి సీన్లు కాస్త రొటీన్ ఫీలింగ్ కలిగించినా, కథలోకి వెళ్లాక ఫన్ జనరేట్ కావడంతో అది మర్చిపోయేలా చేస్తుంది. మొదటి భాగంలో ఆఫీసులో హిందీ రంజన్‌ని (Rules Ranjann Movie Review) ఎంప్లాయ్స్ ఆడుకోవడం, వాడుకోవడం, ఆ తర్వాత ఆయన అలెక్సా ద్వారా వారి ఆట కట్టడి చేయడం, తనే రూల్స్ పెట్టడం వంటి సన్నివేశాలు అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఎప్పుడైతే సనా తన లైఫ్‌లోకి వస్తుందో రంజన్ లైఫ్ మారిపోయినట్టుగానే సినిమా కూడా టర్న్ తీసుకుంటుంది. మరోవైపు వెన్నెల కిషోర్ ఎంట్రీతో ఫన్ ట్రాక్ ఎక్కుతుంది.
ఇంటర్వెల్‌కి ముందు, సెకండాఫ్ తర్వాత సినిమా ఫన్ రైడ్‌గా మారిపోతుంది. హీరోయిన్‌తో రంజన్ తిరిగే సన్నివేశాలు, పబ్ సీన్లు కాస్త ఎంగేజ్ చేసేలా ఉంటాయి. ఈ సందర్భంలో వచ్చే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక రంజన్ తిరుపతి వచ్చాక కామెడీ బ్యాచ్ హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌లు, అలాగే సుబ్బరాజు, అజయ్‌లు ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మరింత ఊపందుకుంటుంది. పూర్తిగా ఫన్ సైడ్ తీసుకుంటుంది. కొంత బలవంతపు కామెడీ అనిపించినా, ఆ తర్వాత సిచ్యువేషనల్ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే సినిమాలో క్లైమాక్స్ ని బాగా రాసుకున్నారు దర్శకుడు. ఊహించని ట్విస్ట్ లు, హీరో వేసే ప్లాన్లు, సుబ్బరాజు, అజయ్‌ల అమాయకత్వం (Rules Ranjann Movie Review) వంటి సీన్లు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో అంతకు ముందు బోరింగ్ సీన్లని మర్చిపోయేలా చేస్తుంది. క్లైమాక్స్ కి సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. అక్కడ హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ ప్లాన్ బెడిసికొట్టడం, వెన్నెల కిశోర్, కిరణ్ అబ్బవరం ప్లాన్ వర్కౌట్ కావడం, ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం అలరించాయి. చివరగా వెన్నెల కిషోర్ ఇచ్చే ట్విస్ట్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తుంది.
ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. సెకండాఫ్ కోసం మొదటి భాగం ఫేస్ చేయాల్సిన పరిస్థితి లేకుండా ఇంకా అక్కడ ఫన్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. కిరణ్ అబ్బవరం ప్రారంభంలో తనలో తాను మాట్లాడుకునే సీన్లు కూడా బోర్ అనిపిస్తాయి. దానికి ఆల్టర్‌నేట్‌గా ప్లాన్ చేయాల్సింది. ముంబయి ఆఫీస్ సీన్లు విషయంలో జాగ్రత్తగా రాసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. సినిమా స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా చేయాల్సింది. కథలో బలంగా లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. `సమ్మోహనుడా` సాంగ్ వెండితెరపై బాగా పండింది. హైలైట్‌గా నిలుస్తుంది. అందులో రొమాన్స్ కుర్రకారుని ఆద్యంతం అలరిస్తుంది.
నటీనటులుః
మనో రంజన్, రూల్స్ రంజన్, పబ్ రంజన్ ఇలా డిఫరెండ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా చేశాడు. అదే సమయంలో తనలో తాను గునుగుకునే సీన్లు, ఆయా డైలాగ్లు కొంత బోర్ తెప్పిస్తాయి. కానీ సెకండాఫ్ తర్వాత తనని తాను మర్చిపోయేలా చేశాడు. తనలోని కొత్త షేడ్‌ని ఆవిష్కరించాడు. సెకండాఫ్‌లో బాగా చేశాడు. నేహా శెట్టి రాధిక(డీజేటిల్లు) ఛాయలను టచ్ చేస్తూ గ్లామర్ బ్యూటీగా మెప్పించింది. సమ్మోహనుడా సాంగ్‌లో రెచ్చిపోయింది. తన ఫ్యాన్స్ ని సాటిస్పై చేసేలా ఆమె నటన, గ్లామర్ ఉండటం (Rules Ranjann Movie Review) విశేషం. ఇక వెన్నెల కిషోర్ మరోసారి రెచ్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్లేబాయ్ పాత్రలో రచ్చ చేశాడు. క్లైమాక్స్ లో విజృంభించాడు. హైపర్ ఆది, సుదర్శన్, హర్షలు కాస్త వెరైటీ పాత్రల్లో కనిపించారు. కానీ నవ్వేంచే ప్రయత్నం గట్టిగానే చేశారు. గోపరాజు రమణ ఎప్పటిలాగే నవ్వించాడు. సుబ్బరాజు, అజయ్ పాత్రలు సైతం నవ్వించేలా ఉండటం విశేషం. మిగిలిన పాత్రలు ఉన్నంతలో కామెడీ చేసేందుకు ప్రయత్నించి ఓకే అనిపించాయి.
టెక్నీకల్‌గాః
సినిమా టెక్నికల్‌గా బాగుంది. అమ్రిష్ గణేష్ సంగీతం సినిమాకి ప్లన్ అవుతుంది. రెండు పాటలు అదిరిపోయాయి. ముఖ్యంగా `సమ్మోహనుడా` సాంగ్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లింది. సినిమాలో అది బాగా వర్కౌట్ అయ్యింది. మిగిలిన పాటలు కూడా ఆ రేంజ్‌లో ఉంటే అది సినిమాకి మరింత ప్లస్ అయ్యాడే. దులీప్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. ఎడిటర్ వర ప్రసాద్ ఇంకా షార్ప్ చేయాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సీన్లు తీసేయాల్సింది. మరింత క్రిస్పీగా ఉండేది. నిర్మాణ (Rules Ranjann Movie Review) విలువలు బాగున్నాయి. దర్శకత్వం విషయంలో దర్శకుడు జస్ట్ ఫన్ సీన్లపైనే ఫోకస్ పెట్టాడు. అందులోనూ సెకండాఫ్ విషయంలోనే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. మొదటి భాగంలోనూ అలాంటి ఫన్ సీన్లు పెట్టాల్సింది. దీంతో మొదటి భాగం చాలా వరకు తేలిపోయింది. అలాగే కథ బలంగా రాసుకోవాల్సింది. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా చేస్తే పూర్తి ఫన్ రైడ్‌లా ఉండేది. కానీ ఆయన గత చిత్రాలతో పోల్చితే `రూల్స్ రంజన్` బెటర్‌గా ఉందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అలరించే `రంజన్`. జస్ట్ టైమ్ పాస్ మూవీ.
రేటింగ్‌ః 2.75
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్