MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Devatha: అక్క గురించి తప్పుగా ఆలోచిస్తున్న సత్య.. మాధవ మీద అసహ్యన్నీ చూపించిన రాధ!

Devatha: అక్క గురించి తప్పుగా ఆలోచిస్తున్న సత్య.. మాధవ మీద అసహ్యన్నీ చూపించిన రాధ!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 10 2022, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... మాధవ్ ఇంటికి వచ్చి నన్ను అలా దారిలో వదిలేసావ్,కార్ తో తొక్కించబోయావు అని తిట్టగా  తొక్కించలేదు సంతోషించండి అని రుక్మిణి జవాబిస్తుంది. నీకోసం కాకపోయినా దేవి కోసమైనా నువ్వు ఆలోచిస్తే బాగుంటుంది అని అంటాడు మాధవ్. రుక్మిణి చాలా కోపంతో నేను ఇంకా మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అంటే అది మీ అమ్మానాన్న మొఖం చూసి ,చిన్మయి ముఖం చూసి మాత్రమే దాన్ని మీరు అలుసుగా తీసుకోవద్దు అని అంటుంది.నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు ఏ దిక్కుకు వెళ్లాలో తెలియని సమయంలో మా అమ్మ నాన్న నిన్ను ఇంటికి తీసుకొని వచ్చారు అని మాధవ్ అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు రుక్మిణి,అలా దయగల హృదయం అనుకున్నాను గాని నీ మనసులో స్వార్థం ఉంటుందని నేను అనుకోలేదు.నా జీవితంలో ఈ తాళి ఉన్నంతవరకు,ఈ ప్రాణం ఉన్నంతవరకు నా పెనిమిటి, ఆఫీసర్ సరే అంతకు మించి నా జీవితంలోకి ఇంకెవరైనా వస్తే ఆ క్షణం నన్ను నేను సమాధి చేసుకుంటాను అని గట్టిగా చెప్తుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో దేవి చాలా బాధపడుతూ ఉంటుంది.అసలు వాళ్ళ నాయన ఎవరు? ఎందుకిలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. స్కూల్లో దేవి చిన్మయి తింటూ ఉండగా తోటి స్నేహితులు ఇంకొక ఫ్రెండ్ ని ఉద్దేశిస్తూ తిడతారు.
 

37

"మీ నాయన మంచివాడు కాదని నువ్వు మీ అమ్మతో పాటు ఇంకొకళ్ళు ఇంట్లో ఉంటే దాన్ని చాలా తప్పుగా అనుకుంటారు" అని అంటారు. ఆ మాటలు విన్న దేవి, మా గురించి కూడా నిజం తెలిస్తే ఇలాగే అనుకుంటారు కదా అని బాధపడుతూ ఉంటుంది.అలా గతంలో మాధవ్, వాళ్ళ నాన్న గురించి తనకి చెప్పిన మాటలు, ఫోన్ కాల్ లో జరిగిన మాటలు ఇవన్నీ తలుచుకుంటూ ఎలాగైనా వాళ్ళ నాయనని పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో సత్య ఇల్లు సర్దుతూ మాధవ్ చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 

47

ఈ లోగా దిండు, దుప్పటి తీసుకొని గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆదిత్య తలుపు తీసి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నావు? లోపల పడుకొ, అనగా ఇప్పుడు కూడా నువ్వు లోపల పడుకోమంటుంది నా మీద ప్రేమతో కాదు.బయట పడుకుంటే ఎక్కడ ఆంటీ వాళ్ళు చూసినందుకు తిడతారని అంతే. నువ్వు నాకు ఈ మధ్య ఏ విషయం చెప్పట్లేదు అసలు నేను నీ భార్య నేనా నువ్వు నాకు ఆ విలువ ఇస్తున్నావా? ఎందుకు ప్రతి విషయం నా దగ్గర దాస్తున్నావు? అని అనగా సమాధానం లేక ఆదిత్య మౌనంగా ఉండిపోతాడు.
 

57

సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవిని నా కూతురుగా ఇంట్లోకి తీసుకొచ్చే వరకు నేను ఏమీ చెప్పలేను సత్య అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. ఆ తర్వాత దేవి పడుకుంటూ వాళ్ళ నాన్న గురించి ఆలోచించుకుంటూ ఒకేసారి లెగుస్తుంది."నాన్న" అని గట్టిగా అరుస్తుంది .అప్పుడు రుక్మిణి ఏమైందని కంగారుగా వస్తుంది.అమ్మ,నాన్న ఎక్కడుంటాడో నీకు తెలుసా? మనం ఎందుకు ఎప్పుడు చూడలేదు?ఇన్నేళ్లుగా నాన్నకి మనల్ని ఒకసారి కూడా కలవాలని అనిపించలేదా అని బాధపడుతూ ఉంటుంది.
 

67

అప్పుడు రుక్మిణి, కలవాలనిపిస్తే మీ నాయన వస్తారు అని ఎక్కడున్నారో నాకు తెలియదు ప్రస్తుతానికి పడుకో అని చెప్పి పడుకోపెడుతుంది. చిన్మయి కూడా వచ్చి అక్కడ పడుకుంటుంది.దేవి మాత్రం మనసులో నాయన ఎక్కడున్నాడో నీకు తెలుసు కానీ నువ్వు నాకు చెప్పట్లేదు నువ్వు చెప్పకపోతే నేను వదిలిపెడతానా? నేను ఎలాగైనా నాయన ఎక్కడున్నాడో కనిపెట్టి ఆయన పని పడతాను అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ ఒక గదినిండా చిన్నపిల్లల అబ్బాయి బట్టలు, అమ్మాయి బట్టలు బొమ్మలు సర్ది పెడుతూ ఉంటుంది.
 

77

అక్కడికి వచ్చి ఎవరికోసం ఇవన్నీ అని  దేవుడమ్మ భర్త అడుగుతాడు.దేవిని చూసినప్పుడు మన రుక్మిణి కూడా దేవి అంత వయసు ఉండే ఒక అబ్బాయో అమ్మాయో ఉంటుంది కదా.అందుకే అబ్బాయి బట్టలు అమ్మాయి బట్టలు రెండు కొన్నాను అని అంటుంది అప్పుడు దేవుడమ్మ భర్త, నువ్వు ఆలోచించాల్సింది రుక్మిణి,రుక్మిణి తో ఉన్న బిడ్డ గురించి కాదు.మన బిడ్డ మీద అసలు పెట్టుకున్న సత్య గురించి.వారసుడిని ఇవ్వలేదని చెప్పి ఎంతో బాధపడుతుంది సత్య అమెరికాకి వెళ్లి నయం చేద్దామని బయలుదేరినప్పుడు ఆదిత్య వద్దంటే చేసేదేమీ లేక ఉండిపోయింది. ఎంత కుమిలిపోయి ఉంటుందో ఆలోచించు అని అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved