MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: చిన్మయితో ఒట్టు వేయించుకున్న రుక్మిణి.. ఆదిత్య గురించి దేవుడమ్మతో బాధని పంచుకున్న సత్య!

Devatha: చిన్మయితో ఒట్టు వేయించుకున్న రుక్మిణి.. ఆదిత్య గురించి దేవుడమ్మతో బాధని పంచుకున్న సత్య!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

3 Min read
Author : Navya G
Published : Sep 14 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభం లోనే...చిన్మయి రాధ నీ గట్టిగా హద్దుకుని, అమ్మా నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ నువ్వు వెళ్తే నేను నీతో పాటు వచ్చేస్తాను అని ఏడుస్తుంది. అప్పుడు రాధా చిన్మయితో, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని ఒట్టు తీసుకుంటుంది. అప్పుడు చిన్నయి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళను అని చెప్పమ్మా అని అంటుంది. ఆ తర్వాత రోజు జానకమ్మ లెగిసి, రాత్రంతా మెలకువగానే ఉన్నాను తెల్లవారుజామున నిద్ర పట్టేసినట్టున్నది.ఇంట్లో రాధ ఉన్నదో లేదో అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో రాధా కనిపించదు, దేవి కూడా కనిపించదు, జానకమ్మ భయపడుతుంది. అంతలో మాధవ్ గిటార్ వాయించుకుంటూ, నీకు నాకన్నా ఆదిత్య కట్టిన తాలే ఎక్కువ అన్నావు కదా! 

25

ఏదో ఒక రోజు నేను తాళికట్టి, నిన్ను దేవమ్మని ఇంట్లో బంధించేస్తాను అని అంటాడు. అంతలో జానకమ్మ మాధవ్ దగ్గరికి వెళ్లి రాధ కనిపించట్లేదు అంటే నువ్వు గిటార్ వాయిస్తున్నవెంట్రా అని తిట్టి విషయం అంతా చెప్తుంది. అప్పుడు మాధవ్ నన్ను భయపెట్టడానికి అలా చెప్పుంటదా లేకపోతే నిజంగానే వెళ్ళిపోతుందా అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో రుక్మిణి ఆదిత్య దగ్గరకు వెళుతుంది. ఆదిత్య, అన్ని సర్దుకుని బయటికి వచ్చేద్దామనుకున్నావు కదా చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయావు అని అడగగా, చిన్మయి ఆపేసింది పెనిమిటి. నేను ఇద్దరి పిల్లల్ని ఒకలాగే చూసుకున్నాను, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య తేడా చూపించలేదు. 

35

చిన్మయి ఒకేసారి ఆ ఫోటో చూసి అడిగేసరికి జరిగిందంతా చెప్పాను ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకి వస్తే పాపం అది నన్ను వెతుక్కుంటూ వస్తాను అంటుంది. నేను మన ఇంటికి వచ్చిన రాకపోయినా దేవమ్మని ఎలాగైనా మీ ఇంటికి చేర్చేలా చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ సత్య తో,ఆదిత్య లేచాడ? అని అడగగా, లేవడం, బయటకు వెళ్లిపోవడం కూడా అయిపోయింది అత్తయ్య అని చెప్తుంది సత్య. ఎక్కడికి వెళ్ళాడు అని దేవుడమ్మ అడగగా ఆ వివరాలన్నీ నాతో పంచుకొని చాలా రోజులు అవుతుంది ఆంటీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

45

దేవుడమ్మ మనసులో, సత్య మాటలో నాకు బాధ కనిపిస్తుంది.  భర్త ,తన భార్య ని పాటించుకోవడం లేదు అని తెలిస్తే ఏ భార్య అయినా బాధపడుతుంది కదా! ఒకసారి ఆదిత్యతో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ కంగారుగా ఇంట్లో వెతుకుతూ ఉంటుంది.  ఇప్పుడు నా కోడలేది అంటే నేను ఊర్లో వాళ్ళకి ఏ సంబంధం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా దేవి బాత్రూం నుంచి బయటకు వస్తుంది. దేవి ఇక్కడే ఉన్నాది అంటే రాధ కూడా ఇక్కడే ఉండుంటాది హమ్మయ్య వీళ్ళు వెళ్లిపోలేదు అని అనుకుంటుంది. ఇంతలో రాద అక్కడికి వస్తుంది. మాధవ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు జానకమ్మ రాదతో, అమ్మ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయావు అనుకున్నాను, చాలా భయపడ్డాను అమ్మ. నిన్ను చూసిన వెంటనే నాకు మనశాంతి వచ్చింది అని అంటుంది

55

అప్పుడు రాధా తన గది  లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో సత్య ఏడుస్తూ ఉండగా దేవుడమ్మ ఏమైంది అని అడుగుతుంది అప్పుడు సత్య జరిగిన విషయం అంతా చెప్పి ఇంక పిల్లల కోసం నన్ను అమెరికా తీసుకెళ్లే ఉద్దేశం ఆదిత్య కాలేదు అని చెప్తుంది. అప్పుడు దేవుడమ్మ బాధపడుతూ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?  ఆదిత్య ఎందుకు అలా ఉన్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి దేవికి కరాటే డ్రెస్ వేస్తుంది. అప్పుడు దేవి,మాస్టారు నాకు కరాటే బాగా నేర్పిస్తున్నారు అమ్మా. అందరికన్నా నేనే బాగా చేస్తున్నారట బాగా చేస్తే కొత్త బెల్ట్ కూడా ఇస్తారు నేను ఎలాగైనా దాన్ని సంపాదిస్తాను అని అంటుంది. అప్పుడు చిన్మయి వాళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2లో మరో పాన్‌ ఇండియా హీరో.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి రజనీకాంత్‌ మాస్టర్‌ ప్లాన్‌
Recommended image2
Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
Recommended image3
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved