పక్కాగా ప్రేమ పెళ్లి చేసుకుంటా... ఆ హీరో అంటే ప్రాణం అంటోన్న రుక్సార్ థిల్లాన్
ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ల లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్సార్ థిల్లాన్. కన్నడ నాట హీరోయిన్ గాస్టార్ట్ అయ్యి.. బాలీవుడ్ ను పలకరించి.. టాలీవుడ్ చేరింది బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో మంచి ఇమేజ్ సాధిస్తోంది. ఈ అందమైన ముద్దు గుమ్మ ప్రేమ పెళ్లి గురించి తన అభిప్రాయం చెపుతోంది.

రుక్సార్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. రిలీజ్ కు రెడీగా ఉంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈసినిమా మే 6న రిలీజ్ కాబోతోంది. విద్యాసాగర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాను నిర్మించారు. ఈసినిమా ప్రమోషన్స్ తో అందరిని ఆకర్షిస్తోంది బ్యూటీ.
ఈసినిమా రిలీజ్ అవ్వకముందే అందరి చూపును తన వైపు తిప్పుకుంది రుక్సార్. గతంలో ఆకతాయ్, అల్లు శిరీష్ తో ఎబిసిడి, లాంటి సినిమాలు చేసింది రుక్సార్. బాలీవుడ్ లో కూడా మూవీస చేస్తోంది. టాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి ఆమెకు.
ఇక కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే చాలు అంటోంది రుక్సార్. సినిమాలో తన క్యారెక్టర్ డ్యూరెషన్ గురించి పెద్దగా పట్టింపులు లేవు అంటోంది. ఎలాంటి పాత్రైనా చేస్తాను. అలాగే ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు అని అన్నారు హీరోయిన్ రుక్సార్ థిల్లాన్. తన సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది థిల్లాన్.
అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఈవెంట్స్ లో బిజీగా ఉంది రుక్సార్ థిల్లాన్. ఈ సందర్భంగా తన మనసులో మాటను వెల్లడించింది. రుక్సార్ మాట్లాడుతూ.. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా సందేశాత్మకంగా పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు అంటూ సినిమా సక్సెస్ పై ధీమా వ్యక్తం చేసింది.
ఇక ఈ సినిమాలో నేను మాధవి అనే సింపుల్ గాళ్ పాత్రలో కనిపించబోతున్నానంటుంది రుక్సార్. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి. ఇది తనకు ఓ చాలెంజ్‌లా అనిపించిందట. ఇక స్క్రీన్‌పై విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటుంది హీరోయిన్. డైరెక్టర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటూ... యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఇచ్చారంటోంది రుక్సార్ థిల్లాన్.
ఇక తన పర్సనల్ డీటైల్స్ కూడా కొన్ని పంచుకుంది థిల్లాన్. టాలీవుడ్ దర్శకులు సుకుమార్‌గారంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టింది రుక్సార్. అంతే కాదు యాక్టింగ్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఒక సినిమా చేసినా చాలు అటోంది బ్యూటీ.
కోవిడ్ వల్ల వరుసగా సినిమాలు చేయలేకపోయానంటోంది రుక్సార్ థిల్లాన్. రీసెంట్‌గా హిందీలో ఓ వెబ్ షో చేశానన్నారు రుక్సార్. అంతే కాదు మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే. నేనూ ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నా. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటోంది రుక్సార్.