MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే

Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే

రుద్రవనం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఎనిమిది మంది అదృశ్యం కేసు చుట్టూ రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ సాగుతుంది. నరేశ్ ఆగస్ట్య ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.

3 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rudravanam PS
Image Credit : Asianet News

Rudravanam PS

జీ5లో తాజాగా విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. నరేశ్ అగస్త్య, బెనర్జీ, చారు వాకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్లుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కథ
Image Credit : Asianet News

కథ

రుద్రవనం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ఎనిమిది మంది అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. అదృశ్యమైన వారిలో స్థానిక ఎమ్మెల్యే భైరవులు (రాజా రవీంద్ర) సోదరుడు కూడా ఉండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారుతుంది. దీంతో నిజాయితీగల పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ (నరేశ్ ఆగస్ట్య), సీఐ వేణుగోపాల్ (బెనర్జీ) ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తారు.

మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ శివకుమార్‌కు కొన్ని సమస్యలు ఉంటాయి. భార్య ప్రసవ సమయం దగ్గరపడటంతో కుటుంబ బాధ్యతలు ఒకవైపు, వరుస అదృశ్యాల కేసు మరోవైపు అతడికి సవాలుగా మారతాయి. రాజకీయ ఒత్తిళ్లు, పోలీసు శాఖలోని పైస్థాయి అధికారుల ఆదేశాల మధ్య కేసును ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది.

ఈ క్రమంలో అంజి (చారు వాకన్) అనే వ్యక్తి పోలీసుల అనుమానానికి గురవుతాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఎనిమిది మంది అదృశ్యాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు అంజి ఎవరు? అతడికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? ఎనిమిది మంది హత్యల వెనుక ఉన్న కారణాలేంటి? శివకుమార్ ఈ కేసును ఎలా ఛేదించాడు? అనేది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.

36
విశ్లేషణ
Image Credit : Asianet News

విశ్లేషణ

రుద్రవనం పీఎస్ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘విలంగు’ (2022) వెబ్ సిరీస్‌కు తెలుగు రీమేక్. ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో అందించేటప్పుడు కొత్తదనం చూపించడం దర్శకుడికి పెద్ద సవాలనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, వరుస హత్యలు, నిందితుడి చుట్టూ తిరిగే కథలతో ప్రేక్షకులకు ఇప్పటికే మంచి పరిచయం ఉంది.

ఈ సిరీస్ కథనం సాధారణ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా తరహాలో సాగుతుంది. ప్రారంభ ఎపిసోడ్స్‌లో పోలీస్ స్టేషన్ వాతావరణం, ఎస్ఐ శివకుమార్ వ్యక్తిగత జీవితం, అక్కడి పోలీసుల మధ్య సంబంధాలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. బంగారు ఆభరణాల దొంగతనం, అదృశ్యమైన వ్యక్తుల కేసు వంటి అంశాలను ప్రధాన కథతో అనుసంధానించే విధానం ఆసక్తిని పెంచుతుంది.

అయితే కథలో ఆశించిన స్థాయిలో ఉత్కంఠ కనిపించదు. పోలీసుల దర్యాప్తులో అనేక ఆధారాలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని అర్థం చేసుకోవడంలో పదేపదే తప్పులు జరగడం, నిందితుడి దగ్గరకు చేరడానికి ఎక్కువ సమయం తీసుకోవడం కథనాన్ని నెమ్మదింపజేస్తాయి. పోలీసు వ్యవస్థలోని రాజకీయ జోక్యం, అధికారుల మధ్య ఆధిపత్యం, అవినీతి వంటి అంశాలను కూడా కథలో భాగం చేశారు. ఇవి కథకు వాస్తవికతను తీసుకొచ్చినా, కొన్ని సన్నివేశాల్లో సాగతీత అనిపిస్తుంది.

ఈ సిరీస్‌లో భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా శివకుమార్ తన విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూనే, నేరస్థుల వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆకట్టుకునే అంశం. ఒక నేరస్థుడి పట్ల మానవీయ కోణంలో ఆలోచించడం, అతడి భవిష్యత్తు విషయంలో బాధ్యత తీసుకోవడం కథలో మంచి భావోద్వేగాన్ని అందిస్తుంది.

అయితే మహిళా పాత్రల చిత్రణ విషయంలో రచనలో పరిమితులు కనిపిస్తాయి. ఎక్కువగా మహిళలను గర్భిణులు, బాధితులు, సమస్యల్లో చిక్కుకున్నవారిగా మాత్రమే చూపించడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అలాగే పోలీసుల విచారణలో కస్టడీ హింసను పదేపదే చూపించడం కూడా కథలోని మానవీయ కోణానికి విరుద్ధంగా అనిపిస్తుంది.

మొత్తంగా చివరి ఎపిసోడ్స్‌లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అప్పటివరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచాల్సిన సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపవు. ఇప్పటికే ఇలాంటి కథలు చూసిన వారికి ఇందులో కొత్తదనం తక్కువగానే అనిపిస్తుంది.

46
నటీనటులు
Image Credit : Asianet News

నటీనటులు

శివకుమార్ పాత్రలో నరేశ్ ఆగస్ట్య తనదైన శైలిలో నటించారు. పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో చూపించే నిబద్ధత, మరోవైపు కుటుంబ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే తీరు బాగుంది. అయితే పాత్రలోని భావోద్వేగాలను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో నటన సాధారణంగా అనిపిస్తుంది.

సీఐ వేణుగోపాల్ పాత్రలో బెనర్జీ తన అనుభవంతో ఆకట్టుకున్నారు. రాజా రవీంద్ర పోషించిన ఎమ్మెల్యే భైరవులు పాత్ర కథలో కీలకంగా నిలుస్తుంది. చారు వాకన్ పాత్ర కూడా కథలో ముఖ్యమైన మలుపులకు కారణమవుతుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. అయితే కొన్ని పాత్రలకు మరింత బలమైన పరిచయం, ప్రాధాన్యం ఇచ్చి ఉంటే కథనం ఇంకా ఆసక్తికరంగా ఉండేది.

56
టెక్నికల్‌గా
Image Credit : Asianet News

టెక్నికల్‌గా

దర్శకత్వం పరంగా చూస్తే కథను సహజమైన వాతావరణంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, గ్రామీణ ప్రాంతాల నేపథ్యం కథకు సరిపోయాయి. సినిమాటోగ్రఫీ మిగిలిన సాంకేతిక విభాగాలతో పోలిస్తే కొంత మెరుగ్గా అనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం వేగంగా సాగేది. సంగీతం, నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

రుద్రవనం పీఎస్‌లో చివరి ఎపిసోడ్స్‌లో కొన్ని ఆసక్తికరమైన మలుపులు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు కోరుకునే థ్రిల్ ని అందించలేవు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే కొత్తదనం కోరుకునే వారికి ఈ సిరీస్ పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వకపోవచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఓటీటీ
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్‌.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Related Stories
Recommended image1
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved