MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: హిమను దత్తత తీసుకుంటానని షాక్ ఇచ్చిన రుద్రాణి.. వంటలక్క, డాక్టర్ బాబు ఏం చెయ్యనున్నారు?

Karthika Deepam: హిమను దత్తత తీసుకుంటానని షాక్ ఇచ్చిన రుద్రాణి.. వంటలక్క, డాక్టర్ బాబు ఏం చెయ్యనున్నారు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G | Asianet News
| Updated : Jan 01 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కార్తీక్ (Karthik) తన జీవితంలో వచ్చిన మచ్చ గురించి ఆలోచిస్తాడు. అమ్మ నాన్నల గురించి తలుచుకొని బాధపడుతాడు. ఈలోపు బాబు ఏడుస్తుండగా కార్తీక్ వెళ్లి ఎత్తుకొగా ఏడుపు ఆపేస్తాడు. కార్తీక్ నీకు నాకు ఎ జన్మ బంధమో కానీ నేను ఎత్తుకొగానే ఏడుపు ఆపేస్తున్నావ్ అని మనసులో అనుకుంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక వారణాసి (Varanasi) సౌందర్య దగ్గరకు వచ్చి మోనిత పెట్టిన క్లినిక్ గురించి చెబుతాడు. అంతే కాకుండా అక్కడకు ఎవరు వైద్యం కోసం వెళ్లడం లేదని అంటాడు. ఇక పాలు, కూరగాయలు కూడా బస్తీ వాళ్ళు ఎవరు అమ్మడం లేదని చెబుతాడు. సౌందర్య కార్తీక్ (Karthik) ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పమంటుంది.
 

37

మరోవైపు తమ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళుతున్న శ్రీవల్లి (Srivalli) దంపతులను రుద్రాణి (Rudrani ) మనిషి ఆక్సిడెంట్ చేయిస్తాడు. అక్కడకు స్థానికులు వచ్చి అంబులెన్సు కి ఫోన్ చేసే లోపే ఇద్దరు చనిపోతారు.
 

47

ఒకవైపు మౌనిత (Monitha) హాస్పిటల్ కు రాగానే అక్కడకు వారణాసి (Varanasi) వచ్చి మీరు అర్జెంట్ గా ఈ హాస్పిటల్ తీసేయాలని చెబుతాడు. కానీ మోనిత అవేమి పట్టించుకోకుండా నా ఇల్లు నా ప్లేస్ అన్నీ నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది. ఇక అక్కడి నుంచి బస్తీ     వాళ్ళు వెళ్ళిపోతారు.
 

57

ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న కార్తీక్ రుద్రాణి (Rudrani) దగ్గరకి కోపంగా వస్తాడు. రుద్రాణి ని మాటలతో కడుగుతాడు. కానీ రుద్రాణి ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. వాళ్ళ చావుకి నాకు ఏమీ సంబంధం లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో ఎక్కువ మాట్లాడితే వేరేలా ఉంటుంది అని కార్తీక్ (Karthik) కి వార్నింగ్ ఇస్తుంది.
 

67

మొత్తం నువ్వే చేసావ్ నాకు అంతా తెలుసు అంటాడు కార్తీక్ (Karthik) దానికి తలుపు మూసి అవును.. నేనే చేశాను ఇప్పుడు ఏంటి? అన్నట్టు మాట్లాడుతుంది. రుద్రాణి (Rudraniki) కు కోపం వస్తే ఏదైనా జరుగుతుంది అని చెబుతుంది.
 

77

ఇక కార్తీక్ (Karthik) రుద్రాణి తో చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని పోలీస్ లకు లొంగిపో అని చెబుతాడు. లేకపోతె వేరేలా ఉంటదని వార్నింగ్ ఇస్తాడు. ఇక రుద్రాణి (Rudrani) కి గత ఒప్పందాలను  గుర్తు చేసుకొని నీ కూతురిని కూడా దత్తత తీసుకుంటా అని చెబుతుంది. ఇక ఆ మాటతో సీరియస్ అయిన కార్తీక్ రాద్రాణి ని ఎం చేస్తాడో రేపటి భాగంలో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Fitness: త్రిష అందం వెనుక ఇంత కష్టం ఉందా? 43 ఏళ్లలోనూ 20లా ఎలా?
Recommended image2
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved