- Home
- Entertainment
- Brahmamudi: కొడుకు చెంప పగలగొట్టిన రుద్రాణి.. పోలీస్ ని పిచ్చివాడిని చేసిన మీనాక్షి?
Brahmamudi: కొడుకు చెంప పగలగొట్టిన రుద్రాణి.. పోలీస్ ని పిచ్చివాడిని చేసిన మీనాక్షి?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకు చేసిన పనికి తండ్రికి క్షమాపణ చెప్పుకున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నాకు సరదాలు కోరికలు ఉంటాయి కదా ఎందుకు దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు నువ్వు పెళ్లి చేసేస్తే మీ బాధ్యత తీరిపోయినట్లేనా తాతయ్య అని అడుగుతుంది స్వప్న. లేదమ్మా ఈ సమస్య ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు అంటాడు సీతారామయ్య. భార్యను నిర్లక్ష్యం చేయటం అనేది నిజంగా క్షమించరానిది అంటుంది చిట్టి.
తల్లికి తెలిసినా కొడుకుని వెనకేసుకొస్తుంది అంటే నీ పెళ్లి జరగడం రుద్రానికి ఇష్టం లేనట్లే కదా అంటుంది ధాన్యలక్ష్మి. అంతే కదా ఈ పెళ్లి ఆపడం కోసం రుద్రాణి ఎన్ని ప్రయత్నాలు చేసింది అంటాడు ప్రకాష్. అందరూ కలిసి నా మీద పడతారేంటి అంటూ చిరాకు పడుతుంది రుద్రాణి. మరి నీ కొడుకు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు నువ్వు నిలదీయలేదు.
తల్లిగా నీకు బాధ్యత లేదా అంటాడు సుభాష్. కావ్య ఈ ఇంటికి కోడలుగా వచ్చిన రోజు నాకు నీతులు చెప్పావు ఈరోజు నా వంతు అంటూ అత్తగా పెత్తనం వెలగబెడుతున్నావు కానీ నీ బాధ్యత నీకు గుర్తు రావటం లేదా ఆడవాళ్ళ మధ్య ఎంచుకోవాల్సిన విషయాన్ని నీ కోడలు ఇంతవరకు తీసుకువచ్చింది అంటే తను ఎంత బాధ పడుతుందో అంటుంది అపర్ణ.
ఇంతలోనే అక్కడికి రాహుల్ వస్తాడు. హాల్లో ఉన్న అందరిని చూసి ఈ రాక్షసి ఏదో పెంట పెట్టినట్లుగా ఉంది అనుకుంటాడు. రాహుల్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎందుకు ఇంత లేట్ అయింది అని నిలదీస్తాడు రాజ్. కొంచెం పని ఉంది అందుకే లేట్ అయింది అయినా ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన ఇంత సీన్ అవసరమా అంటాడు రాహుల్. లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయవచ్చు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసిన అవసరం ఏముంది.
నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ కేకలు వేస్తుంది స్వప్న. సీతారామయ్య చిట్టి రాజ్ అందరూ రాహుల్ ని మందలించడంతో ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా అందరి ముందు నన్ను వెధవని చేసేసావు అని స్వప్న మీద కేకలు వేస్తాడు రాహుల్. ఆవేశంగా కొడుకు చంప పగలగొట్టి చేసింది తప్పు మళ్ళీ అరుస్తున్నావా.. నాలుగు గోడల మధ్య ఉండవలసిన విషయాన్ని నీ భార్య పది మంది ముందుకి తీసుకు వచ్చింది.
మళ్లీ ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రావడానికి వీల్లేదు ముందు నీ భార్యని ఎక్కడ నుంచి తీసుకువెళ్ళు అని మందలించడంతో కోపంగా రాహుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నా కొడుకు వల్ల మళ్ళీ ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని తండ్రికి క్షమాపణ చెప్తుంది రుద్రాణి.సీన్ కట్ చేస్తే లేటుగా లేచిన కావ్య కంగారు పడుతుంది.
ఇంతలో ధాన్యలక్ష్మి పిలుపు వినిపించడంతో పరుపుని చూస్తే జరిగినది అంతా తెలిసిపోతుందని దాన్ని కబోర్డ్ లో దాయటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో రాజ్ వాష్ రూమ్ నుంచి వచ్చి దారి ద్వారా జరిగింది తెలుసుకొని అతను కూడా కావ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి ఇంకేదో అనుకొని తలుపు వేసుకోవచ్చు కదా అని సిగ్గుపడుతూ తనే తలుపు వేసేసి వెళ్ళిపోతుంది.
మరోవైపు సేటు కనిపించడం లేదు అంటూ పోలీసులు కనకం ఇంటికి వస్తారు. తను నాకు అన్నలాంటి వాడు ఏం జరిగిందో ఏంటో, అతని గురించి నాకేం తెలియదు కానీ అబద్ధం చెప్తుంది కనకం. పోలీసులు చూసిన కంగారులో ఏం మాట్లాడుతుందో తెలియక తను కంగారు పడుతూ వచ్చిన పోలీస్ కి కూడా పిచ్చెక్కించేస్తుంది మీనాక్షి. పిచ్చెక్కిన ఎస్ఐ ని కానిస్టేబుల్ జాగ్రత్తగా వెనక్కి తీసుకెళ్లిపోతాడు.
మరోవైపు కోపంగా ఉన్న రాహుల్ దగ్గరికి వచ్చి తిట్లకి అవమానాలకి బాధపడే అంత సున్నితంగా నిన్ను పెంచలేదు. అయినా వాళ్లందరికీ అనే అవకాశాన్ని నువ్వే ఇచ్చావు. స్వప్నతో కలివిడిగా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అంటుంది రుద్రాణి. నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావా అంటాడు రాహుల్. అలా నటిస్తున్నాను లేదంటే అందరికీ మన మీద అనుమానం వస్తుంది. నువ్వు కూడా అలాగే చెయ్యు.
లేనిపోని వేషాలు వేసి మనకి ఉన్న అవకాశాల్ని చేజారి పోనివ్వకు అంటూ కొడుక్కి ఉపదేశం చేస్తుంది రుద్రాణి. తరువాయి భాగంలో పపాయ తింటున్న స్వప్నని చూసి అందరూ షాక్ అవుతారు. పపాయ తింటే కడుపు పోతుంది ఎందుకిలా చేస్తున్నావు అంటూ మందలిస్తుంది కావ్య. డాక్టర్ కి ఫోన్ చేయమంటాడు రాజ్. కావ్య, స్వప్న ఇద్దరు కంగారు పడతారు.